షియోమో రెడ్‌మై 1ఎస్@ రూ.5,999

Posted By:

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ షియోమీ (Xiaomi) తన సరికొత్త ఉత్పత్తులను ఇటీవల ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. జియోమీ ఎమ్ఐ3, రెడ్‌మై 1ఎస్, రెడ్‌మై నోట్ వేరియంట్‌లలో మూడు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మై ప్యాడ్ పేరుతో ఓ ట్యాబ్లెట్ పీసీని జియోమీ  ప్రదర్శించింది. వీటిలో షియోమీ ఎమ్ఐ3 స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లభ్యమవుతుండగా మంగళవారం, రెడ్‌మై 1ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను షియోమీ భారత్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.5,999.

షియోమో రెడ్‌మై 1ఎస్@ రూ.5,999

షియోమీ రెడ్‌మై 1ఎస్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్, 300 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్, . ఎంఐయూఐ వర్షన్ 5 ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 సాక్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్ అలానే ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం, సెప్టంబర్ 2 నుంచి అమ్మకాలు

రెడ్‌మై 1ఎస్ స్మార్ట్‌ఫోన్‌‌ను జియోమీ మంగళవారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.5,999. ప్రముఖ రిటైలర్ Flipkart ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. సెప్టంబర్ 2 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. రెడ్‌మై 1ఎస్ స్మార్ట్‌ఫోన్‌‌ను సొంతం చేసుకోవాలనుకునే వారు ముందుగా ఫ్లిప్‌కార్ట్ వద్ద రిజిస్టర్ కావల్సి ఉంటుంది.

షియోమీ రెడ్‌మై 1ఎస్ హ్యాండ్స్ ఆన్ రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు...

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/6_mTxV1uIPA? feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Xiaomi Redmi 1S launched at Rs 5,999, Hands on Review. Read more in Telugu &#13; Gizbot.....&#13;
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot