ఆఫ్‌‌లైన్ మార్కెట్లోనూ Redmi 3S ఫోన్ దొరకుతుంది

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో సరికొత్త సంచలనాలకు తెరలేపుతోన్న చైనా ఫోన్ల కంపెనీ Xiaomi, భారత్‌లో ఆఫ్‌లైన్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటి వరకు షియోమీ తన Redmi ఫోన్‌లను ఈ-కామర్స్ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉంచింది.

ఆఫ్‌‌లైన్ మార్కెట్లోనూ Redmi 3S ఫోన్ దొరకుతుంది

Read More : సెప్టంబర్‌లో లాంచ్ అయిన సంచలన 4జీ డేటా ప్లాన్స్ ఇవే

తాజాగా ఈ బ్రాండ్ Redmi 3S Plus సరికొత్త ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫోన్ కేవలం ఆఫ్‌లైన్ రిటైల్ మార్కెట్లో మాత్రమే లభ్యమవుతుంది. శనివారం నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన Redmi 3S Primeకు దగ్గర పోలికలను కలిగి ఉండే ఈ ఫోన్ 2జీబి ర్యామ్‌ తో వస్తోంది. ఫోన్ ధర రూ.9,499. డిస్కౌంట్ పై రూ.8,799కి సొంతం చేసుకోవచ్చు.

ఆఫ్‌‌లైన్ మార్కెట్లోనూ Redmi 3S ఫోన్ దొరకుతుంది

Read More : సోనీ Xperia XZ, ధర రూ.51,990.. ఐఫోన్‌కు షాకిచ్చేలా ఉంది

రెడ్మీ 3ఎస్ ప్లస్ స్పెసిఫికేషన్స్:

5 అంగుళాల 720 పిక్సల్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 6.0.1 ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 ప్లాట్‌ఫామ్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 సాక్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్, 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్), ఫోన్ లో పొందుపరిచిన సెన్సార్స్ (ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సాన్, యాక్సిలరోమీటర్, గైరో స్కోప్).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Redmi 3s, Redmi 3s Prime

Xiaomi  కొద్ది వారాల క్రితం రెండు సరికొత్త మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. Redmi 3s, Redmi 3s Prime మోడల్స్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్‌ల ధరలు రూ.6,999, రూ.8,999గా ఉన్నాయి.

Mi.com, Flipkart

ఈ రెండు ఫోన్‌లను Mi.com అలానే Flipkartలు ఎక్స్‌క్లూజివ్‌గా ఓపెన్ సేల్ పై విక్రయించనున్నాయి. రెడ్మీ 3ఎస్ ప్రైమ్ అమ్మకాలు ఆగష్టు 9 నుంచి మార్కెట్లో ప్రారంభమవుతాయి. రెడ్మీ 3ఎస్ అమ్మకాలు ఆగష్టు 16 నుంచి ప్రారంభమవుతాయి. రూ.8,999 ధర ట్యాగ్‌లో అందుబాటులో ఉంచిన రెడ్మీ 3ఎస్ ప్రైమ్..3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి పటిష్టమైన ఫీచర్లను కలిగి ఉంది.

రూ.6,999 ధర ట్యాగ్‌లో..

రూ.6,999 ధర ట్యాగ్‌లో అందుబాటులో ఉంచిన రెడ్మీ 3ఎస్.. 2జీబి, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి స్పెక్స్‌తో వస్తోంది. మిగిలిన ఫీచర్లు ఈ రెండు ఫోన్‌లలో సమానంగా ఉంటాయి. రెడ్మీ 3ఎస్, రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్‌ల స్పేసిఫికేషన్‌లకు సంబంధించిన 10 ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చడొచ్చు..

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి..

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 3ఎస్ అలానే రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్‌లు రెడ్మీ నోట్ 3కి దగ్గరగా ఉంటాయి. ఈ ఫోన్‌లు మందం 8.5 మిల్లీ మీటర్లు. బరువు విషయానికి వచ్చేసరికి 144 గ్రాములు. మెటల్ బాడీతో వస్తోన్న ఈ ఫోన్‌లు ప్రీమియమ్ లుక్‌ను చేరువ చేస్తాయి.

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి...

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 3ఎస్ అలానే రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్‌లు 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీలను కలిగి ఉన్నాయి.

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి...

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ఈ రెండు ఫోన్‌లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. అడ్రినో 505 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.

స్టోరేజ్ అలానే ర్యామ్..

స్టోరేజ్ అలానే ర్యామ్ విషయానికి వచ్చే సరికి... రెడ్మీ 3ఎస్ ప్రైమ్ (3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ), రెడ్మీ 3ఎస్ (2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ)లను కలిగి ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఈ రెండు ఫోన్‌లకు సంబంధించిన స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకోవచ్చు.

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి..

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి.. ఈ రెండు ఫోన్‌లలో 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. రిసల్యూషన్ వచ్చేసరికి720x 1280పిక్సల్స్.

కెమెరా విషయానికి వచ్చేసరికి..

కెమెరా విషయానికి వచ్చేసరికి.. ఈ రెండు ఫోన్‌లలో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను చూడొచ్చు. (ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్, ఫుల్ హైడెఫినిషన్ 1080 పిక్సల్ రికార్డింగ్, హెచ్‌డీఆర్, హెచ్‌హెచ్‌టీ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలలో ఉన్నాయి)

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి..

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి.. ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్థి చేసిన MIUI 7 యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతాయి.

కనెక్టువిటీ ఫీచర్లు..

ఈ రెండు ఫోన్‌లలో కనెక్టువిటీ ఫీచర్లు.. 4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఆర్ఎస్, జీపీఎస్, గ్లోనాస్. రెడ్మీ 3ఎస్ ప్రైమ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో వస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi 3S Plus is Company's First Offline Retail-Only Phone for India. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot