షియోమీ ఎంఐ4 వచ్చేసింది, ధర రూ.19,999

|

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ ఇటీవల ఆ దేశ మార్కెట్లో ఆవిష్కరించిన ఎంఐ4 స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ధర రూ.19,999. రెడ్మీ 1ఎస్, రెడ్మీ నోట్, ఎమ్ఐ ఫోన్‌లతో గతేడాది ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన షియోమీ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ను ఏర్పరుచుకుంది. ఎంఐ4 స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. ఫోన్ అమ్మకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌లు ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ వద్ద ప్రారంభమవుతాయి.

 

షియోమీ ఎంఐ4 ప్రత్యేకతలు:

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్, 441 పీపీఐ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్), 2.5గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 801 సీపీయూ, 3జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.3 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, ఎంఐయూఐ6 యూజర్ ఇంటర్‌ఫేస్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ సపోర్ట్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గతంలో విడుదలైన షియోమీ ఎంఐ 3, తాజాగా విడుదులైన ఎంఐ 4 ఫోన్‌ల మధ్య తేడాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

షియోమీ ఎంఐ 3, ఎంఐ 4 ఫోన్‌ల మధ్య తేడాలు

షియోమీ ఎంఐ 3, ఎంఐ 4 ఫోన్‌ల మధ్య తేడాలు

స్ర్కీన్ సైజ్

స్ర్కీన్ సైజ్ విషయంలో రెండు ఫోన్‌ల మధ్య తేడా ఏమి లేదు. ఎంఐ3, ఎంఐ4 ఫోన్‌లు 5 అంగుళాల స్ర్కీన్‌లను కలిగి ఉన్నాయి.

 

షియోమీ ఎంఐ 3, ఎంఐ 4 ఫోన్‌ల మధ్య తేడాలు

షియోమీ ఎంఐ 3, ఎంఐ 4 ఫోన్‌ల మధ్య తేడాలు

స్ర్కీన్ రిసల్యూషన్

స్ర్కీన్ రిసల్యూషన్ విషయానికొస్తే ఎంఐ3 (1920 x 1080 పిక్సల్స్) రిసల్యూషన్‌ను కలిగి ఉండగా, ఎంఐ4 ఫోన్ (1920 x 1080 పిక్సల్స్) పూర్తి హైడెఫినిషన్ రిసల్యూషన్‌ను కలిగి ఉంది.

 

షియోమీ ఎంఐ 3, ఎంఐ 4 ఫోన్‌ల మధ్య తేడాలు
 

షియోమీ ఎంఐ 3, ఎంఐ 4 ఫోన్‌ల మధ్య తేడాలు

కెమెరా విషయానికొస్తే

ఎంఐ3 మోడల్ 13 పిక్సల్ రేర్, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాను మాత్రమే కలిగి ఉంది. ఇదే సమయంలో ఎంఐ4 మోడల్ 13 మెగా పిక్సల్ రేర్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరాలను కలిగి ఉంది.

 

షియోమీ ఎంఐ 3, ఎంఐ 4 ఫోన్‌ల మధ్య తేడాలు

షియోమీ ఎంఐ 3, ఎంఐ 4 ఫోన్‌ల మధ్య తేడాలు

ఎంఐ3 మోడల్ 2.3గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఎంఐ4 మోడల్ 2.5గిగాహెర్ట్జ్ స్నాప్‌డ్రాగన్ 801 ప్రాసెసర్ పై రన్ అవుతుంది.

 

షియోమీ ఎంఐ 3, ఎంఐ 4 ఫోన్‌ల మధ్య తేడాలు

షియోమీ ఎంఐ 3, ఎంఐ 4 ఫోన్‌ల మధ్య తేడాలు

ఎంఐ3 మోడల్ 2జీబి ర్యామ్‌ను కలిగి ఉంటే, ఎంఐ4 మోడల్ 3జీబి ర్యామ్‌ను కలిగి ఉంది.

 

షియోమీ ఎంఐ 3, ఎంఐ 4 ఫోన్‌ల మధ్య తేడాలు

షియోమీ ఎంఐ 3, ఎంఐ 4 ఫోన్‌ల మధ్య తేడాలు

ఎంఐ3 మోడల్ 2జీ, 3జీలను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఎంఐ4 మోడల్ మరో అడుగు ముందంజలో ఉండి 2జీ, 3జీ, 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది.

 

షియోమీ ఎంఐ 3, ఎంఐ 4 ఫోన్‌ల మధ్య తేడాలు

షియోమీ ఎంఐ 3, ఎంఐ 4 ఫోన్‌ల మధ్య తేడాలు

ఎంఐ3 మోడల్ 3050ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉండగా, ఎంఐ 4 మోడల్ 3080 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

 

షియోమీ ఎంఐ 3, ఎంఐ 4 ఫోన్‌ల మధ్య తేడాలు

షియోమీ ఎంఐ 3, ఎంఐ 4 ఫోన్‌ల మధ్య తేడాలు

ఎంఐ3 మోడల్ ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఎంఐయూఐ వర్షన్ వీ5. ఎంఐ4 మోడల్ విషయానికొస్తే ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఎంఐయూఐ వర్షన్ వీ6.

 

షియోమీ ఎంఐ 3, ఎంఐ 4 ఫోన్‌ల మధ్య తేడాలు

షియోమీ ఎంఐ 3, ఎంఐ 4 ఫోన్‌ల మధ్య తేడాలు

ఎంఐ3 మోడల్ మార్కెట్ ధర రూ.12,999. ఎంఐ4 మోడల్ మార్కెట్ ధర రూ.19,999.

 

Best Mobiles in India

English summary
Xiaomi Mi4 Launched in India at Rs 19,999: Registration Starts Today. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X