Mi MIX 2పై భారీ డిస్కౌంట్, ఆఫర్ రెండు రోజులే..
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి తన వినియోగదారులకు మరోసారి శుభవార్తను మోసుకొచ్చింది.
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి తన వినియోగదారులకు మరోసారి శుభవార్తను మోసుకొచ్చింది. తన ఫ్లాగ్ షిప్ బెజెల్స్ స్మార్ట్‌ఫోన్ MI మిక్స్ 2ని భారీ డిస్కౌంట్‌లో అందిస్తోంది. ఈ ఫోన్ ఇప్పుడు రూ. 3 వేల తగ్గింపుతో రూ .32,999 ధరకు లభిస్తోంది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్ కింద జనవరి 5 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఆన్లైన్లో పాటు ఆఫీసు స్టోర్స్ కూడా వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.

ఎంఐ మిక్స్ 2 ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే
1080 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
స్నాప్డ్రాగన్ 835 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 7.0 నౌగట్,ఆండ్రాయిడ్ 8.0 ఓరియో అప్‌డేట్
6 జీబి ర్యామ్
128 జీబి స్టోరేజ్
12 ఎంపి రియర్ కెమెరా
5 ఎంపి సెల్ఫీ కెమెరా
3400 ఎఎహెచ్ బ్యాటరీ


Click it and Unblock the Notifications








