రూ.15,000లో బెస్ట్ డ్యుయల్ కెమెరా ఫోన్స్ ఈ నాలుగే!

Xiaomi Mi A1 రాకతో బడ్జెట్ ఫ్రెండ్లీ డ్యుయల్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ల మధ్య పోటీ మరింతగా రాజుకుంది. షియోమి Mi 5X స్మార్ట్‌ఫోన్‌కు టోన్డ్-అప్ వర్షన్‌గా భావిస్తోన్న Mi A1 ఫోన్‌ను ప్రత్యేకించి గూగుల సర్వీసుల కోసం ఆప్టిమైజ్ చేయబడిన గూగల్ Android One ప్లాట్‌ఫామ్‌తో షియోమి ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్‌కు డ్యుయల్ కెమెరా సెటప్ మరో టాప్‌లైన్ ఫీచర్‌గా నిలుస్తుంది. మార్కెట్లో Mi A1 ఫోన్‌కు ప్రత్యామ్నాయంగా Moto G5S Plus, Lenovo K8 Note, Coolpad Cool Play 6లు అందుబాటులో ఉన్నాయి. ఈ నాలుగు ఫోన్‌లకు డ్యుయల్ కెమెరా సెటప్ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. వీటి మధ్య Spec Comparisonను పరిశీలించినట్లయితే..

Read More : Android One అంటే ఏంటి..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిజైన్ అండ్ డిస్‌ప్లే

షియోమి ఎంఐ ఏ1 : ఫుల్ మెటల్ బాడీ విత్ 5.5 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

మోటో జీ5ఎస్ ప్లస్ : ఫుల్ మెటల్ బాడీ విత్ 5.5 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

లెనోవో కే8 నోట్ : ఫుల్ మెటల్ బాడీ విత్ 5.5 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6: ఫుల్ మెటల్ బాడీ విత్ 5.5 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

 

డిజైన్ అండ్ డిస్‌ప్లే విభాగంలో విన్నర్ ఎవరంటే..?

ఈ నాలుగు ఫోన్‌లకు సంబంధించి డిస్‌ప్లే ఇంకా డిజైన్ అంశాలను పరిశీలించిన తరువాత స్లీక్ డిజైన్ కారణంగా షియోమి ఎంఐ ఏ1 రేసులో ముందంజలో నిలిచింది.

హార్డ్‌వేర్

షియోమి ఎంఐ ఏ1 : స్నాప్‌డ్రాగన్ 625 2GHz 64-బిట్ ఆక్టా కోర్ ప్రాసెసర్ విత్ 4జీబి ర్యామ్

మోటో జీ5ఎస్ ప్లస్ : స్నాప్‌డ్రాగన్ 625 2GHz 64-బిట్ ఆక్టా కోర్ ప్రాసెసర్ విత్ 4జీబి ర్యామ్

లెనోవో కే8 నోట్ : మీడియాటెక్ హీలియో ఎక్స్23 డెకా-కోర్ చిప్‌సెట్ విత్ 3జీబి, 4జీబి ర్యామ్ వేరియంట్స్

కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6: క్వాల్కమ్ ఎమ్ఎస్ఎమ్ 8976 ప్రో స్నాప్‌డ్రాగన్ 653 ఆక్టా-కోర్ ప్రాసెసర్ విత్ 6జీబి ర్యామ్

 

హార్డ్‌వేర్ విభాగంలో విన్నర్ ఎవరంటే..?

ఈ నాలుగు ఫోన్‌లకు సంబంధించి హార్డ్‌వేర్ అంశాలను పరిశీలించిన తరువాత కే8 నోట్, కూల్ ప్లే 6లతో పోలిస్తే Xiaomi Mi A1, Moto G5S Plusలు బెస్ట్ క్వాలిటీ ప్రాసెసర్‌లను కలిగి ఉన్నాయి. ఎక్కువ ర్యామ్ ను కొరుకునే వారికి మాత్రం Cool Play 6 బెస్ట్ ఆప్షన్.

సాఫ్ట్‌వేర్

షియోమి ఎంఐ ఏ1 : ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ స్టాక్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్

మోటో జీ5ఎస్ ప్లస్ : ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ స్టాక్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్

లెనోవో కే8 నోట్ : ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ స్టాక్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్

కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6: ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ విత్ జర్నీ1.0 యూజర్ ఇంటర్‌ఫేస్.

 

సాఫ్ట్‌వేర్ విభాగంలో విన్నర్ ఎవరంటే..?

ఈ నాలుగు ఫోన్‌లకు సంబంధించి సాఫ్ట్‌వేర్ అంశాలను పరిశీలించిన తరువాత స్టాక్ ఆండ్రాయిడ్‌తో వస్తోన్న Xiaomi Mi A1, Moto G5S Plus, Lenovo K8 Noteలు బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది.

స్టోరేజ్

షియోమి ఎంఐ ఏ1 : 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

మోటో జీ5ఎస్ ప్లస్ : 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

లెనోవో కే8 నోట్ : ఈ ఫోన్ 32జీబి, 64జీబి స్టోరేజ్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంటుంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశాన్ని కల్పించారు.

కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6: 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ మాత్రమే.

 

స్టోరేజ్ విభాగంలో విన్నర్ ఎవరంటే..?

ఈ నాలుగు ఫోన్‌లకు సంబంధించి స్టోరేజ్ అంశాలను పరిశీలించిన తరువాత Xiaomi Mi A1, Cool Play 6లతో పోలిస్తే Moto G5S Plus అలానే Lenovo K8 Noteలు బెస్ట్ ఆప్షన్ అనిపిస్తాయి. ఎందుకంటే ఇవి ప్రత్యేకంగా కేటాయించబడిన డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్‌లతో వస్తున్నాయి.

కెమెరా

షియోమి ఎంఐ ఏ1 : 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

మోటో జీ5ఎస్ ప్లస్ : 13 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

లెనోవో కే8 నోట్ : 13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6: 13 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,

 

కెమెరా విభాగంలో విన్నర్ ఎవరంటే..?

ఈ నాలుగు ఫోన్‌లకు సంబంధించి కెమెరా అంశాలను పరిశీలించిన తరువాత Moto G5S Plus బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. సెల్ఫీ ఫోటోలకు Lenovo K8 Note బెస్ట్ ఆప్షన్. Xiaomi Mi A1, Cool Play 6 కెమెరాలు సమానమైన పనితీరును కనబరిచేవిగా ఉన్నాయి.

బ్యాటరీ

షియోమి ఎంఐ ఏ1 : 3080mAh నాన్-రిమూవబల్ Li-Ion బ్యాటరీ,

మోటో జీ5ఎస్ ప్లస్ : 3000mAh నాన్-రిమూవబల్ Li-Ion బ్యాటరీ,

లెనోవో కే8 నోట్ : 4000mAh నాన్-రిమూవబల్ Li-Po బ్యాటరీ,

కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6: 4060 mAh, నాన్-రిమూవబల్ Li-Ion బ్యాటరీ

 

బ్యాటరీ విభాగంలో విన్నర్ ఎవరంటే..?

ఈ నాలుగు ఫోన్‌లకు సంబంధించి బ్యాటరీ విభాగాలను పరిశీలించిన తరువాత Xiaomi Mi A1 , Moto G5S Plusలతో పోలిస్తే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది. సెల్ఫీ ఫోటోలకు Cool Play 6 అలానే Lenovo K8 Noteలు బెస్ట్ ఆప్షన్ అనిపిస్తాయి.

ధరలు

షియోమి ఎంఐ ఏ1 : రూ.14,999, Flipkart అలానే Mi.comలలో సెప్టంబర్ 12 నుంచి ఈ ఫోన్ లభ్యమవుతుంది.

మోటో జీ5ఎస్ ప్లస్ : రూ.15,999, Amazonలో ఈ ఫోన్ ట్రేడ్ అవుతోంది.

లెనోవో కే8 నోట్ : 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999, 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999. Amazonలో ఈ ఫోన్ ట్రేడ్ అవుతోంది.

కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 : ధర రూ.14,999.Amazonలో ఈ ఫోన్ ట్రేడ్ అవుతోంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi A1 Vs Moto G5S Plus Vs Lenovo K8 Note Vs Coolpad Cool Play 6. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot