4జిబి ర్యామ్‌తో Mi Note 3, ధర రూ. 19,500

Written By:

చైనా మొబైల్ దిగ్గజం షియోమి సెప్టెంబర్‌లో మి నోట్ 3 లాంచ్ చేసిన సంగతి విదితమే. అయితే అది 6జిబి ర్యామ్‌తో మార్కెట్లోకి వచ్చింది. కంపెనీ ఇప్పుడు సరికొత్తగా దీన్ని 4జిబి ర్యామ్‌తో మార్కెట్లోకి తీసుకువచ్చింది. కొత్తగా వచ్చిన ఫోన్ 4జిబి ర్యామ్ అలాగే 64 జిబి స్టోరేజ్ తో మార్కెట్లోకి వచ్చింది. చైనాలో అమ్మకాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఇండియాకి ఎప్పుడు వస్తుందనేది సమాచారం లేనప్పటికీ అతి త్వరలోనే ఇండియా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

జియోని వణికిస్తున్న కొత్త కంపెనీ, రూ. 20కే 1జిబి డేటా

4జిబి ర్యామ్‌తో Mi Note 3, ధర రూ. 19,500

షియోమీ ఎంఐ నోట్ 3 స్పెషిఫికేషన్స్
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్.

English summary
Xiaomi Mi Note 3 Gets a Cheaper Variant With 4GB RAM, 64GB Storage Read more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot