ఇండియాలో Redmi ఫోన్‌లకు తిరుగులేదు

భారతీయలు ఎక్కువగా ఇష్టపడుతోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఏదో రివీల్ అయ్యింది. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో భాగంగా ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ Xiaomi, ఇండియన్స్ లైక్ చేస్తున్న మోస్ట్ వాంటెడ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అని తేలింది.

Read More : జియో ఉచిత ఆఫర్లను పొందేందుకు ఇదే చివరి ఛాన్స్..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అంచనాలకు మించి అమ్మకాలు..

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌‌ను టార్గెట్ చేస్తూ షియోమీ లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 3, రెడ్మీ 3ఎస్, రెడ్మీ 3ఎస్ ప్రైమ్, రెడ్మీ నోట్ 4, రెడ్మీ 4ఏ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో ఎంతగా పాపులరయ్యాయో మనందరి తెలుసు. రూ.6,000 నుంచి రూ.13,000 మధ్య అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లు అంచనాలకు మించి అమ్ముడుపోవటం విశేషం.

నోకియా 9 vs వన్‌ప్లస్ 5, ఈ ఏడాది పెద్ద పోటీ ఇదేనా..?

యాపిల్, సామ్‌సంగ్‌లు కూడా వెనక్కి తగ్గక తప్పలేదు

షియోమీ స్మార్ట్‌ఫోన్‌ల దెబ్బకు దిగ్గజ బ్రాండ్‌లైన యాపిల్, సామ్‌సంగ్‌లు కూడా వెనక్కి తగ్గక తప్పలేదు. స్ట్రేటజీ అనాలిటిక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు అత్యధికంగా ఇష్టపడుతోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా షియోమీ నిలిచింది. రెడ్మీ 4, రెడ్మీ 4 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ల రాకతో ఈ క్రేజ్ మరింతగా పెరిగే అవకాశముందని రిపోర్ట్ అంచనా వేస్తోంది.

2000 మంది పై సర్వే..

స్ట్రేటజీ అనాలిటిక్స్ రిపోర్ట్ ప్రకారం.. భారత్‌లో ఎక్కువగా ఇష్టపడుతోన్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ గురించిన సమాచారం తెలుసుకునేందుకు 2000 మంది పై ఓ సర్వేను నిర్వహించారు.

గూగుల్ పరిశోధనలు చావును జయించబోతున్నాయా..?

26% మంది షియోమీ వైపు..

ఈ సర్వేలో 26% మంది షియోమీ బ్రాండ్ పై ఇష్టత కనబర్చారు. ఇదే సమయంలో సామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్ పై 12% మంది, యాపిల్ ఐఫోన్ ల పై 12% మంది, మోటరోలా స్మార్ట్‌ఫోన్‌ల పై 7% మంది, లెనోవో స్మార్ట్‌ఫోన్‌ల పై 6% మంది, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ల పై 6% మంది, మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై 2% మంది ఆసక్తిని కనబర్చారు.

 

నెట్‌వర్క్ స్పీడ్స్ ఇంకా ప్రాసెసర్ పనితీరును బట్టి ఫోన్‌ ఎంపిక

గతంలో ఇండియన్ యూజుర్లు స్మార్ట్‌ఫోన్‌లను ఎంపిక చేసుకునే ముందు పెద్ద డిస్‌ప్లే ఇంకా పెద్ద కెమెరాలను కోరుకునే వారిని, ప్రస్తుతం మాత్రం నెట్‌వర్క్ స్పీడ్స్ అలానే ప్రాసెసర్ పనితీరును బట్టి ఫోన్‌లను ఎంపిక చేసుకోవటం జరుగుతోందని స్ట్రేటజీ అనాలిటిక్స్ తెలిపింది.

సామ్‌సంగ్ కొత్త ఫోన్ గెలాక్సీ సీ7 ప్రో, ధర రూ.27,990, వన్‌ప్లస్ 3టీకి పోటీ..?

 

6% మంది మాత్రమే పెద్ద ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నారు..

ఈ సర్వేలో వెల్లడైన మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఇండియాలో కేవలం 6% మంది యూజర్లు మాత్రమే రూ.35,000 కంటే ఎక్కువ ధర కలిగిన స్మార్ట్ ఫోన్ లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. మిగిలిన వారందరూ రూ.10,000 నుంచి రూ.20,000లోపు ఫోన్ లను కొనుగోలు చేసేందుకు మాత్రమే ఆసక్తిని కనబరుస్తున్నారు.

Galaxy On8 ధర తగ్గింది, ఎంతో తెలుసా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi overtakes Apple,Samsung in the most preferred smartphone brand race in India: Report. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot