Redmi 4 మొదటి సేల్ ఈ రోజే, Amazon ఆఫర్లు సిద్ధం
మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే ఈ సేల్ Amazon.inలో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉంటుంది.
షియోమి కొత్త స్మార్ట్‌ఫోన్ Redmi 4, మరికొద్ది సేపట్లో ఆన్‌లైన్ సేల్ పై లభ్యంకాబోతోంది. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే ఈ సేల్ Amazon.inలో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులో ఉంటుంది. Redmi 4 ఫోన్ మొత్తం మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
Read More : నోకియాకు సవాల్, రూ.1199కే మైక్రోమాక్స్ ఫోన్, 100 రోజుల రీప్లేస్‌మెంట్ వారంటీ

మూడు రకాల వేరియంట్‌లలో...
మొదటి వేరియంట్ వచ్చేసరికి 2జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతుంది. ధర రూ.6,999. రెండవ వేరియంట్ వచ్చేసరికి 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతుంది. ధర రూ.8,999. మూడవ వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ కెపాసిటీతో లభ్యమవుతుంది. ధర రూ.10,999.

రెడ్‌మి 4 స్పెసిఫికేషన్స్..
5 ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ నౌగట్ ప్రివ్యూ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్. ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. కెమెరా 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4100mAh బ్యాటరీ.

రెడ్‌మి 4 vs రెడ్‌మి 4ఏ
చాలా మంది యూజర్లు రెడ్‌మి 4ను తీసుకోవాలా లేక రెడ్‌మి 4ఏను తీసుకోవాలా అన్న సందేహంలో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం రూ.1000 తేడాతో లభ్యమవుతోన్న ఈ రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లకు సంబంధించి spec comparisonను ఇప్పుడు చూద్దాం..

డిజైన్ అండ్ డిస్‌ప్లే
బాడీ డిజైన్ విషయానికి వచ్చేసరికి రెడ్‌మి 4 ఫోన్ మెటల్ బాడీతో వస్తోంది. ఇదే సమయంలో రెడ్‌మి 4ఏ ప్లాస్టిక్ బాడీని కలిగి ఉంటుంది. డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి ఈ రెండు ఫోన్‌లు 5 అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. రెడ్‌మి 4 మోడల్‌కు 2.5డి కర్వుడ్ గ్లాస్ అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.

ప్రాసెసర్
ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి, రెడ్‌మి 4 ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 చిప్‌సెట్ పై రన్ అవుతుంది. ఇదే సమయంలో రెడ్‌మి 4ఏ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 435 చిప్‌సెట్ పై రన్ అవుతుంది.

ర్యామ్ ఇంకా స్టోరేజ్
ర్యామ్ ఇంకా స్టోరేజ్ విషయానికి రెడ్‌మి 4ఏ ఫోన్ కేవలం 2జీబి ర్యామ్ ఇంకా 16జీబి స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో రెడ్‌మి 4 మోడల్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 2జీబి+16జీబి, 3జీబి +32జీబి, 4జీబి+64జీబి స్టోరేజ్.

ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్
రెడ్‌మి 4 ఫోన్‌కు ఫింగర్ ప్రింట్ స్కానర్ అదనపు ప్లస్ పాయింట్. రెడ్‌మి 4ఏలో ఈ సదుపాయం లోపించింది. ఈ రెండు ఫోన్లు 4G LTE, VoLTE, Wi-Fi, Bluetooth, GPS, USB OTG వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తాయి.

కెమెరా..
ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు సమానమైన 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కలిగి ఉంటాయి.

రెడ్‌మి 4 ఫోన్‌కు ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్
సాఫ్ట్‌వేర్ విషయంలోనూ అంతే, ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు Android 6.0.1 Marshmallow ఆధారంగా డిజైన్ చేసిన MIUI 8 పై యూజర్ ఇంటర్‌ఫేస్ పై బూట్ అవుతాయి. రెడ్‌మి 4 ఫోన్‌కు త్వరలోనే ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్ లభించే అవకాశం ఉంది.

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి
బ్యాటరీ విషయానికి వచ్చేసరికి రెడ్‌మి 4 మోడల్ ఏకంగా 4100mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోంది. ఇదే సమయంలో రెడ్‌మి 4ఏ మోడల్ కేవలం 3120mAh బ్యాటరీని మాత్రమే కలిగి ఉంటుంది.

ధరలు విషయానికొస్తే..
మార్కెట్లో రెడ్‌మి 4ఏ మోడల్ ధర రూ.5,999గా ఉంది. రెడ్‌మి 4 2జీబి+16జీబి ధర రూ.6,999, 3జీబి +32జీబి వేరియంట్ ధర రూ.8,999 , 4జీబి+64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999.

రెడ్‌మి4 లాంచ్ డే ఆఫర్స్
లాంచ్ డే ఆఫర్స్ లో భాగంగా రెడ్మీ 4 కొనుగోలు పై ఎస్ బ్యాంక్ క్రెడిట్ అలానే డెబిట్ కార్డ్ యూజర్లు రూ.500 వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశాన్ని అమెజాన్ కల్పిస్తోంది. అంతేకాకుండా, రెడ్మీ 4 కొనుగోలు పై వొడాఫొన్ కస్టమర్‌లు 45జీబి 4జీ డేటాను పొందే వీలుంటుంది. ఈ డేటాను 5 నెలల పాటు వినియోగించుకవచ్చు. రూ.499 ఖరీదు చేసే రెడ్మీ4 ఒరిజినల్ ఎంఐ కేస్ రూ.349కే సొంతమవుతుంది.


Click it and Unblock the Notifications








