షియోమీ Redmi 3s vs మోటో E3 Power, ఏది బెస్ట్ ఫోన్..?

కొద్దిగంటల క్రితం మోటరోలా తన Moto E3 Power ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.7,999గా ఉంది. మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న Redmi 3sకు ఈ ఫోన్ ప్రధాన పోటీదారుగా నిలవనుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ రెండు ఫోన్‌ల మధ్య spec Comparisonను పరిశీలించినట్లయితే...

Read More : మార్కెట్లోకి 'మోటో ఇ3 పవర్' ధర రూ.7,999, నేటి అర్థరాత్రి నుంచి అమ్మకాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిజైనింగ్ పరంగా చూస్తే..

Moto E3 Power ప్లాస్టిక్ బాడీతో వస్తోంది. మరోవైపు Redmi 3s ఫుల్ మెటల్ బాడీతో వస్తోంది.

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి...

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్‌తో కూడిన 720 పిక్సల్ హైడెఫినిషన్ డి‌స్‌ప్లేతో వస్తున్నాయి. చిన్న చిన్న నీటి ప్రమాదాలను తట్టుకునే విధంగా వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్ 2ను మోటో ఇ3 పవర్ పై ఏర్పాటు చేయటం జరిగింది.

హార్డ్‌వేర్ విషయానికి వచ్చేసరికి...

Redmi 3s ఫోన్ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ఆక్టా కోర్ చిప్‌సెట్‌తో వస్తోంది. రెండు ర్యామ్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. అందులో మొదటి వేరియంట్ (2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ), రెండవ వేరియంట్ (3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ), మరోవైపు మోటో ఇ3 పవర్ మీడియాటెక్ ఎంటీ6735 చిప్‌సెట్‌తో వస్తోంది. 2జీబి ర్యామ్ మాత్రమే.

కెమెరా విషయానికి వచ్చేసరికి...

మోటో ఇ3 వపర్ ఫోన్ 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసిగ్ కెమెరాలతో వస్తోంది. ఇదే సమయంలో రెడ్మీ 3ఎస్ ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసిగ్ కెమెరాలను కలిగి ఉంది.

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి

రెడ్మీ 3ఎస్ శక్తివంతమైన 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. మరోవైపు మోటో ఇ3 పవర్ 3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి...

మోటో ఇ3 పవర్ ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. మరోవైపు షియోమీ 3ఎస్ ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్‌తో కూడిన MIUI యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతుంది.

ధర విషయానికి వచ్చేసరికి..

Redmi 3s ప్రారంభ వేరియంట్ ధర రూ.7,999. మోటో ఇ3 పవర్ ధర రూ.7,999.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi 3s vs Motorola Moto E3 Power: Which One Stands Tall in the Budget Segment?. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot