ఫ్లిప్‌కార్ట్‌లోకి మి మిక్స్ 2, Sold Outతో టెన్సన్ టెన్సన్..
షియోమి నుంచి దూసుకొచ్చిన Mi Mix 2 ఇండియాలో తొలిసారిగా ఆన్‌లైన్ సేల్‌లోకి వెళ్లింది.
షియోమి నుంచి దూసుకొచ్చిన Mi Mix 2 ఇండియాలో తొలిసారిగా ఆన్‌లైన్ సేల్‌లోకి వెళ్లింది. ఫ్లిప్‌కార్ట్, మి.కామ్ లాంటి ఈ కామర్స్ సైట్లలో ఇది అమ్మకానికి వచ్చింది.అయితే అక్కడ ఈ ఫోన్ కి సంబంధించి నోటిఫై ఆప్సన్ మాత్రమే ఇచ్చారు.

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఇది నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి యూజర్ల చేతిలోకి రానుంది. ఇండియాలో గత వారం ఈ ఫోన్ లాంచ్ అయిన సంగతి విదితమే. దీని ధర రూ.35,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ OnePlus 5, Nokia 8, LG G6 లాంటి ఫోన్లకు గట్టి పోటీ నివ్వనుంది.

ఎంఐ మిక్స్2 ఫీచర్లు
5.99 అంగుళాల డిస్‌ప్లే
2.4 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్
6జీబీ/8జీబీ ర్యామ్
64జీబీ/128జీబీ, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
12 ఎంపీ రియర్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
ఫింగర్ ప్రింట్ సెన్సార్
3400 ఎంఏహెచ్ బ్యాటరీ
4జీ, వాయిస్‌ఓవర్ ఎల్టీఈ

డిస్కౌంట్
హెచ్‌డీఎఫ్‌సీ కార్డుతో కొనుగోలుచేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను, ఒకవేళ ఫోన్ పే ద్వారా కొనుగోలు చేస్తే 20 శాతం క్యాష్‌బ్యాక్‌ను, యాక్సిస్ బ్యాంకు బుజ్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నారు.

12 నెలల పాటు హంగామా మ్యూజిక్ ఉచితం
ఎంఐ. కామ్‌లో అయితే కంపెనీ 12 నెలల పాటు ఉచితంగా హంగామా మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.

బెజెల్ లెస్ ఎల్‌సిడి డిస్‌ప్లే
కాగా ఈ ఫోన్ 5.99-inch బెజెల్ లెస్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో వచ్చింది.ఈ తరహా స్ర్కీన్‌తో వచ్చే ఫోన్ ముందు భాగం దాదాపుగా డిస్‌ప్లేతో కవర్ అయి ఉంటుంది. అంచులు అనేవి చాలా సన్నగా ఉంటాయి.

bezel-less స్ర్కీన్‌లతో వచ్చిన ఫోన్లు
శాంసంగ్ గెలాక్సీ ఎస్8,శాంసంగ్ గెలాక్సీ ఎస్8+, శాంసంగ్ గెలాక్సీ నోట్ 8, ఎల్‌జీ క్యూ6, వివో వీ7+, ఐఫోన్ ఎక్స్ వంటి స్మార్ట్‌ఫోన్‌లు bezel-less స్ర్కీన్‌లతో ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి.


Click it and Unblock the Notifications








