తొలిసారిగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో మి మ్యాక్స్ 2 అమ్మకాలు

Written By:

షియోమీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఎంఐ మ్యాక్స్ 2ను ఈ మ‌ధ్యే విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా ఈ ఫోన్ విక్ర‌యాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన‌ ఈ ఫోన్ వరుసగా రూ.16,999, రూ.19,999 ధరలకు వినియోగదారులకు ల‌భిస్తున్న‌ది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్‌ను యూజ‌ర్లు కొనుగోలు చేయ‌వ‌చ్చు.

జియోతో చావో రేవో తేల్చుకుంటాం: ఎయిర్‌టెల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ

ఇప్ప‌టిదాకా షియోమీ ఫోన్లు కేవ‌లం ఆన్‌లైన్‌లో అదీ ఫ్లాష్ సేల్‌లో మాత్ర‌మే ల‌భ్యం కాగా, ఇప్పుడు కొత్త‌గా విడుద‌లైన ఎంఐ మ్యాక్స్ 2 ఫోన్ ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ల‌భ్యం కానుంది.

రెండు మాధ్య‌మాల్లో

ఒకేసారి రెండు మాధ్య‌మాల్లో విడుద‌లైన మొద‌టి షియోమీ ఫోన్ ఇదే కావ‌డం విశేషం.

బిగ్ సి, సంగీత‌, క్రోమా, లాట్‌, రిల‌యన్స్ ల‌లోనూ

ఆన్‌లైన్ స్టోర్స్ అయిన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం మాల్‌, టాటా క్లిక్‌ల‌తోపాటు ఆఫ్‌లైన్ స్టోర్స్ అయిన బిగ్ సి, సంగీత‌, క్రోమా, లాట్‌, రిల‌యన్స్ ల‌లోనూ ఈ ఫోన్ ల‌భిస్తున్న‌ది.

రిల‌య‌న్స్ జియో ఆఫ‌ర్

ఈ ఫోన్ తోపాటు రిల‌య‌న్స్ జియో ఆఫ‌ర్ ల‌భిస్తున్న‌ది. యూజ‌ర్లు రూ.309 ఆపైన రీచార్జి చేసుకుంటే 10 జీబీ 4జీ డేటా అద‌నంగా వ‌స్తుంది. మార్చి 31, 2018 వర‌కు ఇలా 10 సార్లు యూజ‌ర్లు ఆఫ‌ర్‌ను వాడుకోవ‌చ్చు.

షియోమీ ఎంఐ మ్యాక్స్ 2 ఫీచర్లు...

6.44 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, 5300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
xiaomi-mi-max-2-sale-starts-india-price-mi-3rd-anniversary-sale-features Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot