Home
Mobile

Mi Mix 2 లాంచ్ ఈ రోజే, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్..

Xiaomi ఇండియా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న Mi Mix 2 స్మార్ట్‌ఫోన్ ఈ రోజు లాంచ్ కానుంది.

By Hazarath

Xiaomi ఇండియా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న Mi Mix 2 స్మార్ట్‌ఫోన్ ఈ రోజు లాంచ్ కానుంది. రూ. 32, 350 కు ఈ ఫోన్ వినియోగదారులకు లభించే అవకాశం ఉంది. షియోమీ ఎంఐ మిక్స్ 2 నెల రోజుల క్రితమే చైనా మార్కెట్లో లాంచ్ అయ్యింది. ఫోన్ స్సెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే..

ఫోన్ స్సెసిఫికేషన్స్

ఫోన్ స్సెసిఫికేషన్స్

5.99 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.45 గిగాహెడ్జ్ ఆక్టాకార్ స్నాప్డ్రాగెన్ 835 ప్రాసెసర్, 6/8 జీబి ర్యామ్, 64/128/256 జీబి స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నోగుట్, డ్యూయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ప్రింట్ సెన్సార్, 4 జీ ఎల్ఈఇ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 3400 ఎఎహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

ధరలు

ధరలు

6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర RMB 3299 (ఇండియన్ కరెన్సీలో రూ.32,390), 6జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్ వేరియంట్ ధర RMB 3599 (ఇండియన్ కరెన్సీలో రూ.35,387), 6జీబి ర్యామ్ + 256జీబి స్టోరేజ్ వేరియంట్ ధర RMB 3999 (ఇండియన్ కరెన్సీలో రూ.39,210).

స్పెషల్ సిరామిక్ యునిబాడీ ఎడిషన్‌లో ..

స్పెషల్ సిరామిక్ యునిబాడీ ఎడిషన్‌లో ..

Mi Mix 2 స్మార్ట్‌ఫోన్‌ను స్పెషల్ సిరామిక్ యునిబాడీ ఎడిషన్‌లో కూడా షియోమీ విక్రయిస్తోంది. ధర RMB 4699 (ఇండియన్ కరెన్సీలో రూ.46,000). ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే వేరియంట్స్ ఇంకా ధర ట్యాగ్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకొన్ని గంటల్లో తెలిసే అవకాశం ఉంది.

bezel-less డిస్‌ప్లే

bezel-less డిస్‌ప్లే

Mi Mix 2 స్మార్ట్‌ఫోన్‌ bezel-less స్ర్కీన్‌తో రాబోతోంది. ఈ తరహా స్ర్కీన్‌తో వచ్చే ఫోన్ ముందు భాగం దాదాపుగా డిస్‌ప్లేతో కవర్ అయి ఉంటుంది. అంచులు అనేవి చాలా సన్నగా ఉంటాయి. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8, సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8+, సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 8, ఎల్‌జీ క్యూ6, వివో వీ7+, ఐఫోన్ ఎక్స్ వంటి స్మార్ట్‌ఫోన్‌లు bezel-less స్ర్కీన్‌లతో ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. త్వరలో వీటి సరసన Mi Mix 2 చేరబోతోంది.

హైక్వాలిటీ కెమెరా..

హైక్వాలిటీ కెమెరా..

Mi Mix 2 స్మార్ట్‌ఫోన్‌ ప్రధాన కెమెరా యూనిట్‌లో 1.25mm స్మాలర్ కెమెరా మాడ్యుల్‌తో పాటు 1.25-మైక్రాన్ పిక్సల్స్‌తో కూడిన Sony IMX386 sensorను షియోమీ నిక్షిప్తం చేసింది. 4-యాక్సిస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను ఈ కెమెరా సపోర్ట్ చేస్తుంది. ఇదే తరహా ప్రైమరీ కెమెరా యూనిట్‌ను Mi6 స్మార్ట్‌ఫోన్‌లోనూ షియోమీ వినియోగించింది.

శక్తివంతమైన ప్రాసెసర్..

శక్తివంతమైన ప్రాసెసర్..

Mi Mix 2 స్మార్ట్‌ఫోన్‌ శక్తివంతమైన ప్రాసెసర్‌తో రాబోతోంది. ఈ ఫోన్‌లో వినియోగించిన Qualcomm Snapdragon 835 చిప్‌సెట్ బెస్ట్ క్లాస్ పెర్ఫామెన్స్‌ను కనబరుస్తుంది. 6జీబి ర్యామ్‌తో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్ 64GB, 128GB ఇంకా 256GB స్టోరేజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది.

Best Mobiles in India

English summary
Xiaomi Mi Mix 2 to launch in India today, to be Flipkart exclusive Read more at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X