షియోమినే ఢీకొట్టే దిగ్గజాలు ఇక రావా ? మళ్లీ స్మార్ట్‌ఫోన్‌ రారాజు అదే !

దేశీయ టెలికాం మార్కెట్లో చైనా కంపెనీల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది.

|

దేశీయ టెలికాం మార్కెట్లో చైనా కంపెనీల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే దేశీయ మేకర్లు స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అడుగులు నెమ్మదిగా వేస్తున్న తరుణంలో చైనా కంపెనీలు ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మీద పెత్తనాన్ని చెలాయిస్తూ పోతున్నాయి. ఇందులో భాగంగా టాప్ కంపెనీలు షియోమి, వన్ ప్లస్, ఒప్పో, హువాయిలు ఇండియాలో దూసుకుపోతున్నాయి. ఈ దిగ్గజాల్లో షియోమి ఇప్పుడు ఇండియాలో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ చైనా కింగ్ మేకర్ తానే కింగ్‌నంటూ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.

వాజ్‌పేయి లేని టెలికాం రంగాన్ని ఊహించలేము, నమ్మలేని నిజాలివే !వాజ్‌పేయి లేని టెలికాం రంగాన్ని ఊహించలేము, నమ్మలేని నిజాలివే !

షియోమి మళ్లీ నెంబర్‌ వన్‌

షియోమి మళ్లీ నెంబర్‌ వన్‌

భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌లో షియోమి మళ్లీ నెంబర్‌ వన్‌గా నిలిచింది. పరిశోధన సంస్థ ఇంటర్నేషనల్ డేటా కార్పోరేషన్ (ఐడీసీ) డేటా ప్రకారం వరుసగా నాల్గవసారి కూడా తన అత్యున్నత స్థానాన్ని నిలబెట్టుకుంది.

2018 రెండవ త్రైమాసికంలో

2018 రెండవ త్రైమాసికంలో

2018 రెండవ త్రైమాసికంలో దేశంలో 29.7 శాతం వాటాతో ఈ ఘనతను దక్కించుకుంది. 107.6 శాతం వృద్ధితో కోటి స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్లో విక్రయించింది.

ఆన్‌లైన్‌ మార్కెట్‌లో

ఆన్‌లైన్‌ మార్కెట్‌లో

అలాగే ఆన్‌లైన్‌ మార్కెట్‌లో కూడా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సెగ్మెంట్‌లో షియోమి 55.6 శాతం వాటా కైవసం చేసుకుంది.ఆన్‌లైన్‌ మార్కెట్‌లో వరుసగా ఏడవ క్వార్టర్‌లో ఈ ఘనతను సాధించింది.

దుమ్మురేపిన రెడ్‌ మీ సీరిస్ ఫోన్లు

దుమ్మురేపిన రెడ్‌ మీ సీరిస్ ఫోన్లు

ఈ క్వార్టర్లో రెడ్‌ మీ 5ఏ, రెడ్‌ మి నోట్‌ ప్రో, రెడ్‌మి నోట్‌ 5, రెడ్‌మి నోట్‌ 5 డివైస్‌ల టాప్‌ విక్రయాలతో ఈ రికార్డును దక్కించుకుంది.

శాంసంగ్‌ మాత్రం రెండవ స్థానంతో

శాంసంగ్‌ మాత్రం రెండవ స్థానంతో

అయితే శాంసంగ్‌ మాత్రం రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. 23 శాతం మార్కెట్‌ షేర్‌తో 80 లక్షల స్మార్ట్‌ఫోన్లను షిప్‌మెంట్‌ చేసింది. 4.2 మిలియన్ల యూనిట్లు, 12.6 శాతంతో వివో మూడవ స్థానానంలో నిలిచింది.

భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌

భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌

ఐడిసి ప్రకారం, భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో 20శాతం వృద్ధిని సాధించింది. కాగా భారత మార్కెట్లోకి మొత్తం 33.5 మిలియన్ యూనిట్లు వచ్చాయి.

బలమైన ఉత్పత్తులతో ..

బలమైన ఉత్పత్తులతో ..

బలమైన ఉత్పత్తులతో ఆన్‌లైన్‌ బ్రాండ్ విక్రయాలు, ప్రత్యేకమైన లాంచింగ్‌ల ద్వారా ఈ వృద్ది సాధించినట్టు ఐడీసి వ్యాఖ్యానించింది.

టాప్‌ 5 బ్రాండ్స్‌

టాప్‌ 5 బ్రాండ్స్‌

2018లో చిన్న సంస్థలతో పోలిస్తే టాప్‌ 5 బ్రాండ్స్‌ 79 శాతం విక్రయాలు సాధించాయని ఐడీసీ ఇండియా అసోసియేట్‌ రీసెర్చ్ మేనేజర్ ఉపాసన జోషి పేర్కొన్నారు.

Best Mobiles in India

English summary
Xiaomi on top, Samsung second in India’s smartphone market, according to IDC data more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X