5300mAh బ్యాటరీతో షియోమి కొత్త ఫోన్ లాంచ్ అయ్యింది
ధర రూ.16,999. జూలై 20 నుంచి మార్కెట్లో దొరుకుతుంది.
చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ Xiaomi తన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ Mi Max 2ను మంగళవారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ధర రూ.16,999. జూలై 20 నుంచి మార్కెట్లో దొరుకుతుంది.

జూలై 27 నుంచి అన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో..
ముందుగా ఈ డివైస్ Mi.com అలానే MiHome స్టోర్‌ల వద్ద దొరుకుతుంది. జూలై 27 నుంచి అన్ని ప్రముఖ ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్ దొరుకుతుంది.

Mi Max ఫోన్‌కు సక్సెసర్ వర్షన్..
గతేడాది మార్కెట్లో లాంచ్ అయిన Mi Max ఫోన్‌కు Mi Max 2 సక్సెసర్ వర్షన్. Mi Max 2 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.

డిస్‌ప్లే, ఆపరేటింగ్ సిస్టం
6.44 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 1080 పిక్సల్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 యూజర్ ఇంటర్‌ఫేస్, 21 షార్ట్‌కట్‌లతో MIUI థీమ్,

ప్రాసెసర్, ర్యామ్, స్టోరేజ్
ఆక్టా కోర్ 2GHz స్నాప్‌డ్రాగన్ 625 సాక్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్

కెమెరా, కనెక్టువిటీ, బ్యాటరీ
12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ సోనీ IMX386 సెన్సార్ విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ సెల్ఫీ సపోర్ట్ అండ్ వీడియో కాలింగ్, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 5300mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్.


Click it and Unblock the Notifications








