షియోమి సంచలన ఫోన్ రేపే విడుదల

చైనా దిగ్గజం షియోమి తన లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఎంఐ మ్యాక్స్‌ 3ను రేపు అధికారికంగా విడుదల చేయనుంది.

|

చైనా దిగ్గజం షియోమి తన లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఎంఐ మ్యాక్స్‌ 3ను రేపు అధికారికంగా విడుదల చేయనుంది. ఈ డివైజ్‌ గురించి మార్కెట్‌లో వస్తున్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. గత కొన్ని వారాలుగా పలు రూమర్లు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ రూమర్లన్నింటికీ చెక్‌ పెడుతూ.. కంపెనీ అధికారికంగా ఓ టీజర్‌ను విడుదల చేసింది. రేపు విడుదల కానున్న ఎంఐ మ్యాక్స్‌ 3 ఎలా ఉండబోతుందో అపనే దానిపై షియోమి అధికారిక వైబో అకౌంట్‌ ద్వారా ట్విటర్‌ యూజర్లకు ఈ టీజర్‌ను రివీల్‌ చేసింది.

రూ. 501కే జియో ఫోన్, ప్రారంభం అయిన బుకింగ్, ఎలాగో తెలుసుకోండిరూ. 501కే జియో ఫోన్, ప్రారంభం అయిన బుకింగ్, ఎలాగో తెలుసుకోండి

షియోమీ ఎంఐ మ్యాక్స్ 3 ఫీచర్లు

షియోమీ ఎంఐ మ్యాక్స్ 3 ఫీచర్లు

6.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

6.9 అంగుళాల డిస్‌ప్లే

6.9 అంగుళాల డిస్‌ప్లే

ఈ వీడియో ఎంఐ మ్యాక్స్‌ 6.9 అంగుళాల డిస్‌ప్లే, 5500 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో అతిపెద్ద బ్యాటరీ లాంటి ఫీచర్లు ఉన్నాయని చెబుతోంది. కాగా షియోమి విడుదల చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

పైన, కింద ఉన్న బెజెల్స్‌

పైన, కింద ఉన్న బెజెల్స్‌

పైన, కింద ఉన్న బెజెల్స్‌, చాలా పలుచగా ఉంటాయని కంపెనీ వీడియో టీజర్‌ ధృవీకరించింది. అంతేకాక ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ను కలిగి ఉందని పేర్కొంది. వెనుకవైపు కెమెరాకు కింద, ఈ ఫోన్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉందని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి.

ఆసక్తికరమైన ట్వీట్‌

ఎంఐ మ్యాక్స్‌ 3 స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌పై కంపెనీ అధికార ప్రతినిధి ఆసక్తికరమైన ట్వీట్‌ చేసింది. ‘ఎంఐ ఫ్యాన్స్‌, సమ్‌థింగ్‌ బిగ్‌ వస్తోంది! బిగ్‌ స్క్రీన్‌, బిగ్‌ బ్యాటరీ' అని ట్వీట్‌ చేస్తూ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ తేదీని ప్రకటించింది.

ధర

ధర

చైనాలో దీని ధర 1,699 సీఎన్‌వై ఉండొచ్చని అంచనా. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు 17,700 రూపాయలుగా ఉండే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు రేపు లాంచింగ్ సమయంలో తెలిసే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Xiaomi Mi Max 3 Teaser Video Confirms 5500mAh Battery, Shows Thin-Bezel Display Ahead of Launch More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X