దుమ్మురేపిన ఆ షియోమి ఫోన్ మళ్లీ 6జిబితో..

గతేడాది సంచలనం సృష్టించిన షియోమి Mi Note 2 మళ్లీ స్పెషల్ ఎడిషన్ గా మీ ముందుకొచ్చింది.

By Hazarath
|

గతేడాది సంచలనం సృష్టించిన షియోమి Mi Note 2 మళ్లీ స్పెషల్ ఎడిషన్ గా మీ ముందుకొచ్చింది. 6 జిబి ర్యామ్ తో వచ్చిన ఈ ఫోన్ చైనాలో లాంచ్ అయింది. అతి త్వరలో ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. దీని ధరను కంపెనీ రూ. 27,500గా నిర్ణయించింది. ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

ఈ వీడియో చూస్తే మొబైల్ ముట్టుకోరు..ఈ వీడియో చూస్తే మొబైల్ ముట్టుకోరు..

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్

కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్

ఈ ఫ్లెక్సిబుల్ డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ రక్షణ కవచంలా నిలుస్తుంది. ఫోన్‌లో ఏర్పాటు చేసిన సన్‌లైట్ డిస్‌ప్లే ప్రో మోడ్ డైరెక్ట్ సన్‌లైట్‌లోనూ మీ రీడింగ్ క్వాలిటీని ఏ మాత్రం తగ్గించదు. అంతే కాకుండా మీ కళ్లకు ఎటువంటి ఒత్తిడి తగలకుండా చూస్తుంది. .

ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లే

ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లే

Mi Note 2 ఫోన్ 5.7 అంగుళాల డ్యుయల్ ఎడ్జ్ ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేతో వస్తోంది.

క్వాల్కమ్ ప్రాసెసర్...

క్వాల్కమ్ ప్రాసెసర్...

Mi Note 2 ఫోన్ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 క్వాడ్‌కోర్ చిప్‌సెట్‌తో వస్తోంది. ఫోన్ ప్రాసెసింగ్ చాలా వేగంగా ఉంటుంది.

ర్యామ్, స్టోరేజ్

ర్యామ్, స్టోరేజ్

Mi Note 2 ఫోన్ రెండు రకాల ర్యామ్ అలానే రెండు రకాల స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ర్యామ్ వేరియంట్స్ వచ్చేసరికి (4జీబి, 6జీబి), స్టోరేజ్ వేరియంట్స్ వచ్చే సరికి (64జీబి, 128జీబి)

రేర్ కెమెరా

రేర్ కెమెరా

రేర్ కెమెరా విషయానికి వచ్చేసరికి Mi Note 2 ఫోన్ 22.56 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. సోనీ ఐఎమ్ఎక్స్ 318 Exmor R సెన్సార్‌ను ఈ కెమెరాలో ఉపయోగించారు. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ ఆకట్టుకుంటుంది. ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లు ఈ కెమెరాలో ఉన్నాయి. హై క్వాలిటీ ఫోటోగ్రీఫిని ఈ కెమెరా ద్వారా ఆస్వాదించవచ్చు.

ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా

ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా

Mi Note 2 ఫోన్ 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరాతో వస్తోంది. ఆటో ఫోకస్ ఫీచర్ ఆకట్టుకుంటుంది. గ్రూప్ సెల్ఫీ ఆప్టిమైజేషన్ పేరుతో సరికొత్త ఫీచర్‌ను షియోమీ ఈ కెమెరాలో నిక్షిప్తం చేసింది. ఈ ఫీచర్ ద్వారా మల్టీపుల్ సెల్ఫీ షాట్‌లను చిత్రీకరించుకుని వాటిలో బెస్ట్ షాట్‌ను పిక్ చేసుకోవచ్చు.

ఫోన్ బ్యాటరీ

ఫోన్ బ్యాటరీ

Mi Note 2 ఫోన్ శక్తివంతమైన 4070 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ ద్వారా ఫోన్ వేగవంతంగా ఛార్జ్ అవుతుంది. బ్యాకప్ కూడా మార్కెట్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఉంటుంది.

కనెక్టువిటీ ఫీచర్లు

కనెక్టువిటీ ఫీచర్లు

 Mi Note 2 ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. 4జీ ఎల్టీఈ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఫీచర్, వై-ఫై, బ్లుటూత్, శాప్ జీపీఎస్.

4జీ+ సపోర్ట్ కూడా...

4జీ+ సపోర్ట్ కూడా...

Mi Note 2 ఫోన్ 4జీ+ కనెక్టువిటీని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే 600ఎంబీపీఎస్ వరకు ఇంటర్నెట్ వేగాన్ని అందుకోగలదు. అల్ట్రాసోనిక్ ఫింగర్ స్కానర్‌ను ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసారు. ఈ స్కానర్ క్వాల్కమ్ సెన్స్ ఐడీ టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. 24-బిట్ హై-ఫై సౌండ్ వ్యవస్థను కూడా ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

Best Mobiles in India

English summary
Xiaomi Mi Note 2 6GB RAM, 64GB Inbuilt Storage Variant Launched: Price, Specifications Read more at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X