షియోమి నుంచి ఆరు స్మార్ట్‌ఫోన్లు, పెరిగిన రెడ్‌మి 5ఏ ధర

దేశీయ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి ఇప్పుడు ఏకంగా ఆరు ఫోన్లతో మార్కెట్లోకి దూసుకొస్తోంది.

|

దేశీయ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి ఇప్పుడు ఏకంగా ఆరు ఫోన్లతో మార్కెట్లోకి దూసుకొస్తోంది. ఈ ఏడాది ఆరు స్మార్ట్‌ఫోన్లతో ఇండియా మార్కెట్లోకి వస్తున్నామని షియోమి గ్లోబల్‌ వైస్‌-ప్రెసిడెంట్‌, ఇండియా హెడ్‌ మను కుమార్‌ జైన్‌ లైవ్‌మింట్‌లో తెలిపారు. కేవలం ఆరు స్మార్ట్‌ఫోన్ల లాంచింగ్‌ మాత్రమే కాక, 100 ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లను కూడా షియోమి లాంచ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. కొత్త ప్రొడక్ట్‌ కేటగిరీల విడుదలతో పాటు, సాఫ్ట్‌వేర్‌పై, ఇంటర్నెట్‌ స్టార్టప్‌లపై కూడా ఎక్కువగా పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ఆయన తెలిపారు. కాగా చైనా తర్వాత భారత్ షియోమికి అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. భారత్‌లో నిన్నటిదాకా టాప్‌లో ఉన్న శాంసంగ్‌ను వెనక్కి నెట్టేసి షియోమి భారత్‌ మార్కెట్‌లోకి టాప్‌ బ్రాండుగా దూసుకొచ్చేసింది. ఆరేళ్లలో షియోమి టాప్‌ బ్రాండుగా నిలువడం ఇదే తొలిసారి. రెండు స్వచ్ఛంద రీసెర్చ్‌ సంస్థలు విడుదల చేసిన డేటాలో ఈ విషయం వెల్లడైంది.

 

మీ Voter ఐడీ వివరాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవటం ఎలా..?మీ Voter ఐడీ వివరాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవటం ఎలా..?

 స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోనే కాక..

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోనే కాక..

కేవలం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోనే కాక, ఇటు స్మార్ట్‌టీవీ మార్కెట్‌లోనూ తన పాగా వేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే 55 అంగుళాల ఎంఐ టీవీ4 లాంచింగ్ అనంతరం, మరో రెండు అఫర్డబుల్‌ స్మార్ట్‌టీవీలను షియోమి లాంచ్‌ చేసింది. 32 అంగుళాలు, 43 అంగుళాలలో ఎంఐ టీవీ 4ఏ స్మార్ట్‌టీవీను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 43 అంగుళాల టీవీ ధర రూ.22,999 కాగ, 32 అంగుళాల ఎంఐ టీవీ 4ఏ ధర 13,999 రూపాయలు.

 మార్చి 14న భారత మార్కెట్లోకి రెడ్‌మి 5

మార్చి 14న భారత మార్కెట్లోకి రెడ్‌మి 5

షియోమి నుంచి త్వరలో రానున్న మరో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి 5 మార్చి 14న భారత మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే చైనాలో విడుదల చేసిన రెడ్‌మి 5ను భారతీయులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా దీని ధరపై ఎటువంటి క్లారిటీ లేనప్పటికీ రూ.7వేలుగా ఇది ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రెడ్‌మి 5 ఫీచర్లు
 

రెడ్‌మి 5 ఫీచర్లు

5.7 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ నోగట్‌ ఆధారితంగా ఎంఐయూఐ 9
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 450 ఎస్‌ఓసీ
2జీబీ/ 3జీబీ / 4జీబీ ర్యామ్‌
16జీబీ/ 32జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్‌
12 మెగా పిక్సెల్‌ రియర్‌ కెమెరా
5 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌
3300 ఎంఏహెచ్‌ బ్యాటరీ

రెడ్‌మి 5ఏ ధర పెంపు

రెడ్‌మి 5ఏ ధర పెంపు

ఇక గతేడాది లాంచ్ చేసిన దేశ్‌కా స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి 5ఏ ధరను కూడా పెంచేసింది. ఎంట్రీ లెవల్‌ వేరియంట్‌ను అసలు ధర 5,999 రూపాయలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు షియోమి ప్రకటించింది. ఈ కొత్త ధర ఎంఐ.కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ హోమ్‌ రిటైల్‌ స్టోర్లలో అప్లయ్‌ అవుతుందని చెప్పింది.

లాంచింగ్‌ సమయంలో..

లాంచింగ్‌ సమయంలో..

లాంచింగ్‌ సమయంలో రెడ్‌మి 5ఏ ప్రారంభ ధర 4,999 రూపాయలు మాత్రమే. 50 లక్షల యూనిట్లను విక్రయించిన అనంతరం దీన్ని అసలు ధర 5,999 రూపాయలకు తీసుకొస్తామని కంపెనీ లాంచింగ్‌ సమయంలోనే ప్రకటించింది.

షియోమి అనుకున్న లక్ష్యాన్ని చేధించడంతో..

షియోమి అనుకున్న లక్ష్యాన్ని చేధించడంతో..

ప్రస్తుతం షియోమి అనుకున్న లక్ష్యాన్ని చేధించడంతో దీని ధరను వెయ్యి రూపాయలు పెంచేసి 5,999 రూపాయలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా రెండు వేరియంట్లలో రెడ్‌మి 5ఏను షియోమి లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే. 2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌ ధర 5,999 రూపాయలు కాగ, 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ మోడల్‌ ధర 6,999 రూపాయలు.

 రెడ్‌మి 5ఏ స్పెషిఫికేషన్లు..

రెడ్‌మి 5ఏ స్పెషిఫికేషన్లు..

డ్యూయల్‌ సిమ్‌ స్మార్ట్‌ఫోన్‌, ఆండ్రాయిడ్‌ నోగట్‌, 5 అంగుళాల డిస్‌ప్లే, క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 425 ఎస్‌ఓసీ, 13 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్‌ సెన్సార్‌, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ దీని స్పెషిఫికేషన్లు.
8 రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఇది కలిగి ఉంది. మెమరీని పెంచడం కోసం ఈ ఫోన్‌లో మైక్రోఎస్టీ కార్డు స్లాటును కూడా అందుబాటులో ఉంచింది. డార్క్‌ గ్రే, రోజ్‌ గోల్డ్‌, గోల్డ్‌ రంగుల్లో ఇది లభ్యమవుతోంది.

రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొలలో..

రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొలలో..

ఇవన్నీ ఇలా ఉంటే రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొలలో సాఫ్ట్‌వేర్ సమస్యలు బాగా వస్తున్నాయని తెలిసింది. మొన్నీ మధ్యే హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నప్పుడు వీటిల్లో తక్కువ సౌండ్ వినిపిస్తుందని ఫిర్యాదులు వెల్లువెత్తగా షియోమీ స్పందించి అందుకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. అయితే ప్రస్తుతం మరిన్ని సమస్యలు ఈ ఫోన్లలో ఉత్పన్నమవుతున్నాయి.

ఫోన్‌లో ఉండే కంట్రోల్స్ డిసేబుల్ ..

ఫోన్‌లో ఉండే కంట్రోల్స్ డిసేబుల్ ..

రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొ ఫోన్లలో మోడ్రన్ కోంబాట్ 5, బియా 3, స్నిపర్ ఫ్యురీ వంటి గేమ్స్‌ను ఆడుతున్నప్పుడు ఫోన్‌కు గేమ్ ప్యాడ్‌ను కనెక్ట్ చేయకపోయినా గేమ్ పాడ్ కనెక్ట్ చేసినట్టు ఫోన్‌లో వస్తున్నదని, దీంతో ఫోన్‌లో ఉండే కంట్రోల్స్ డిసేబుల్ అవుతున్నాయని, ఫలితంగా స్క్రీన్‌పై గేమ్ ప్యాడ్ కంట్రోల్స్‌ను ప్రెస్ చేయాలని మెసేజ్ కనిపిస్తుందని యూజర్లు వాపోతున్నారు. దీంతో గేమ్‌లను ఆడలేకపోతున్నామని వారు అంటున్నారు.

ముందు కెమెరాతో ఫొటోలు తీస్తే..

ముందు కెమెరాతో ఫొటోలు తీస్తే..

అలాగే మరికొందరు యూజర్ల ఫోన్లలో జైరోస్కోప్ సెన్సార్ పనిచేయడం లేదని, ముందు కెమెరాతో ఫొటోలు తీస్తే బ్లాక్ ఫొటో వస్తుందని అంటున్నారు. అలాగే కొందరికి చెందిన రెడ్‌మీ నోట్ 5, నోట్ 5 ప్రొ ఫోన్లు వాడుతున్నప్పుడు ఆటోమేటిక్‌గా స్క్రీన్ లాక్ అవుతున్నాయని చెబుతున్నారు. 

షియోమీ స్పందన

షియోమీ స్పందన

దీనిపై యూజర్లు ఇప్పటికే ఎంఐ కమ్యూనిటీ ఫోరంలో ఫిర్యాదులను పోస్టు చేయగా అందుకు షియోమీ ఇంకా స్పందించలేదు.

మరో ఫ్లాష్ సేల్‌..

మరో ఫ్లాష్ సేల్‌..

కాగా ఈ రెండు ఫోన్లు ఫ్లిప్‌కార్ట్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్స్‌లలో యూజర్లకు ప్రత్యేకంగా లభిస్తుండగా వీటికి గాను 14వ తేదీ మధ్యాహ్నం మరో ఫ్లాష్ సేల్‌ను నిర్వహించనున్నారు.

Best Mobiles in India

English summary
Xiaomi plans to launch 6 new phones in India this year: Report More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X