Mi Mix 2 ఇండియా లాంచ్ ఎప్పుడంటే..?
భారీ ఫీచర్లతో దూసుకువచ్చిన ఈ ఫోన్ హై-ఎండ్ మార్కెట్‌ను షేక్ చేయటం ఖాయమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
షియోమి నుంచి కొద్ది గంటల క్రితం చైనా మార్కెట్లో లాంచ్ అయిన Mi Mix 2 స్మార్ట్‌ఫోన్ త్వరలోనే ఇండియాకు రాబోతోంది. ఈ విషయాన్ని షియోమి మేనేజింగ్ డైరెక్టర్ మను జెయిన్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా కన్ఫర్మ్ చేసారు. భారీ ఫీచర్లతో దూసుకువచ్చిన ఈ ఫోన్ హై-ఎండ్ మార్కెట్ ను షేక్ చేయటం ఖాయమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ ఫోన్ మొత్తం మూడు వేరియంట్‌లలో అందుబాటలో ఉంటుంది. వాటి వివరాలు.. 6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ (ఇండియన్ కరెన్సీలో ఈ ఫోన్ ధర రూ.32,346), 6జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్ (ఇండియన్ కరెన్సీలో ఈ ఫోన్ ధర రూ.35,275), 6జీబి ర్యామ్ + 256జీబి (ఇండియన్ కరెన్సీలో ఈ ఫోన్ ధర రూ.39,210). మరో స్పెషల్ ఎడిషన్ లో కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని షియోమి చెబుతోంది. 8జీబి ర్యామ్, 256జీబి స్టోరేజ్ సామర్థ్యంతో లభించే ఆ ఫోన్ ధర ఇండియన్ కరెన్సీలో రూ.46,000గా ఉండొచ్చు.
Mi Mix 2 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్.. 5.99 అంగుళాల సూపర్ అమోల్డ్ bezel-less డిస్‌ప్లే (రిసల్యూషన్ 2160 x 1080పిక్సల్స్), 2.5GHz ఆక్టా కోర్ Snapdragon 835 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 540 జీపీయూ, ఆండ్రాయడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9 యూజర్ ఇంటర్‌ఫేస్, 3400 mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ .


Click it and Unblock the Notifications








