Xiaomi Mi A1పై రెండు వేలు తగ్గింపు, ఆఫర్ రెండు రోజులే !

By Hazarath
|

చైనా మొబైల్ దిగ్గజం షియోమి తన ఎంఐ ఏ1 స్మార్ట్‌ఫోన్‌పై రూ. 2 వేల తగ్గింపును అందిస్తోంది. ఈ ఫోన్‌ను సెప్టెంబర్‌లో లాంచ్ చేసిన విసయం అందరికీ తెలిసిందే. కాగా లాంచింగ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ. .14,999గా ఉంది. అయితే ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో నిర్వహించనున్న బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో భాగంగా రూ.2వేల తగ్గింపు ధరతో రూ.12,999 ధరకే ఈ ఫోన్‌ను విక్రయించనున్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ సేల్‌లో భాగంగా ఎంఐ ఏ1 స్మార్ట్‌ఫోన్‌ను యూజర్లు రూ.2వేల తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

 

రూ.15,000లో బెస్ట్ డ్యుయల్ కెమెరా ఫోన్స్ ఈ నాలుగే!రూ.15,000లో బెస్ట్ డ్యుయల్ కెమెరా ఫోన్స్ ఈ నాలుగే!

Xiaomi Mi A1 స్పెసిఫికేషన్స్..

Xiaomi Mi A1 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు Android Oreo), 2.0GHz ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్, అడ్రినో 506 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ (వైడ్ యాంగిల్ సెన్సార్) + 12 మెగా పిక్సల్ (టెలీ ఫోటో లెన్స్) రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్, వై-ఫై, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 3080 mAh హై-కెపాసిటీ బ్యాటరీ, అన్‌లిమిటెడ్ గూగుల్ ఫోటో స్టోరేజ్, మెటల్ యునిబాడీ డిజైన్ విత్ రౌండెడ్ ఎడ్జెస్

డిజైనింగ్
 

డిజైనింగ్

డిజైనింగ్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటి వరకు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన అన్ని రెడ్‌మి డివైస్‌లతో పోలిస్తే అప్‌గ్రేడ్‌లా అనిపిస్తుంది. బ్లాక్, గోల్డ్ ఇంకా రోజ్ గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ముందు భాగంలో అమర్చిన 2.5D కర్వుడ్-ఎడ్జ్ గొరిల్లా గ్లాస్ ఫోన్‌కు ప్రీమియమ్ లుక్‌ను తీసుకువచ్చింది. గుండ్రటి ఎడ్జులతో పాటు కార్నర్స్ చేతిలో కంఫర్టబుల్ గ్రిప్‌ను ఆఫర్ చేస్తాయి. 7.3 మిల్లీ మీటర్ల మందంతో రూపుదిద్దుకున్న ఈ ఫోన్ బాడీ స్లిమ్ లుక్‌ను సంతరించుకుని ఉంది. పూర్తి మెటల్ బాడీతో వస్తోన్న ఈ ఫోన్ సాలిడ్‌గా కినిపించినప్పటికి, వెనుక భాగం మాత్రం చేతిలోంచి జారుతోన్న ఫీలింగ్‌ను కలిగిస్తోంది.

Xiaomi Mi A1 కెమెరాల పనితీరు...

Xiaomi Mi A1 కెమెరాల పనితీరు...

Xioami Mi A1లో నిక్షిప్తం చేసిన డ్యుయల్ కెమెరా యూనిట్ 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ కాంభినేషన్‌తో ఉంటుంది. వీటిలో ఒకటి టెలీఫోటో లెన్స్ కాగా మరొకటి స్టాండర్డ్ లెన్స్. ఈ లెన్స్‌స్ ద్వారా 2x ఆప్టికల్ జూమ్‌తో పాటు బ్లర్ చేయబడిన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌లను రాబట్టవచ్చు. ఈ కెమెరా తక్కువ వెళుతురులోనూ హైక్వాలిటీ ఫోటోగ్రఫీని ఆఫర్ చేస్తోంది.

Mi A1 బ్యాటరీ లైఫ్..

Mi A1 బ్యాటరీ లైఫ్..

ఈ ఫోన్‌లో నిక్షిప్టం చేసిన 3080mAh బ్యాటరీ యూనిట్ సింగిల్ చార్జ్ పై 15 గంటల హెవీ యూసేజ్‌కు ఉపకరిస్తోంది. హైడెఫినిషన్ వీడియోలను రన్ చేస్తే 10 గంటల పాటు బ్యాటరీ వర్క్ అవుతోంది. ఫోన్ పూర్తిగా చార్జ అవటానికి రెండు గంటల సమయం తీసుకుంటోంది.

Best Mobiles in India

English summary
Xiaomi Mi A1 to get Rs. 2000 price cut from Dec 7 to 9, will be available for Rs. 12999 More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X