8 సెకండ్లకే ఈ ఫోన్ అవుట్ ఆఫ్ స్టాక్ !

Written By:

షియోమి మరో సంచలనానికి వేదికగా నిలిచింది. షియోమి నుంచి వచ్చే ప్రతీ ఫోన్ మార్కెట్లో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తుందనే అనే నానుడిని నిజం చేస్తూ ఆ కంపెనీ నుంచి వచ్చిన మి మిక్స్ 2 రికార్డుల పరంపరను కొనసాగింది. కేవలం సెకండ్ల వ్యవధిలో ఆ ఫోన్ అమ్మకాలు అయిపోయాయి.

తొలిసారిగా పేటీఎమ్ నుంచి భారీ ఆఫర్లు, రూ.501 కోట్లకు పైనే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్లాష్‌ సేల్‌కు వచ్చిన సెకన్ల వ్యవధిలోనే..

బెజెల్‌-లెస్‌ ఎడ్జ్‌-టూ-ఎడ్జ్‌ డిస్‌ప్లేతో ఇటీవల షియోమి తీసుకొచ్చిన ఎం మిక్స్‌2 స్మార్ట్‌ఫోన్‌, చైనాలో తొలి ఫ్లాష్‌ సేల్‌కు వచ్చింది. ఫ్లాష్‌ సేల్‌కు వచ్చిన సెకన్ల వ్యవధిలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ పూర్తిగా అమ్ముడుపోయింది.

58 సెకన్లలోనే ఈ ఫోన్లన్నీ

కేవలం 58 సెకన్లలోనే ఈ ఫోన్లన్నీ అమ్ముడుపోవడం విశేషం. అయితే ఎన్ని యూనిట్లు అమ్ముడుపోయాయో కంపెనీ వెల్లడించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఎంఐ నోట్‌ 3 కూడా విక్రయానికి వచ్చింది.

తర్వాత సేల్‌ సెప్టెంబర్‌ 19న

చైనీస్‌ వెబ్‌సైట్‌ మైడ్రైవర్స్‌ రిపోర్టు ప్రకారం కేవలం 58 సెకన్లలలో షియోమి ఎంఐ మిక్స్‌2 యూనిట్లన్నీ పూర్తిగా అమ్ముడుపోయినట్టు తెలిసింది.ఈ స్మార్ట్‌ఫోన్‌ తర్వాత సేల్‌ సెప్టెంబర్‌ 19న అందుబాటులోకి రానుంది.

ఐదు లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు

ఈ వారం మొదట్లోనే ఎంఐ మిక్స్‌2కు భారీగా రిజిస్ట్రేషన్ల వెల్లువ కొనసాగిన సంగతి తెలిసిందే. ఐదు లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లను ఇది అధిగమించింది.

ఫీచర్లపై ఓ లుక్కేయండి

మి మిక్స్ 2 భారీ డిస్‌ప్లేతో వచ్చింది. 5.99 ఇంచ్ పుల్ హెచ్ డి డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్ రిజల్యూషన్, aspect ratio 18:9. కింది భాగాన బెజిల్ అలాగే ముందుభాగంలో అన్ని పక్కలా ఉండే కర్వ్ డ్ గ్లాస్ ఈ ఫోన్ లో 12 శాతం పెరగనుందని షియోమి తెలిపింది.

ప్రాసెసర్

స్నాప్ డ్రాగన్ 835 Adreno 540 GPU for graphics మీద రన్ అవుతుంది. ఆపిల్ శాంసంగ్ ఫోన్లకు ఉన్నట్లు 3.5 ఎమ్ఎమ్ హెడ్ ఫోన్ జాక్ సపోర్ట్ లేదు.

ర్యామ్

ఈ ఫోన్ రెండు వేరియంట్లలో వచ్చింది. 6/8 జిబి ర్యామ్ లతో పాటు 64/128/256 ఇంటర్నల్ స్టోరేజ్. 8 జిబి ర్యామ్ ఫోన్ మాత్రం 128 జిబి స్టోరేజ్ కెపాసిటితో వచ్చింది.

కెమెరా

కెమెరా కొంచెం నిరాశగానే ఉన్నట్లు తెలుస్తోంది. వెనుక డ్యూయెల్ ఫ్లాష్ లైట్ తో 12 ఎంపీ. ముందు భాగంలో సెల్ఫీ షూటర్ల కోసం 5 ఎంపీని పొందుపరిచారు.

బ్యాటరీ, ఆపరేటింగ్ సిస్టం

కాగా Mi Mix 2 3400mAh బ్యాటరీతో వచ్చింది. క్విక్ ఛార్జింగ్ 3.0 సపోర్ట్, కంపెనీ MIUI 9 సపోర్ట్ తో ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ మీద పనిచేస్తుంది. 4G LTE, Bluetooth

ధర

6జీబీ ర్యామ్‌ / 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర 3,299(సుమారు రూ.32,335) యెన్‌లుగాను, 6జీబీ ర్యామ్‌ / 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్ 3,599 (సుమారు రూ.36వేలు) యెన్‌గాను, 6జీబీ ర్యామ్‌ / 256 జీబీ స్టోరేజ్‌ 3,999 (సుమారు రూ.39 వేలు) యెన్‌ గాను కంపెనీ నిర్ణయించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi MIX 2 Sold Out in Just 58 Seconds in Its First Sale Read more At Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot