షియోమి నుంచి 2 కొత్త స్మార్ట్‌ఫోన్లు, కొత్త ఫీచర్లు, ఇండియా ధర వివరాలు !
స్మార్ట్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా మొబైల్ దిగ్గజం షియోమి ఎప్పటికప్పుడు అదిరే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
స్మార్ట్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా మొబైల్ దిగ్గజం షియోమి ఎప్పటికప్పుడు అదిరే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఊపులోనే మరో కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. స్పెయిన్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో షావోమి ఎంఐ ఏ2, ఎంఐ ఏ2 లైట్ పేర్లతో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. కాగా వీటిల్లో ఎంఐ ఏ2 ను ఆగస్టు 8న భారత మార్కెట్‌లోకి తీసుకురానున్నట్టు షియోమి తెలిపింది. రెండో స్మార్ట్‌ఫోన్ భారత్‌లో లాంచింగ్ గురించి కంపెనీ నుంచి ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ ఫోన్ ఫీచ్లర్లు ధర విషయానికొస్తే..

ఎంఐ ఏ2 స్పెషిఫికేషన్లు
5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 18:9 aspect ratio and a 2.5D curved glass, గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 660 ఎస్‌ఓసీ, Adreno 512 graphics chip, 6GB of RAM, 128GB of internal storage, మైక్రో ఎస్ డి ద్వారా విస్తరణ సామరధ్యం, డ్యూయల్ సిమ్(నానో), ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, గూగుల్ ఆండ్రాయిడ్ వన్ ప్రొగ్రామ్, వెనుక వైపు 12 ఎంపీ, 20 ఎంపీతో డ్యూయల్ కెమెరా సెటప్, 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3010 ఎంఏహెచ్ బ్యాటరీ, 4G LTE, dual-band, 158.7x75.4x7.3mm, 168 grams, USB Type-C, Bluetooth v5.0, IR emitter, accelerometer, ambient light sensor, gyroscope, and proximity sensor.

షియోమి ఎంఐ ఏ2 ధర...
4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు భారత్‌కు రావడం లేదు.
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.22,500 ఉండొచ్చు.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర సుమారు రూ.28,100 ఉండొచ్చు.

ఇండియాలో..
కాగా ఇండియాలో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌ను మాత్రమే ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ కింద లాంచ్ చేస్తుందని వెల్లడైంది. అలాగే హైఎండ్ మార్కెట్లోకి 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఆప్షన్ కూడా మన దేశంలో లాంచ్ అవుతుందట.

గోల్డ్, బ్లాక్, బ్లూ రంగుల్లో మాత్రమే ..
గ్లోబల్‌గా లాంచ్ అయిన గోల్డ్, బ్లాక్, బ్లూ రంగుల్లో మాత్రమే కాకుండా.. రోజ్ గోల్డ్ రంగులో కూడా ఈ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లో లభ్యం కానుంది.

ఆగస్టు 8న భారత్‌లో..
షియోమి ఎంఐ ఏ2 స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 8న భారత్‌లో లాంచ్ చేయనున్నామనే విషయాన్ని షియోమి ఇండియా హెడ్ మను కుమార్ జైన్ ధృవీకరించారు.


Click it and Unblock the Notifications








