ఆపిల్, శాంసంగ్‌లకు డేంజర్ బెల్స్,అదిరే ఫీచర్లతో షియోమి Mi Mix 2 లాంచ్
చైనా ఆపిల్ షియోమి మార్కెట్లోకి సరికొత్ ఫోన్‌ను తీసుకొచ్చింది.
చైనా ఆపిల్ షియోమి మార్కెట్లోకి సరికొత్ ఫోన్‌ను తీసుకొచ్చింది. 6/8 జిబి ర్యామ్‌లతో Mi Mix 2 ఫ్లాగ్ షిప్ ఫోన్‌ని చైనాలో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఈ ఫోన్ త్వరలో రానున్న ఆపిల్ ఐఫోన్ ఎక్స్‌కి గట్టిపోటీనిస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. అలాగే ఇండియా మార్కెట్లోకి దూసుకురానున్న శాంసంగ్ గెలాక్సీ నోట్ 8కి కూడా భారీ షాక్ నే ఇవ్వబోతోంది. ఫీచర్లు, ధర కూడా తక్కువగానే ఉన్నాయి. ఓ లుక్కేయండి.

డిస్‌ప్లే
మి మిక్స్ 2 భారీ డిస్‌ప్లేతో వచ్చింది. 5.99 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్ రిజల్యూషన్, aspect ratio 18:9. కింది భాగాన బెజిల్ అలాగే ముందుభాగంలో అన్ని పక్కలా ఉండే కర్వ్ డ్ గ్లాస్ ఈ ఫోన్ లో 12 శాతం పెరగనుందని షియోమి తెలిపింది.

ప్రాసెసర్
స్నాప్ డ్రాగన్ 835 Adreno 540 GPU for graphics మీద రన్ అవుతుంది. ఆపిల్ శాంసంగ్ ఫోన్లకు ఉన్నట్లు 3.5 ఎమ్ఎమ్ హెడ్ ఫోన్ జాక్ సపోర్ట్ లేదు.

ర్యామ్
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో వచ్చింది. 6/8 జిబి ర్యామ్ లతో పాటు 64/128/256 ఇంటర్నల్ స్టోరేజ్. 8 జిబి ర్యామ్ ఫోన్ మాత్రం 128 జిబి స్టోరేజ్ కెపాసిటితో వచ్చింది.

కెమెరా
కెమెరా కొంచెం నిరాశగానే ఉన్నట్లు తెలుస్తోంది. వెనుక డ్యూయెల్ ఫ్లాష్ లైట్ తో 12 ఎంపీ. ముందు భాగంలో సెల్ఫీ షూటర్ల కోసం 5 ఎంపీని పొందుపరిచారు.

బ్యాటరీ, ఆపరేటింగ్ సిస్టం
కాగా Mi Mix 2 3400mAh బ్యాటరీతో వచ్చింది. క్విక్ ఛార్జింగ్ 3.0 సపోర్ట్, కంపెనీ MIUI 9 సపోర్ట్ తో ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ మీద పనిచేస్తుంది. 4G LTE, Bluetooth

ధర
6జీబీ ర్యామ్ / 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 3,299(సుమారు రూ.32,335) యెన్‌లుగాను, 6జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 3,599 (సుమారు రూ.36వేలు) యెన్‌గాను, 6జీబీ ర్యామ్ / 256 జీబీ స్టోరేజ్ 3,999 (సుమారు రూ.39 వేలు) యెన్ గాను కంపెనీ నిర్ణయించింది.


Click it and Unblock the Notifications








