వన్‌ప్లస్‌ దెబ్బ, శాశ్వతంగా తగ్గిన షియోమి Mi MIX 2 ధర

|

ఇండియా మార్కెట్లో దూసుకుపోతున్న చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షియోమి అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఎంఐ మిక్స్‌2 ధరను ఇండియాలో శాశ్వతంగా తగ్గించింది. ఈ ఫోన్ గతేడాది మార్కెట్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2017 అ‍క్టోబర్‌లో లాంచింగ్‌ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ 35,999 రూపాయలుగా ఉంటే, తాజాగా ధర తగ్గింపు అనంతరం ఎంఐ మిక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌ను 29,999 రూపాయలకు విక్రయానికి తీసుకొచ్చింది. ఎంఐ మిక్స్‌2పై ధర తగ్గింపును శాశ్వతంగా చేపడుతున్నామని ఎంఐ.కామ్‌, ఎంఐ హోమ్‌, అధికారిక పార్టనర్లలో తగ్గింపు ధరలు అమల్లోకి రానున్నాయని షియోమి పేర్కొంది.

 

ఇక ఇంటర్నెట్ లేకపోయినా జీమెయిల్‌లో వర్క్ చేయవచ్చు!ఇక ఇంటర్నెట్ లేకపోయినా జీమెయిల్‌లో వర్క్ చేయవచ్చు!

షియోమీ ఎంఐ మిక్స్ 2ఎస్ ఫీచర్లు

షియోమీ ఎంఐ మిక్స్ 2ఎస్ ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 64/128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

ఎంఐ.కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లో..

ఎంఐ.కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లో..

ఇప్పటికే ఎంఐ.కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లో ఈ తగ్గింపు ధర అందుబాటులోకి వచ్చింది. జనవరిలో కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ఫై 3వేల రూపాయల ధర తగ్గించి 32,999 రూపాయలకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కాగా జూన్‌ 7న మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను షియోమి భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేయబోతుంది. ఆ స్మార్ట్‌ఫోన్‌ను సెల్ఫీ సెట్రిక్‌ స్మార్ట్‌ఫోన్‌గా షియోమిమి అభివర్ణించింది.

వన్‌ప్లస్‌ 6 దెబ్బ
 

వన్‌ప్లస్‌ 6 దెబ్బ

ఇదిలా ఉంటే షియోమి ప్రత్యర్థి వన్‌ప్లస్‌ తన నూతన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ 6 ను భారత్‌లో లాంచ్‌ చేసిన ఒక్కరోజులోనే ఈ శాశ్వత ధర తగ్గింపును షియోమి చేపట్టింది.

రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో

రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో

వన్‌ప్లస్‌ 6 ప్రస్తుతం రెండు స్టోరేజ్‌ వేరియంట్లలో భారత మార్కెట్‌లోకి వస్తోంది. 6జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.34,999 కాగ, 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 39,999 రూపాయలు. 256జీబీ వేరియంట్‌ భారత్‌కు రావడం లేదు. మూడు రంగులు మిడ్‌నైట్‌ బ్లాక్‌, మిర్రర్‌ బ్లాక్‌, సిల్క్‌ వైట్‌ లిమిటెడ్‌ ఎడిషన్లలో ఈ ఫోన్‌ లభ్యమవుతోంది.

వన్‌ప్లస్‌ 6 మార్వెల్‌ అవెంజర్స్‌ లిమిటెడ్‌

వన్‌ప్లస్‌ 6 మార్వెల్‌ అవెంజర్స్‌ లిమిటెడ్‌

వన్‌ప్లస్‌ 6 మార్వెల్‌ అవెంజర్స్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ ధర రూ.44,999గా కంపెనీ నిర్ణయించింది. మార్వెల్‌ అవెంజర్స్‌ లిమిటెడ్‌ ఎడిషన్‌ను అమెజాన్‌లో మే 29 నుంచి ఓపెన్‌ సేల్‌కు ఉంచనుంది.

వ‌న్ ప్ల‌స్ 6 ఫీచ‌ర్లు

వ‌న్ ప్ల‌స్ 6 ఫీచ‌ర్లు

6.28 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2280 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 64/128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయ‌ల్ సిమ్‌, 16, 20 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, వాట‌ర్ రెసిస్టెన్స్ బాడీ, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, డ్యాష్ చార్జ్‌.

 

 

Best Mobiles in India

English summary
Xiaomi Mi MIX 2 price in India slashed, now available at Rs 29,999 More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X