Mi MIX 2 ఫస్ట్ ఫ్లాష్ సేల్ ఈ రోజే, చైనా రికార్డుకు మూడిందా !
షియోమి నుంచి గత నెల్లో మార్కెట్లోకి వచ్చిన Mi MIX 2 ఈ రోజు అమ్మకానికి రానుంది. భారీ స్క్రీన్ సైజు, బెజెల్ లెస్ డిస్‌ప్లేతో వచ్చిన ఈ చైనీస్ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్ ద్వారా మధ్యాహ్నం 12 గంటల నుంచి భారత్‌లో ఇది విక్రయానికి వస్తున్నట్టు కంపెనీ తెలిపింది.
కాగా ఈ స్మార్ట్‌ఫోన్ తొలి రెగ్యులర్ ఫ్లాష్ సేల్ ఇదే. కాగా ఈ ఫోన్ చైనాలో జరిగిన తొలి ఫ్లాష్ సేల్ లో సెకండ్ల వ్యవధిలోనే పూర్తిగా అమ్ముడుపోయింది. మరి ఇండియాలో ఆ రికార్డును తిరగరాస్తుందా లేదా చూడాలి.

షియోమీ ఎంఐ మిక్స్ 2 ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 × 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

ధర
6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.32,350 ధరకు లభిస్తుండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.35,999 ధరకు, 6 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.39,210 ధరకు లభిస్తున్నది. ఇక 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.46,060 ధరకు లభిస్తున్నది. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 6జీబీ ర్యామ్, 128 జీబీ ర్యామ్ వేరియెంట్ మాత్రమే లభిస్తోంది.

ఈ ఫోన్లకే పోటీ
వన్‌ప్లస్ 5, నోకియా 8, ఎల్‌జీ జీ6లకు పోటీగా ఈ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి దూసుకొచ్చింది. రెగ్యులర్ ఫ్లాస్ సేల్ అనంతరం ఎంఐ హోమ్ స్టోర్, కంపెనీ ఫిజికల్ రిటైల్ పార్టనర్ల వద్ద కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేసుకోవచ్చని షియోమి తెలిపింది.

బెజెల్-లెస్ డిస్‌ప్లే
బెజెల్-లెస్ డిస్‌ప్లే మాత్రమే కాక, మెటాలిక్-సెరమిక్ బాడీ, క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ఎస్‌ఓసీ దీనికి మరో ప్రధానమైన ఆకర్షణలు.

చైనాలో జరిగిన తొలి ఫ్లాష్ సేల్ లో
కాగా చైనాలో జరిగిన తొలి ఫ్లాష్ సేల్ లో ఈ ఫోన్ సెకండ్ల వ్యవధిలోనే పూర్తిగా అమ్ముడుపోయింది. కేవలం 58 సెకన్లలోనే ఈ ఫోన్లన్నీ అమ్ముడుపోవడం విశేషం.


Click it and Unblock the Notifications








