ఎడ్జ్‌లెస్ డిస్‌ప్లేతో ‘Mi Mix’

బీజింగ్‌లో నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ తన ఎంఐ నోట్ 2 ఫోన్‌తో పాటు Mi Mix ఫోన్‌ను కూడా లాంచ్ చేసింది. లిమిటెడ్ ఎడిషన్‌లో మాత్రమే లభ్యమయ్యే ఈ ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఫోన్‌ను ఫ్రెంచ్ డిజైనర్ ఫిలప్ స్టార్క్ సహకారంతో షియోమీ అభివృద్థి చేసింది. ఈ ఫోన్‌కు సంబంధించిన ముందస్తు బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నవంబర్ 4 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.

Read More : కొత్త ఫోన్‌ల పై Amazon, Flipkart డిస్కౌంట్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండు వేరియంట్‌లలో ..

ఎడ్జ్‌లెస్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ 4జీబి ర్యామ్ + 128జీబి ఇంటర్నట్ స్టోరేజ్. ధర రూ.34,500(చైనా కరెన్సీలో), రెండవ వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 256జీబి ఇంటర్నల్ స్టోరేజ్. ధర రూ.39,500 (చైనా కరెన్సీలో) .

 

18 క్యారట్ గోల్డ్ ఫినిషింగ్‌‌

Mi Mix ఫోన్‌కు కర్వుడ్ ఎడ్జెస్‌తో వచ్చిన ఎడ్జ్-లెస్ డిస్‌ప్లే ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. 6జీబి ర్యామ్ వేరియంట్‌తో వచ్చే ఫోన్‌కు సంబంధించి కెమెరా లెన్స్, ఇంకా పింగర్ ప్రింట్ సెన్సార్ భాగాల్లో 18 క్యారట్ గోల్డ్ ఫినిషింగ్‌‌ను పొందుపరిచారు. ప్రత్యేకమైన సిరామిక్ బాడీతో వస్తోన్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే...

6.4 అంగుళాల ఎడ్జ్‌లెస్ డిస్‌ప్లే

6.4 అంగుళాల ఎడ్జ్‌లెస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ వచ్చేసరికి 2040 x 1080పిక్సల్స్),2.35గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్ డ్రాగన్ 821 64 బిట్ ప్రాసెసర్, అడ్రినో 530 జీపీయూ.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం

ఈ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఎంఐయూఐ 8 ప్లాట్ ఫామ్ పై రన్ అవుతుంది.

శక్తివంతమైన బ్యాటరీ

క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీతో కూడిన శక్తివంతమైన 4,400 ఎమ్ఏమెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు.

శక్తివంతమైన కెమెరా

ఫోన్ కెమెరాల విషయానికి వచ్చేసరికి వెనుక భాగంలో డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్ సామర్థ్యంతో 16 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరాను ఏర్పాటు చేసారు. ఈ కెమెరా ద్వారా 4కే క్వాలిటీ వీడియోలను కూడా షూట్ చేసుకోవచ్చు. ఫోన్ ముందుభాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా కెమెరా ద్వారా హై క్వాలిటీ సెల్పీలను చిత్రీకరించుకోవచ్చు.

కనెక్టువిటీ ఫీచర్లు..

4జీ ఎల్టీఈ సపోర్ట్, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ విత్ మై పే సపోర్ట్, బ్లుటూత్ వీ4.2, వై-ఫై, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను ఈ ఫోన్‌లో పొందుపరిచారు.

ప్రత్యేకమైన లెదర్ కేస్‌తో..

ప్రత్యేకమైన లెదర్ కేస్‌తో డెలివరీ కాబడే ఈ ఫోన్ బరువు 209 గ్రాములుగా ఉంటుంది. ఫోన్ చుట్టుకొలత వచ్చేసరికి 158.8x81.9x7.9మిల్లీ మీటర్లు. Mi Mix ఫోన్ ఇండియన్ మార్కెట్లో అందుబాటుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Mi Mix announced with 6.4 inch edgeless display, 6GB RAM, 4400mAh battery. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot