షియోమీ రెడ్‌మై 1ఎస్...నేటి నుంచే అమ్మకాలు ప్రారంభం

Posted By:

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ షియోమీ గత నెలలో ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించిన రెడ్‌మై 1ఎస్ స్మార్ట్‌ఫోన్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రముఖ రిటైలర్ Flipkart  వద్ద లభ్యంకానుంది. ధర రూ.5,999. ఫోన్ కొనుగోలు మైక్రోసిమ్ కార్డ్ ట్రేతో పాటు స్ర్కీన్ ప్రొటెక్టర్‌ను ఉచితంగా అందించనున్నారు.

షియోమీ రెడ్‌మై 1ఎస్...నేటి నుంచే అమ్మకాలు ప్రారంభం

షియోమీ రెడ్‌మై 1ఎస్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్, 300 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్, . ఎంఐయూఐ వర్షన్ 5 ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 సాక్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్ అలానే ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా.

షియోమీ ఎమ్ఐ3, రెడ్‌మై 1ఎస్, రెడ్‌మై నోట్ వేరియంట్‌లలో మూడు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మై ప్యాడ్ పేరుతో ఓ ట్యాబ్లెట్పీసీని షియోమీ ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో ఎమ్ఐ3 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లభ్యమవుతుండగా రెడ్‌మై 1ఎస్ ఫోన్ అమ్మకాలు నేటి నుంచి ప్రారంభంకాబోతున్నాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Xiaomi Redmi 1S To Go On Sale Today Starting 2PM At Rs 5,999 [Freebies Included]. read more in Telugu GIZBOT......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot