మోటో జీ5ఎస్ ప్లస్ vs ఎంఐ ఏ1, వీటిలో బెస్ట్ ఫోన్ ఏది..?

Posted By: BOMMU SIVANJANEYULU

రూ.15,000 నుంచి రూ.16,000 ధర సెగ్మెంట్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికి వాటిలో రెండు స్మార్ట్‌ఫోన్‌ల మధ్య మాత్రం హోరాహోరీ పోరు నడుస్తోంది.

మోటో జీ5ఎస్ ప్లస్  vs  ఎంఐ ఏ1, వీటిలో బెస్ట్ ఫోన్ ఏది..?

మోటరోలా నుంచి ఇటీవల మార్కెట్లో లాంచ్ లేటెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ ఫోన్ Moto G5S Plus మరో ఫోన్ Xioami Mi A1తో తీవ్రంగా తలపడుతోంది. ఇంచుమించుగా ఒకే విధమైన స్పెసిఫికేషన్‌లతో లాంచ్ అయిన ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో పైచేయి ఎవరిదో ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిజైన్ పరంగా Mi A1దే పై చేయి..

డిజైన్ పరంగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు మెటల్ యునీబాడీతో వస్తున్నాయి. ఈ రెండు ఫోన్‌లకు మరో ప్రధానమైన హైలైట్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్. Mi A1 వెనుక భాగంలో మర్చిన డ్యుయల్ కెమెరా

ఫ్లాట్‌గా కనిపిస్తే, Moto G5S Plusలో అమర్చిన డ్యుయల్ కెమెరా సెటప్ మాత్రం కొద్దిగా బొడిపిలాగా కనిపిస్తుంది. ఇతర డిజైన్ అంశాలను పరిశీలించినట్లయితే కర్వుడ్ ఎడ్జెస్, యాంటెనా బ్యాండ్స్ అనేవి

ఈ రెండు ఫోన్‌లలో ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటాయి. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఏర్పాటు విషయానికి వచ్చేసరికి Xioami Mi A1కు సంబంధించి స్కానర్‌ను ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేయటం జరిగింది. Moto G5S Plusకు సంబంధించిన ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫోన్ ముందుగా భాగంలో డిస్‌ప్లే క్రింద ఏర్పాటై ఉంటుంది.

ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి శరీర మందాలను పరిశీలించినట్లయితే జీ5ఎస్ ప్లస్ బాడీ 9.5 మిల్లీ మీటర్ల మందంతోనూ, ఎంఐ ఏ1 బాడీ 7.3 మిల్లీమీటర్ల మందంతో రూపుదిద్దుకున్నాయి. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి మోటరోలా మోటో జీ5ఎస్ ప్లస్ 3000mAh బ్యాటరీ యూనిట్ తోనూ, షియోమీ ఎంఐ ఏ1 3080mAh బ్యాటరీ యూనిట్‌లతోనూ వస్తున్నాయి.

స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తే..

డిస్‌ప్లే, ఆపరేటింగ్ సిస్టం, ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్ వంటి విభాగాలను పరిశీలించినట్లయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో ఒకే విధమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ1080x 1920పిక్సల్స్), స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్ వంటి స్పెక్స్ ఈ రెండు ఫోన్‌లలో కామన్‌గా కనిపిస్తాయి.

పెర్పామెన్స్ పరంగా Mi A1దే పై చేయి..

ఇంచుమించుగా ఒకే విధమైన స్పెసిఫికేషన్స్‌తో లాంచ్ అయిన ఈ ఫోన్‌లలో పెర్పామెన్స్ పరంగా Xioami Mi A1 ఫోన్ ఒక్క అడుగు ముందుంది. బెంచ్ మార్కింగ్ ఫలితాల్లోనూ Mi A1 ఫోన్ మోటో జీ5ఎస్‌తో పోలిస్తే ఎక్కువ స్కోరును నమోదు చేయగలిగింది. ఈ రెండు ఫోన్‌లు ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయి. కనెక్టువిటీ పరంగా షియోమీ ఎంఐ ఏ1 అడ్వాన్సుడ్ కనెక్టువిటీ ఫీచర్లను కలిగి ఉంది.

Mi A1 ఫోన్ లేటెస్ట్ యూఎస్బీ టైప్-సీ పోర్టుతో వస్తుంటే, మోటో జీ5ఎస్ ప్లస్ మాత్రం పాత మోడల్ మైక్రో యూఎస్బీ పోర్టుతోనే సరిపెట్టుకుంది. IR emitter అనే మరో స్పెషల్ ఫీచర్ Mi A1 ఫోన్‌కు ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ రిమోట్ కంట్రోల్ ఫీచర్ ద్వారా నేరుగా మీ చేతిలోని ఫోన్‌తోనే ఇంట్లోని టీవీతో పాటు ఇతర గృహోపకరణాలను కంట్రోల్ చేసుకునే వీలుంటుంది.

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి...

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు కొద్దిపాటి కస్టమైజేషన్‌తో కూడిన ప్యూర్ ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ పై బూట్ అవుతాయి. Android One ప్రోగ్రామ్ క్రింద Xioami Mi A1 స్మార్ట్‌ఫోన్‌కు కొన్ని సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ గ్యారంటీగా లభిస్తాయి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ వర్షన్ పై రన్ అవుతోన్న Moto G5S Plus స్మార్ట్‌ఫోన్‌కు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్ ఎప్పుడు లభిస్తుందనేది తెలియాల్సి ఉంది.

బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చేసరికి..

బ్యాటరీ లైఫ్ పరంగా ఈ రెండు ఫోన్‌‍లు పూర్తిస్థాయిలో ఆకట్టుకుంటాయి. Moto G5S Plusలో నిక్షిప్తం చేసిన 3000mAh బ్యాటరీ యూనిట్ సింగిల్ ఛార్జ్ పై 11 గంటల 15 నిమిషాల వీడియో ప్లేబ్యాక్‌ను ప్రొవైడ్ చేస్తుంది. ఇదే సమయంలో Xioami Mi A1లో లోడ్ చేసిన 3080mAh బ్యాటరీ యూనిట్ సింగిల్ ఛార్జ్ పై 10 గంటల 18 నిమిషాల వీడియో ప్లేబ్యాక్‌ను ప్రొవైడ్ చేస్తుంది. పవర్ మేనేజ్‌మెంట్ విభాగంలో మోటో జీ5 ప్లస్‌దే పై చేయిగా ఉంటుంది.

కెమెరా విభాగం...

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తున్నాయి. Moto G5S Plusలో నిక్షిప్తం చేసిన డ్యుయల్ కెమెరా యూనిట్ 13 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ సెన్సార్‌ కాంభినేషన్‌తో ఉంటుంది.

వీటిలో ఒకటి RGB సెన్సార్ కాగా, మరొకటి monochrome సెన్సార్. Xioami Mi A1లో నిక్షిప్తం చేసిన డ్యుయల్ కెమెరా యూనిట్ 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ కాంభినేషన్‌తో ఉంటుంది. వీటిలో ఒకటి టెలీఫోటో లెన్స్ కాగా మరొకటి స్టాండర్డ్ లెన్స్.

ఈ రెండు కెమెరా యూనిట్లు బెస్ట్ క్వాలటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తాయి. హైకాంట్రాస్ట్ సినారియోలతో పాటు లోలైట్ ఫోటోగ్రఫీకి మోటో జీ5ఎస్ బెస్ట్ ఆప్షన్‌‌గా నిలుస్తుంది. ఇన్‌డెప్త్ ఫోటోగ్రఫీకి Mi A1 బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది.

మేమిచ్చే సజెన్స్ ఏంటంటే..?

రూ.15,000 నుంచి రూ.16,000 బడ్జెట్‌లో ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు మంచి ఆప్షన్సే. మీరు Mi A1 ఫోన్‌ను ఎంచుకున్నట్లయితే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఎటువంటి డోకా ఉండదు. ఇదే సమయంలో ఫోన్ ఫెర్మామెన్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటుంది. కెమెరా విషయంలోనూ ఈ ఫోన్ చక్కటి పనితీరును కనబరుస్తుంది. ఒకవేళ మీరు Moto G5S Plusను ఆప్ట్ చేసుకున్నట్లయితే మంచి బ్యాటరీ లైఫ్‌తో పాటు బెటర్ క్వాలిటీ డిస్‌ప్లేను ఆస్వాదించగలుగుతారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi A1 vs Moto G5S Plus: Which Phone Should You Buy? . Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot