Mi A1 రివ్యూ.. రూ.14,999లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఇదే!

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ విభాగంలోని ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షావోమీ (Xiaomi), నెల రోజల క్రితం తన Mi A1 ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

|

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న
ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షావోమీ (Xiaomi), నెల రోజల క్రితం తన Mi A1 ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. "created by Xiaomi and powered by Google" అనే ట్యాగ్‌లైన్‌తో లాంచ్ అయిన Mi A1కు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ ప్రధాన హైలైట్‌గా చెప్పుకోవచ్చు.

Xiaomi Mi A1 Review

అంతేకాకుండా, గూగుల్ లాంచ్ చేసే ప్రతి ఆండ్రాయిడ్ అప్‌డేట్ కొన్నేళ్ల పాటు ఈ ఫోన్‌కు లభిస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫోన్ ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతున్నప్పటికి త్వరలోనే Android 8.0 Oreo అప్‌డేట్‌ను అందుకోబోతంది.

Xiaomi Mi A1 లుక్ అలానే ఫీల్ ఎలా ఉంటుంది..?

Xiaomi Mi A1 లుక్ అలానే ఫీల్ ఎలా ఉంటుంది..?

డిజైనింగ్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటి వరకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన అన్ని రెడ్‌మి డివైస్‌లతో పోలిస్తే అప్‌గ్రేడ్‌లా అనిపిస్తుంది. బ్లాక్, గోల్డ్ ఇంకా రోజ్ గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ముందు భాగంలో అమర్చిన 2.5D కర్వుడ్-ఎడ్జ్ గొరిల్లా గ్లాస్ ఫోన్‌కు ప్రీమియమ్ లుక్‌ను తీసుకువచ్చింది.

గుండ్రటి ఎడ్జులతో పాటు కార్నర్స్ చేతిలో కంఫర్టబుల్ గ్రిప్‌ను ఆఫర్ చేస్తాయి. 7.3 మిల్లీ మీటర్ల మందంతో రూపుదిద్దుకున్న ఈ ఫోన్ బాడీ స్లిమ్ లుక్‌ను సంతరించుకుని ఉంది. పూర్తి మెటల్ బాడీతో వస్తోన్న ఈ ఫోన్ సాలిడ్‌గా కినిపించినప్పటికి, వెనుక భాగం మాత్రం చేతిలోంచి జారుతోన్న

ఫీలింగ్‌ను కలిగిస్తోంది. కాబట్టి ఈ ఫోన్‌తో పాటు కేస్ లేదా బ్యాక్ కవర్‌ను కొనుగోలు చేయటం మంచిది. ఇప్పటికే మార్కెట్లో లభ్యమవుతోన్న Redmi Note 4, Mi Max 2 స్మార్ట్‌ఫోన్‌లతో కంపేర్ చేసి చూసినట్లయితే Mi A1 మరింత ప్రీమియమ్ రేంజ్‌ను కలిగి ఉంది.

షావోమీ తన Mi A1 స్మార్ట్‌ఫోన్‌ను iPhone 7 Plusతో కంపేర్ చేసి చూసింది. వాస్తవానికి ఈ రెండు ఫోన్‌ల మధ్య దగ్గర పోలికలే ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌లలో డ్యుయల్ రేర్ కెమెరాలను ఒకే స్థానంలో ఏర్పాటు చేయటం జరిగింది. antenna లైన్స్ కూడా ఒకే విధంగా ఉంటాయి. ఓవర్ హీటింగ్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకున్న షావోమీ తన Mi A1 యూనిట్లకు డ్యుయల్ పైరోలైటిక్ గ్రాఫైట్ షీట్లను అమర్చింది. ఈ షీట్స్ హీటింగ్‌ను వేగవంతంగా రేడియేట్ చేసి, ఉష్ణోగ్రతలను 2 డిగ్రీల వరకు తగ్గిస్తాయి.

స్ర్కీన్ క్రింద భాగంలో అమర్చిన కెపాసిటివ్ ఆండ్రాయిడ్ నేవిగేషన్ బటన్స్ వేగంగా స్పందిస్తాయి. ఫోన్ కుడి వైపు భాగంలో అమర్చిన పవర్ అలానే వాల్యుమ్ బటన్స్ ఆపరేట్ చేసుకునేందుకు చాలా సులువుగా అనిపిస్తాయి. డ్యుయల్-సిమ్ ట్రేను ఫోన్ ఎడుమ వైపు భాగంలో అమర్చటం జరిగింది.

Infrared emitterను ఫోన్ పై భాగంలో, యూఎస్బీ టైప్-సీ అలానే స్పీకర్ గ్రిల్‌ను ఫోన్ క్రింది భాగంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఫోన్ వెనుక భాగాన్ని పరిశీలించినట్లయితే ముందుగా డ్యుయల్ కెమెరా సెటప్‌తో పాటు టు-టోన్ ఫ్లాష్‌లు కనిపిస్తాయి. ఆ తరువాత ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఫోన్ బోటమ్ భాగంలో Mi లోగోతో పాటు ఆండ్రాయిడ్ వన్ లోగోలు దర్శనమిస్తాయి.

 

Xiaomi Mi A1 స్పెసిఫికేషన్స్..?

Xiaomi Mi A1 స్పెసిఫికేషన్స్..?

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు Android Oreo), 2.0GHz ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్, అడ్రినో 506 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ (వైడ్ యాంగిల్ సెన్సార్) + 12 మెగా పిక్సల్ (టెలీ ఫోటో లెన్స్) రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్, వై-ఫై, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 3080 mAh హై-కెపాసిటీ బ్యాటరీ, అన్‌లిమిటెడ్ గూగుల్ ఫోటో స్టోరేజ్, మెటల్ యునిబాడీ డిజైన్ విత్ రౌండెడ్ ఎడ్జెస్.

Xiaomi Mi A1 కెమెరాల పనితీరు...

Xiaomi Mi A1 కెమెరాల పనితీరు...

Xioami Mi A1లో నిక్షిప్తం చేసిన డ్యుయల్ కెమెరా యూనిట్ 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ కాంభినేషన్‌తో ఉంటుంది. వీటిలో ఒకటి టెలీఫోటో లెన్స్ కాగా మరొకటి స్టాండర్డ్ లెన్స్. ఈ లెన్స్‌స్ ద్వారా 2x ఆప్టికల్ జూమ్‌తో పాటు బ్లర్ చేయబడిన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌లను రాబట్టవచ్చు.

ఈ కెమెరా తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తోంది. portrait modeలో తమ ఫోన్ కెమెరా ఆఫర్ చేసే పెర్ఫామెన్స్ ఐఫోన్ 7 ప్లస్, వన్‌ప్లస్ 5 కెమెరాలతో మ్యాచ్ అవుతుందని షావోమీ చెబుతున్నప్పటికి, మా పరిశీలనలో మాత్రం ఆ స్టాండర్డ్‌కు చేరుకోవాలంటే Mi A1 కెమెరాకు మరిన్ని సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ అవసరమని అనిపిసస్తోంది.

Mi A1 పోన్ రేర్ కెమెరాలో ఆటో ఫోకసింగ్ చాలా వేగవంతంగా ఉంది. వివిధ లైటింగ్ కండీషన్స్‌లో ఇది యాక్యురేట్‌గా పనిచేస్తుంది. ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ (పీడీఏఎఫ్) కెమెరా ఫోకస్‌ను రెప్ప పాటు వేగంతో లాక్ చేసేస్తోంది. ఈ కెమెరాతో చిత్రీకరించిన landscape షాట్స్ ఆకట్టుకున్నప్పటికి, macro షాట్స్‌లో మాత్రం షార్ప్‌నెస్ లోపించింది.

high-contrast సీన్‌లను క్యాప్చుర్ చేస్తున్న సమయంలో పలు ఎక్స్‌పోజర్ సమస్యలను ఈ కెమెరా ఫేస్ చేస్తోంది. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా మంచి లైటింగ్ కండీషన్స్‌లో హై-క్వాలిటీ ఫెర్ఫామెన్స్‌ను ఆఫర్ చేస్తోంది. సెల్ఫీలకు సంబంధించి డిటేల్స్ చాలా క్లారిటీగా ఉన్నాయి. చీకటి వాతావరణంలో చిత్రీకరించుకునే సెల్ఫీలు మరింత డార్క్‌గా కనిపిస్తున్నాయి.

Xiaomi Mi A1 మొత్తం పనితీరు..

Xiaomi Mi A1 మొత్తం పనితీరు..

ముందుగా ఈ ఫోన్ స్ర్కీన్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిస్‌ప్లే చాలా ప్రకాశవంతంగా ఉంది. టెక్ట్స్ అలానే ఇమేజెస్ మరింత షార్ప్‌గా కనిపిస్తున్నాయి. వ్యూవింగ్ యాంగిల్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. డైరెక్ట్ సన్‌లైట్‌లో డిస్‌ప్లే గ్లాస్ మరింత రిఫ్లెక్ట్ అవుతుండటంతో బ్రైట్నెస్‌ను అడ్జస్ట్ చేసుకోవల్సి వస్తోంది. 5.5 అంగుళాల డిస్‌ప్లే హై-క్వాలిటీ కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేస్తోంది.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జీబి ర్యామ్ వంటి అంశాలు వేగవంతమైన మల్టిటాస్కింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. టచ్ రెస్పాన్స్ ఆకట్టుకునే విధంగా ఉంది. హెవీ గ్రాఫికల్ గేమ్స్ ఆడుతోన్న సమయంలో ఫోన్ నిదానించటం వంటివి జరగలేదు. గేమ్స్ ఆడుతున్నపుడు గాను, చార్జ్ చేస్తున్నపుడుగాని ఎటువంటి హీటింగ్ సమస్యలను గుర్తించలేదు. 4జీ VoLTE కనెక్టువిటీ ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా కాల్ క్లారిటీ బాగుంది. IR emitter ఎటువంటి అంతరాయం లేకుండా వర్క్ అవుతోంది. ఫోన్ స్పీకర్ కూడా బాగా వర్క్ అవుతోంది .

Mi A1 బ్యాటరీ లైఫ్..

ఈ ఫోన్‌లో నిక్షిప్టం చేసిన 3080mAh బ్యాటరీ యూనిట్ సింగిల్ చార్జ్ పై 15 గంటల హెవీ యూసేజ్‌కు ఉపకరిస్తోంది. హైడెఫినిషన్ వీడియోలను రన్ చేస్తే 10 గంటల పాటు బ్యాటరీ వర్క్ అవుతోంది. ఫోన్ పూర్తిగా చార్జ అవటానికి రెండు గంటల సమయం తీసుకుంటోంది.

మేమిచ్చే సజెషన్ ఏంటంటే..?

రూ.14,999 ధర ట్యాగ్‌లో Mi A1ను బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా చెప్పుకోవచ్చు. ఫోన్ డిజైనింగ్ దగ్గర నుంచి అంతర్గత విభాగాల పనితీరు వరకుస అన్ని అంశాలు ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. stock Android ఎక్స్‌పీరియన్స్ Mi A1కు ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ఫోన్‌కు సంబంధించి బ్యాటరీ లైఫ్ అలానే లో-లైట్ ఫోటోగ్రఫీ విభాగాల పై షావోమీ మరింత ఫోకస్ చేసి ఉంటే బాగుండేది. Mi A1 ఫోన్‌లను Flipkart, Mi.comలతో పాటు Mi Home స్టోర్‌లలో విక్రయిస్తున్నారు.

Best Mobiles in India

English summary
Xiaomi Mi A1 Review. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X