20 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాతో Mi A2?

|

షియోమి అప్‌కమ్మింగ్ స్మార్ట్‌ఫోన్ Mi A2కు సంబంధించి రోజుకో కొత్త అప్‌డేట్ వెలుగు చూస్తోంది. మిడ్ రేంజ్ స్పెసిఫికేషన్స్‌తో డిజైన్ కాబడిన ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పటికే Mi 6X పేరుతో చైనా మార్కెట్లో లాంచ్ చేసారు. గ్లోబల్ వేరియంట్‌గా భావిస్తోన్న Mi A2ను మరి కొద్ది రోజుల్లో ప్రపంచ మార్కెట్లలోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం. Mi A1కు థీటుగా ఈ ఫోన్ ఉంటుందని తెలుస్తోంది. మార్కెట్ వర్గాలు అంచనా ప్రకారం త్వరలో లాంచ్ కాబోతోన్న Mi A2 చైనా వేరియంట్ అయిన Mi 6Xకు దగ్గర పోలికలను కలిగి ఉండే అవకాశం ఉంది. స్పెసిఫికేషన్స్ పరంగా ఈ రెండు ఫోన్‌లు ఒకేలా ఉండొచ్చని తెలుస్తోంది.

 

వాట్సప్‌ని మరిపించేలా గూగుల్ మెసేజ్ యాప్,ఛాటింగ్‌లో కొత్త అనుభూతివాట్సప్‌ని మరిపించేలా గూగుల్ మెసేజ్ యాప్,ఛాటింగ్‌లో కొత్త అనుభూతి

 20 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాతో Mi A2?

షియోమి ఎంఐ ఏ2 అన్అఫీషియల్ స్పెసిఫికేషన్స్..
5.99 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (స్ర్కీన్ రిసల్యూషన్ విషయానికి వచ్చేసరికి 2160 x 1080 పిక్సల్స్), ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టం విత్ ఆండ్రాయిడ్ 8.1.0 ఓరియో అప్‌డేట్, 1.8గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 20 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3010mAh బ్యాటరీ.

ఇకపై అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 6ఎస్,ఇండియాలో తయారీ !ఇకపై అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 6ఎస్,ఇండియాలో తయారీ !

ట్విట్టర్‌లో ప్రారంభమైన ప్రచార సందడి..
స్విట్జర్లాండ్‌కు చెందిన డిజిటెక్ అనే వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం Mi A2 స్మార్ట్‌ఫోన్ బ్లాక్, బ్లూ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 32జీబి వేరియంట్ ధర CHF 289 (ఇండియన్ కరెన్సీలో రూ.19,800), 64జీబి వేరియంట్ ధర CHF 329 (ఇండియన్ కరెన్సీలో రూ. 22,500), 128జీబి వేరియంట్ ధర CHF 369 (ఇండియన్ కరెన్సీలో రూ. 25,200)గాను ఉంటుందని తెలుస్తోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్ కు నేషనల్ కమ్యూనికేషన్స్ కమీషన్ (తైవాన్) విభాగం నుంచి కూడా క్లియరెన్స్ లభించినట్లు తెలుస్తోంది. Mi A2 లాంచ్ కు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను షియోమి ఇప్పటికే తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రారంభించేసింది.

Mi A2కు ముందు మోడల్ అయిన Mi A1 స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ వన్ ఆపరేటింగ్ సిస్టం (విత్ Android Oreo అప్‌డేట్), 2.0GHz ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 చిప్‌సెట్, అడ్రినో 506 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ (వైడ్ యాంగిల్ సెన్సార్) + 12 మెగా పిక్సల్ (టెలీ ఫోటో లెన్స్) రేర్ ఫేసింగ్ కెమెరా విత్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్, వై-ఫై, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, 3080 mAh హై-కెపాసిటీ బ్యాటరీ, అన్‌లిమిటెడ్ గూగుల్ ఫోటో స్టోరేజ్, మెటల్ యునిబాడీ డిజైన్ విత్ రౌండెడ్ ఎడ్జెస్.

Best Mobiles in India

English summary
The Chinese smartphone maker launched its latest mid-range smartphone, Mi 6X in China in April this year. Its global variant called Xiaomi Mi A2 is not yet available.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X