రూపాయికే 4జీ స్మార్ట్‌ఫోన్, షియోమి మరో సంచలనం !

Written By:

చైనా మొబైల్ దిగ్గజం షియోమి ఇండియాలో దూసుకుపోయేందుకు భారీ వ్యూహాలకే తెరలేపింది. దిగ్గజాలనుకు ఢీ కొట్టేందుకు రూపాయికే స్మార్ట్‌ఫోన్ అంటూ దూసుకొస్తోంది. రెండు రోజుల ఫ్లాష్ సేల్‌లో మీరు షియోమి ఫోన్లతో పాటు ఇతర ఉత్పత్తులను రూపాయికే కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. డీల్ వివరాలపై ఓ లుక్కేయండి.

వొడాఫోన్ నుంచి అత్యంత తక్కువ ధరకే 4జీ స్మార్ట్‌ఫోన్ !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిసెంబర్ 20 నుంచి 21 వరకు..

క్రిస్మస్‌, న్యూఇయర్‌ సందర్భంగా డిసెంబర్ 20 నుంచి 21 వరకు రెండు రోజుల పాటు నెం.1 ఎంఐ ఫ్యాన్‌ సేల్‌ పేరిట షియోమి ఓ సేల్ నిర్వహిస్తోంది. ఈ రూ.1 ఫ్లాష్‌ సేల్‌ను నిర్వహిస్తుంది.

అధికారిక వెబ్‌సైట్‌ ఎంఐ.కామ్‌లో..

20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి డిసెంబర్‌ 21 వరకు షియోమి అధికారిక వెబ్‌సైట్‌ ఎంఐ.కామ్‌లో ఈ సేల్‌ను నిర్వహిస్తుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, పవర్‌ బ్యాంకులు, కేసెస్‌, ఇతర యాక్ససరీస్‌పై భారీ డిస్కౌంట్లను ఆఫర్‌ చేసింది.

సేల్స్ కు సంబంధించి కూపన్స్..

మీరు చేయాల్సిందల్లా అంతకంటే ముందు అదే రోజు ఉదయం 10 గంటలకు రూపాయి సేల్స్ కు సంబంధించి కూపన్స్ కొనాల్సి ఉంటుంది. ఈ సేల్ కూడా కొద్ది సేపు మాత్రమే ఉంటుంది.

రూపాయి సేల్స్ లోకి ఎంట్రీ..

ఈ కూపన్స్ దక్కించుకున్నవారు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అయ్యే రూపాయి సేల్స్ లోకి ఎంట్రీ అవ్వాలి. అక్కడ మీరు రూపాయి పెట్టి కొనుగోలు చేసిన కూపన్స్ ను యాడ్ చేస్తే చాలు.. స్మార్ట్ ఫోన్ మీ సొంతం అవుతుంది.

రూ.1కే షియోమి ఉత్పత్తులను..

అయితే ఇది చాలా పరిమితంగానే ఉంటుందని కంపెనీ చెబుతోంది. రూ.1కే షియోమి ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునే వారు వెంటనే ప్రొడక్ట్‌ను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని కంపెనీ చెప్పింది.

రెడ్‌మి 5ఏ, రెడ్‌మి వై1..

ఈ రూపాయి సేల్స్ కింద.. రెడ్‌మి 5ఏ, రెడ్‌మి వై1, ఎంఐ వీఆర్‌ 2 ప్లే, ఎంఐ రూటర్స్, వైఫై రూటర్లు ఇతర ఉత్పత్తులు ఈ సేల్స్ లో అందుబాటులో ఉంటాయి.

రూ.4000 వరకు సూపర్‌క్యాష్‌..

అంతేకాక మొబిక్విక్‌ మొబైల్‌ వాలెట్‌ యూజర్లకు రూ.4000 వరకు సూపర్‌క్యాష్‌ లభ్యమవుతుంది. హంగామా ప్లేకు మూడు నెలల సబ్‌స్క్రిప్షన్‌, 12 నెలల హంగామా మ్యూజిక్‌ వంటి డీల్స్‌ ఈ సేల్‌లో ఉన్నాయి.

రూ.50, రూ.100, రూ.200, రూ.500 డిస్కౌంట్ కూపన్లు..

ఇక సేల్‌లో భాగంగా వినియోగదారులు కొనే స్మార్ట్‌ఫోన్లు, యాక్ససరీలపై రూ.50, రూ.100, రూ.200, రూ.500 డిస్కౌంట్ కూపన్లు లభిస్తాయి.

మరిన్ని వివరాలకు...

మరిన్ని వివరాలకు షియోమి అధికారిక వెబ్‌సైట్ http://event.mi.com/in/sales2017/christmas/ లో చూడగలరు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi No 1 Mi Fan Sale today: Re 1 flash sale for Redmi 5A, Redmi Y1 Lite, and others More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot