జియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్..రేపే మార్కెట్లోకి
ఇండియన్ మార్కెట్లో జియోమీ ఎమ్ఐ3 స్మార్ట్‌ఫోన్‌లతో రికార్డులు సృష్టిస్తోన్న జియోమీ, రెడ్‌మై 1ఎస్ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆగష్ట్ 26న కొత్తఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జియోమీ తన రెడ్‌మై 1ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేస్తుంది. ఫోన్ ధర రూ.6,999. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించే అవకాశం ఉంది.

జియోమీ రెడ్‌మై ఎస్ కీలక ఫీచర్లు:
4.7 అంగుళాల హైడెఫినిషన్ 720 పికల్ డిస్‌ప్లే,
1.6గిగాహెట్జ్ స్నాప్ డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
1జీబి ర్యామ్,
8జీబి ఇంటర్నల్ మెమరీ,
మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డ్యూయల్ సిమ్, బ్లూటూత్, జీపీఎస్).
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








