5G సపోర్ట్ తో చైనా మార్కెట్లోకి విడుదలైన షియోమి ఎంఐ మిక్స్ 3
స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో తక్కువ కాలంలోనే తనదైన మార్క్ వేసుకున్న మొబైల్ మేకర్స్ షియోమి తాజాగా మొబైల్ మార్కెట్‌లోకి మరో అధునాతనమైన మొబైల్‌ని లాంచ్ చేసింది.
స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో తక్కువ కాలంలోనే తనదైన మార్క్ వేసుకున్న మొబైల్ మేకర్స్ షియోమి తాజాగా మొబైల్ మార్కెట్‌లోకి మరో అధునాతనమైన మొబైల్‌ని లాంచ్ చేసింది.నిన్న గురువారం బీజింగ్‌లో జరిగిన ఓ ఈవెంట్‌లో షియోమి ఈ స్మార్ట్ ఫోన్‌ని లాంచ్ చేసింది.ఎలాంటి బెజెల్స్ లేకుండా ఈ ఫోన్‌ని షియోమి రిలీజ్ చేయడం విశేషం. షావోమీ ఎంఐ మిక్స్ 3తో షావోమీ 5జీ ఫోన్ రిలీజ్ చేస్తుందన్న ప్రచారం జోరుగా జరిగింది. అయితే 'ఎంఐ మిక్స్ 3 5జీ' వేరియంట్ చైనాలో 2019 తొలి త్రైమాసికంలో అందుబాటులోకి రానుంది. ఇక ఎంఐ మిక్స్ 3 ఇండియాలో ఎప్పుడు రిలీజ్ కానుందో స్పష్టత లేదు.

ధరలు....
షియోమి ఎంఐ మిక్స్ 3 స్మార్ట్ ఫోన్స్‌లో ప్రారంభ శ్రేణి మోడల్ అయిన 6GB RAM + 128 GB స్టోరేజీ వెర్షన్ ధరలు 3,299 చైనీస్ యువాన్స్ నుంచి మొదలు కానున్నాయి. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 34,800
8GB RAM + 128GB వేరియంట్ మోడల్ ధరలు 3,599 చైనీస్ యువాన్స్( సుమారు రూ.37,900)
8GB RAM + 256GB స్టోరేజీ వేరియంట్ ధరలు 3,999 చైనీస్ యువాన్స్ (సుమారు రూ. 42,100)
10GB RAM + 256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.52,700 గా ఉన్నాయి.

నాలుగు వేరియంట్లలో...
మొత్తం నాలుగు వేరియంట్లలో(6 జీబీ + 128 జీబీ, 8 జీబీ + 128 జీబీ, 8 జీబీ + 256 జీబీ, 10 జీబీ + 256 జీబీ) ఈ ఫోన్ చైనాలో రిలీజైంది. టాప్ ఎండ్ వేరియండ్ 10 జీబీ కావడం విశేషం. 10 జీబీ ర్యామ్‌తో వచ్చిన తొలి ఫోన్ ఇదే. 10w వైర్‌లెస్ ఛార్జర్ ఇస్తోంది షియోమి

సెల్ఫీల కోసం స్లైడర్ కెమెరా...
సెల్ఫీల కోసం స్లైడర్ కెమెరా ఏర్పాటు చేశారు. ఈ స్లైడర్ 3,00,000 సార్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుందని చెబుతోంది కంపెనీ. రియర్‌లో 12 మెగాపిక్సెల్+ ఏఐతో పనిచేసే 12 మెగాపిక్సెల్ కెమెరాలున్నాయి. సెల్ఫీల కోసం 24+2 మెగా పిక్సెల్ కెమెరా ఫిక్స్ చేశారు.

ఫీచర్లు....
6.39 అంగుళాలు ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే, 19:5:9 యాస్పెక్ట్ రేషియో, 2,340 x 1,080 పిక్సెల్స్,6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ , 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ , 8 జీబీ ర్యామ్ స్టోరేజ్ + 256 జీబీ స్టోరేజ్, 10 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్,స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 12 మెగాపిక్సెల్+ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరాలు, 24 + 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలు ,ఆండ్రాయిడ్ 8.0 Oreo, 3,850 ఎంఏహెచ్ బ్యాటరీ, 10w వైర్‌లెస్ ఛార్జర్


Click it and Unblock the Notifications








