భారీ బ్యాటరీతో విడుదలైన Xiaomi Mi Max 3

మొబైల్ దిగ్గజ సంస్థ షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ ఎంఐ మ్యాక్స్‌3 ని తాజాగా చైనాలో విడుదల చేసింది.

|

మొబైల్ దిగ్గజ సంస్థ షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ ఎంఐ మ్యాక్స్‌3 ని తాజాగా చైనాలో విడుదల చేసింది. షియోమీ తన ఎంఐ మ్యాక్స్‌ సిరీస్ లో మొదటిసారి ఎంఐ మ్యాక్స్‌2 ని గతేడాది విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ విడుదలైన 14 నెలల అనంతరం భారీ స్క్రీన్ డిస్‌ప్లే, బ్యాటరీ బ్యాకప్ లాంటి పలు ఆకట్టుకునే ఫీచర్లతో తాజాగా ఎంఐ మ్యాక్స్‌3 ని విడుదల చేసింది. 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ గల స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.17,320 ఉండగా.. 6జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ గల స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.20,375గా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే..

దిగ్గజాలన్నింటికీ ఒక్క ప్లాన్‌తో చెక్ పెట్టిన వొడాఫోన్దిగ్గజాలన్నింటికీ ఒక్క ప్లాన్‌తో చెక్ పెట్టిన వొడాఫోన్

 6.9 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే..

6.9 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే..

Mi Max 3కు 6.9 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే, 5500 బ్యాటరీ, డ్యూయల్‌ రియర్‌ కెమెరాలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. డిస్‌ప్లే నాచ్‌ ఈ హ్యాండ్‌సెట్‌కు లేదు. డార్క్‌ బ్లూ, డ్రీమ్‌ గోల్డ్‌, మెటోరైట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫాబ్లెట్‌ను రూపొందించింది.

ధర, అందుబాటు

ధర, అందుబాటు

ఎంఐ మ్యాక్స్‌ 3 చైనాలో 1,699 సీఎన్‌వై(సుమారు రూ.17,300)గా కంపెనీ నిర్ణయించింది. ఇది బేస్‌ వేరియంట్‌ ధర. బేస్‌ వేరియంట్‌కు 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ఉంది. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌ కలిగిన మరో వేరియంట్‌ ధర 1,999 సీఎన్‌వై(సుమారు రూ.20,400)గా కంపెనీ నిర్ణయించింది. జూలై 20 నుంచి చైనాలో విక్రయానికి రానుంది.

ఎంఐ మ్యాక్స్‌ 3 స్పెషిఫికేషన్లు

ఎంఐ మ్యాక్స్‌ 3 స్పెషిఫికేషన్లు

6.9 అంగుళాల ఫుల్‌ హెచ్డీ ప్లస్‌ డిస్‌ప్లే, క్వాల్‌కామ్‌ ఆక్టా-కోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 636 ఎస్‌ఓసీ, 4 జీబీ/ 6 జీబీ ర్యామ్‌, , 64 జీబీ /128జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌, వెర్టికల్‌ డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌,వెనుకవైపు 12 మెగాపిక్సెల్‌ ప్రైమరీ సెన్సార్‌, 5 మెగాపిక్సెల్‌ సెకండరీ సెన్సార్‌,8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా,మైక్రో ఎస్డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్‌ మెమరీ,డ్యూయల్‌ 4జీ వాయిస్‌ఓవర్‌ ఎల్‌టీఈ సపోర్టు
ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, 5500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

ఎంఐ మ్యాక్స్ 2

ఎంఐ మ్యాక్స్ 2

ఎంఐ మ్యాక్స్ 2 ను 64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైంది. ఈ ఫోన్ వరుసగా రూ.16,999, రూ.19,999 ధరలకు వినియోగదారులకు ల‌భిస్తున్న‌ది. కాగా ఈ ఫోన్‌ను పూర్తిగా మెట‌ల్ బాడీతో త‌యారు చేశారు.

షియోమీ ఎంఐ మ్యాక్స్ 2 ఫీచర్లు

షియోమీ ఎంఐ మ్యాక్స్ 2 ఫీచర్లు

6.44 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, 4జీ వీవోఎల్‌టీఈ, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్, యూఎస్‌బీ టైప్ సి, 5300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

తగ్గిన ఎంఐ మ్యాక్స్ 2

తగ్గిన ఎంఐ మ్యాక్స్ 2

కాగా Xiaomi Mi Max 3 లాంచ్ నేపథ్యంలో ఎంఐ మ్యాక్స్ 2 32 జీబీ వేరియంట్ ధర రూ.13,999కి దిగి రాగా, 64 జీబీ వేరియంట్ రూ.15,999కు అందుబాటులోకి వచ్చింది.

 ఫ్లిప్‌కార్ట్

ఫ్లిప్‌కార్ట్

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్లపై ఎక్స్‌చేంజ్ ఆఫర్‌ను ప్రకటించింది. పాత హ్యాండ్‌సెట్‌‌తో ఎంఐ మ్యాక్స్ 2ను కొనుగోలు చేస్తే ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్‌లో భాగంగా రూ.15 వేల వరకు ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. క్రెడిట్ కార్డులతో జరిపే కొనుగోళ్లకు అదనంగా 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపింది.

Best Mobiles in India

English summary
Mi Max 3 With 5,500mAh Battery, Up to 6GB RAM Launched: Price, Specifications, Features more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X