శాంసంగ్‍కు అదిరే షాకిచ్చిన షియోమి

భారత్ లో ఎప్పుడూ నంబర్ వన్ పొజీషన్ లో దూసుకుపోతున్న శాంసంగ్ కంపెనీకి షియోమి పెద్ద షాకిచ్చింది.

By Hazarath
|

భారత్ లో ఎప్పుడూ నంబర్ వన్ పొజీషన్ లో దూసుకుపోతున్న శాంసంగ్ కంపెనీకి షియోమి పెద్ద షాకిచ్చింది. రూ. 10 వేల రూపాయల కేటగిరిలో షియోమి ఫోన్లు రికార్డులు సృష్టించాయి.శాంసంగ్‌ను బీట్‌ చేసి బెస్ట్‌-సెల్లర్‌ స్లాటును దక్కించుకున్నాయి. రెడ్‌మి నోట్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ 7.2 శాతం మార్కెట్‌ షేరును, రెడ్‌మి 4 స్మార్ట్‌ఫోన్‌ 4.5 శాతం మార్కెట్‌ షేరును సొంతం చేసుకుని తొలి రెండు స్థానాల్లో నిలవగా... వీటి తర్వాత 4.3 శాతం మార్కెట్‌ షేరుతో శాంసంగ్‌ గెలాక్సీ జే2 ఉన్నట్టు కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ తెలిపింది. రెడ్ మి 4 ఫీచర్లు కూడా అదిరే రేంజ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

తొలిసారిగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో మి మ్యాక్స్ 2 అమ్మకాలుతొలిసారిగా ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో మి మ్యాక్స్ 2 అమ్మకాలు

మూడు ర్యామ్ వేరియంట్లలో ...

మూడు ర్యామ్ వేరియంట్లలో ...

షియోమీ ఇండియా తన రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌లను మూడు ర్యామ్ వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. 2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. డార్క్ గ్రే, బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండే రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.

డిస్‌ప్లే , ప్రాసెసర్

డిస్‌ప్లే , ప్రాసెసర్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్). 4100 mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

డిజైనింగ్ పరంగా చూస్తే ..

డిజైనింగ్ పరంగా చూస్తే ..

డిజైనింగ్ పరంగా చూస్తే రెడ్మీ నోట్ 3, రెడ్మీ నోట్ 4లు మొదటి చూపులో ఒకేలా అనిపిస్తాయి. నోట్ 3 తరహాలోనే నోట్ 4 కూడా 5.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదనంగా ఈ ఫోన్ డిస్‌ప్లే పై 2.5డి కర్వుడ్ గ్లాస్‌ను షియోమీ పొందుపరిచింది. రెడ్మీ నోట్ 3లో కర్వుడ్ గ్లాస్ ఉండదు. నోట్3 మాదిరిగానే నోట్ 4 కూడా సమానమైన స్ర్కీన్ రిసల్యూషన్ (1080*1920)ను కలిగి ఉంది. పీపీఐ (పిక్సల్స్ పర్ ఇంచ్) విషయానికి వచ్చేసరికి నోట్ 4 ఫోన్ 403 పీపీఐను కలిగి ఉంటుంది.

హర్డ్‌వేర్ బటన్స్ వచ్చేసరికి

హర్డ్‌వేర్ బటన్స్ వచ్చేసరికి

హర్డ్‌వేర్ బటన్స్ వచ్చేసరికి వాల్యుమ్ రాకర్స్ అలానే పవర్ బటన్‌లను ఫోన్‌కు కుడి వైపు ఏర్పాటు చేసారు. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్‌ను ఫోన్‌కు ఎడమ వైపు ఏర్పాటు చేయటం జరిగింది. ఫోన్ క్రింద భాగంలో రెండు స్పీకర్స్‌తో పాటు ఒక మైక్రోయూఎస్బీ పోర్టును అమర్చటం జరిగింది. టీవీ, ఏసీ వంటి డివైస్‌లకు ఈ ఫోన్‌ను రిమోట్ కంట్రోలర్‌లా ఉపయోగించుకునేందుకు వీలుగా పై భాగంలో IR blasterను ఏర్పాటు చేసారు. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఫోన్ పై భాగంలోనే ఉంటుంది.

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా

రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. f/2.0 aperture, డ్యుయల్ టోన్ ఫ్లాష్ లైట్ వంటి ఫీచర్లను ఈ కెమెరా కలిగి ఉంది. సెల్ఫీ కెమెరా విషయానికొస్తే 5 ఎంపీ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు.

బ్యాటరీ కెపాసిటీ

బ్యాటరీ కెపాసిటీ

బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్, 4100mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోంది. జాగ్రత్తగా వాడుకుంటే రెండు రోజుల పాటు ఈ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఫోన్ హెవీగా వాడటం మొదలు పెడితే ఒక్క రోజులోనే బ్యాటరీ మొత్తం దిగిపోతుంది.

Best Mobiles in India

English summary
Xiaomi phones are best-sellers in under Rs 10,000 category in India Read more at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X