Home
Mobile

Xiaomi vs Lenovo, ఏ ఫోన్ బాగుంటుంది..?

By Sivanjaneyulu Bommu

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో Xiaomi, Lenovo బ్రాండ్‌ల మధ్య తీవ్రమైన పోటీ వాతావరణం నెలకుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హోరాహోరీ అమ్మకాలతో దూసుకుపోతున్న ఈ బ్రాండ్‌లు రెండు సరికొత్త ఫోన్‌లను ఇటీవల మార్కెట్లో లాంచ్ చేసాయి.

Xiaomi vs Lenovo, ఏ ఫోన్ బాగుంటుంది..?

Read More : మీకు మెయిల్ అకౌంట్ ఉందా..? ఇవి తప్పక తెలుసుకోండి

Redmi 3s Prime, Vibe K5 Plus మోడల్స్‌లో విడుదలైన ఈ ఫోన్‌లు మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంచుమించుగా ఒకే ధర ట్యాగ్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లలో సరైన ఫోన్‌ను ఎంపిక చేసుకునేందుకు యువత తర్జన భర్జన పెడుతున్నారు. ఫోన్ ఎంపిక విషయంలో బ్రాండ్ వాల్యూ అలానే స్పెక్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ రెండు ఫోన్‌ల విషయంలో ఏఏ అంశాలు కీలక పాత్ర పోషించాయో ఓ సారి చూద్దాం..

మోటాలిక్ బాడీ

మోటాలిక్ బాడీ

షియోమీ రెడ్మీ 3ఎస్ ప్రైమ్ అలానే లెనోవో వైబ్ కే5 ప్లస్‌లు మోటాలిక్ బాడీతో వస్తున్నాయి. ప్రీమియమ్ లుక్ ఈ ఫోన్‌ల సొంతం. రౌండ్ ఎడ్జ్‌లు ఆకట్టుకుంటాయి.

డిస్‌ప్లే విభాగంలో

డిస్‌ప్లే విభాగంలో

షియోమీ రెడ్మీ 3ఎస్ ప్రైమ్ అలానే లెనోవో వైబ్ కే5 ప్లస్‌లు సమానమైన 5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తున్నాయి. రిసల్యూషన్‌లో మాత్రం తేడాలు ఉన్నాయి. రెడ్మీ 3ఎస్ హైడెఫినిషన్ 720 పిక్సల్ ప్యానల్‌తో వస్తుండగా, వైబ్ కే5 ప్లస్ మాత్రం 1080 పిక్సల్ స్ర్కీన్ రిసల్యూషన్‌తో వస్తోంది.

ప్రాసెసర్, ర్యామ్ ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్

ప్రాసెసర్, ర్యామ్ ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్

ప్రాసెసర్, ర్యామ్ ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి.. రెడ్మీ 3ఎస్ ప్రైమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో వస్తోంది. 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. 

లెనోవో వైబ్ కే5 ప్లస్‌ విషయానికి వచ్చేసరికి స్నాప్‌డ్రాగన్ 616 ఆక్టా కోర్ ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

కెమెరా విషయానికి వచ్చేసరికి..

కెమెరా విషయానికి వచ్చేసరికి..

కెమెరా విషయానికి వచ్చేసరికి.. రెడ్మీ 3ఎస్ ప్రైమ్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్ f/2.2 aperture వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. మరోవైపు లెనోవో వైబ్ కే5 ప్లస్‌ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది.

ఆపరేటింగ్ సిస్టం

ఆపరేటింగ్ సిస్టం

ఆపరేటింగ్ సిస్టం విషయానికి వచ్చేసరికి లెనోవో ఫోన్ ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆధారంగా డిజైన్ చేసిన Vibe UI పై రన్ అవుతుంది. రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆధారంగా డిజైన్ చేసిన MIUI 7 పై రన్ అవుతుంది.

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి...

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి...

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి... రెడ్మీ 3ఎస్ ప్రైమ్ శక్తివంతమైన 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. మరోవైపు లెనోవో ఫోన్ కేవలం 2750 ఎమ్ఏహెచ్ బ్యాటరీని మాత్రమే ఆఫర్ చేస్తుంది.

ఫింగర్ ప్రింట్ స్కానర్‌

ఫింగర్ ప్రింట్ స్కానర్‌

రెడ్మీ 3ఎస్ ప్రైమ్ అదనంగా ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తోంది. లెనోవో ఫోన్‌లో ఈ సదుపాయం లేదు.

కనెక్టువిటీ ఫీచర్లు

కనెక్టువిటీ ఫీచర్లు

ఈ రెండు ఫోన్‌లు 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌తో పాటు ఇతర స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లను కలిగి ఉన్నాయి.

ధర విషయానికి వచ్చేసరికి

ధర విషయానికి వచ్చేసరికి

ధర విషయానికి వచ్చేసరికి లెనోవో వైబ్ కే5 ప్లస్ మార్కెట్ ధర రూ.8,499. ఇదే సమయంలో రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ధర రూ.8,999.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi 3s Prime vs Lenovo Vibe K5 Plus: Which one will get the budget smartphone crown?. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X