రెడ్‌మి 4 ఫ్లాష్ సేల్ ఈ రోజే..

Written By:

షియోమి నుంచి విడుదలై ఇండియాలో సంచలనం రేపిన రెడ్‌మి 4 స్మార్ట్‌ఫోన్ యూజర్లకి చిక్కడం లేదన్న సంగతి తెలిసిందే. ఫ్లాష్ సేల్ కొచ్చిన ప్రతీసారి ఈ ఫోన్ నిమిషాల్లలోనే అమ్ముడుపోతోంది. అయితే మళ్లీ ఈ రోజు ఈ ఫోన్ ఫ్లాష్ సేల్ లోకి వచ్చింది. అమెజాన్ ,మి.కామ్ ద్వారా ఈ ఫోన్ అమ్మకానికి రానుంది. ఈ అమ్మకాలు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.ఫీచర్లు, ధర ఈ కింది విధంగా ఉన్నాయి.

రూ.7000లో బెస్ట్ ఫోన్ ఇదే, Redmi 4 రివ్యూ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5 ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ నౌగట్ ప్రివ్యూ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్.

ర్యామ్ వేరియంట్స్

ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

కెమెరా

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4100mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్ 4జీ సపోర్ట్,

ధరల వివరాలు..

Redmi 4 (2జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ వేరియంట్) ధర రూ.6,999.

(3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వేరియంట్) ధర రూ.8,999.

4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వేరియంట్) ధర రూ.10,999.

 

బ్యాటరీ పెద్ద ప్లస్ పాయింట్

Redmi 4 స్మార్ట్‌ఫోన్‌కు బ్యాటరీ పెద్ద‌ప్లస్ పాయింట్. ఈ డివైస్‌లో అమర్చిన 4,100mAh బ్యాటరీ, సింగిల్ ఛార్జ్ పై ఏకంగా రెండురోజుల నికరమైన బ్యాటరీ బ్యాకప్ ను ఆఫర్ చేస్తుంది. ఈ బ్యాటరీ మొత్తం ఫుల్ ఛార్జ్ అవటానికి 2 గంటల సమయం తీసుకుంటోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi 4 Flash Sale in India Set for Today, via Amazon and Mi.com Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot