భారత్‌లోకి చైనా ఫోన్ ‘జియోమీ ఎంఐ3’
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జియోమీ భారత్‌లో తన తొలి స్మార్ట్‌ఫోన్ ‘ఎంఐ3'ని ఆవిష్కరించింది. ధర రూ.14,999. వచ్చే వారం నుంచి జియోనీ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫోన్ మందస్తు బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి. జియోమీ ఎంఐ3 కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

కంపెనీ వృద్థి చేసిన ఎంఐయూఐ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. ఇతర స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే.. 5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఎల్‌సీడీ టచ్ డిస్‌ప్లే (కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో), 2.3గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 800 (ఎమ్ఎస్ఎమ్ 8974ఏబీ) ప్రాసెసర్, 2జీబి డీడీఆర్3 ర్యామ్, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్, సోనీ ఎక్స్‌మార్ బీఎస్ఐ సెన్సార్, ఎఫ్ 2.2 అపెర్చర్), 1080 పిక్సల్ పూర్తి హైడెఫినిషన్ రికార్డింగ్ ఈ కెమెరా ద్వారా సాధ్యమవుతుంది, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), ఫోన్ కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై 802.11a/b/g/n, వై-ఫై డైరెక్ట్, బ్లూటూత్ 4.0, జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), 3050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ పరిమాణం 114×72×8.1 మిల్లీ మీటర్లు, బరువు 145 గ్రాములు
చైనా మార్కెట్లో మూడవ అతిపెద్ద మొబైల్ ఫోన్‌ల తయారీ కంపెనీగా అవతరించిన జియోమీని 2010లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీ ఆరవస్థానంలో ఉంది. బీజింగ్ కేంద్రంగా కార్యకలపాలు సాగించే జియోమీ అనతికాలంలోనే అతిపెద్ద కంపెనీగా అవతరించింది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








