రూ.7000లో బెస్ట్ ఫోన్ ఇదే, Redmi 4 రివ్యూ

|

షియోమి నుంచి లాంచ్ అయిన మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ Redmi 4 మార్కెట్లో దుమ్మురేపుతోంది. ఈ ఫోన్ రెడ్‌మి నోట్ 4, రెడ్‌మి నోట్ 4, రెడ్‌మి 4ఏ మాదిరిగానే మార్కెట్లో అమ్మకాల సునామీని సృష్టిస్తోంది. రూ.6,999 ధర ట్యాగ్‌లో సరికొత్త బెంచ్ మార్క్‌ను సృష్టించిన Redmi 4 అటు డిజైన్ పరంగా, ఇటు పనితీరు పరంగా దిబెస్ట్ అనిపించేలా ఉంది.

 

మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది

మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది

Amazon.in అలానే Mi.comలలో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా ట్రేడ్ అవుతోన్న Redmi 4 ఫోన్ మొత్తం మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

వాటి వివరాలు...

వాటి వివరాలు...

మొదటి వేరియంట్ (2జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్) ధర రూ.6,999. రెండవ వేరియంట్ (3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్) ధర రూ.8,999. మూడవ వేరియంట్ (4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్) ధర రూ.10,999. మూడవ వేరియంట్ మాత్రం జూన్ నెలాఖరు నుంచి మాత్రం అందుబాటులో ఉంటుంది. Xiaomi Redmi 4 పనితీరుకు సంబంధించిన పూర్తి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం..

బిల్డ్ క్వాలిటీ ఇంకా డిజైన్
 

బిల్డ్ క్వాలిటీ ఇంకా డిజైన్

డిజైన్ విషయానికి వచ్చేసరికి Redmi 4 ఫోన్ మొదటి లుక్‌లోనే రెడ్మీ నోట్ 4ను తలపిస్తుంది. స్లీక్ మెటల్ యునిబాడీ డిజైన్, స్మూత్‌గా అనిపించే రేర్ ప్యానల్, మెటల్ ఫినిషింగ్ వంటి అంశాలు రెడ్‌మి 4 ఫోన్‌కు ప్రీమియమ్ ఫీల్‌ను తీసుకువచ్చాయి. డిస్‌ప్లే పై అమర్చిన 2.5డి కర్వుడ్ గ్లాస్ ఫోన్ అందాన్ని మరింత పెంచేసింది.

బిల్డ్ క్వాలిటీ ఇంకా డిజైన్

బిల్డ్ క్వాలిటీ ఇంకా డిజైన్

షియోమి ఈ ఫోన్‌లో కొన్ని సిమ్మిట్రికల్ డిజైన్ మార్పులను చేసింది. దీంతో హెడ్‌ఫోన్ జాక్ అలానే ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌లు ఫోన్ పై భాగంలో కనిపిస్తాయి. ఫ్రంట్ కెమెరా అలానే లైట్ సెన్సార్‌లను ఇయర్ పీస్‌కు ఇంకో వైపు ఏర్పాటు చేయటం జరిగింది. ఇదే సమయంలో మైక్రోయూఎస్బీ పోర్ట్ ను ఫోన్ క్రింది భాగంలో స్పీకర్ గ్రిల్స్ మధ్య ఫిట్ చేయటం జరిగింది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి ఫోన్ వెనుక భాగంతో వేళ్లకు అందే విధంగా అమర్చారు.

డిజైనింగ్ పరంగా డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే

డిజైనింగ్ పరంగా డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే

ఈ ఫోన్‌లో డిజైనింగ్ పరంగా చిన్న డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే అది కెపాసిటివ్ టచ్ బటన్స్ దగ్గరే. డిస్‌ప్లే క్రింది భాగంలో ఏర్పాటు చేసిన ఈ కెపాసిటివ్ టచ్ బటన్స్ కు backlit సౌకర్యం లేదు. 150 గ్రాముల బరువును కలిగి ఉండే ఈ ఫోన్ చేతిలో కంఫర్ట్ ఫీల్‌ను చేరువచేస్తుంది.

ఫీల్‌ను చేరువచేస్తుంది.

 

డిస్‌ప్లే విషయానికొస్తే..

డిస్‌ప్లే విషయానికొస్తే..

Redmi 4 ఫోన్ 5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తోంది. స్ర్కీన్ రిసల్యూషన్ వచ్చేసరికి 1280 x 720పిక్సల్స్. డిస్‌ప్లే పై కవర్ చేసిన 2.5డి కర్వుడ్ గ్లాస్ డీసెంట్ లుక్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ డిస్‌ప్లే ఆఫర్ చేసే వ్యూవింగ్ యాంగిల్స్ బాగుంటాయి. వీడియోలను స్ట్రీమ్ చేస్తున్న సమయంలో, గేమ్స్ ఆడుతోన్న సమయంలో ఈ హైడెఫినిషన్ డిస్‌ప్లే మంచి వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఆఫర్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్ ఇంకా యూజర్ ఇంటర్‌ఫేస్

సాఫ్ట్‌వేర్ ఇంకా యూజర్ ఇంటర్‌ఫేస్

Redmi 4 స్మార్ట్‌ఫోన్ ఫీచర్ రిచ్ MIUI 8.2 యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తోంది. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా చేయబడిన ఈ ఇంటర్‌ఫేస్‌ క్వాలిటీ స్మార్ట్ మొబైలింగ్ ఆఫర్ చేస్తుంది. భవిష్యత్‌లో ఈ ఫోన్‌కు ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ అప్‌డేట్ లభించే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో MI యాప్స్‌తో పాటు కొన్ని యాప్స్‌ను ముందుగానే లోడ్ చేయటం జరిగింది. వీటిని వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు. డు-నాట్-డిస్ట్రబ్, సెకండ్ స్పేస్, లైట్ మోడ్, డ్యుయల్ యాప్స్, ఫింగర్ ప్రింట్ లాక్ వంటి ఉపయుక్తమైన యాప్స్ కూడా ఈ డివైస్‌లో ఉన్నాయి.

హార్డ్‌వేర్

హార్డ్‌వేర్

Redmi 4 స్మార్ట్‌ఫోన్ హార్డ్‌వేర్ విభాగాన్ని పరిశీలించినట్లయితే.. ఈ ఫోన్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అయితే, మేము రివ్యూ చేసిన యూనిట్ మాత్రం ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్ పై రన్ అవుతోన్న 3జీబి ర్యామ్ +32జీబి స్టోరేజ్ వేరియంట్.

 పనితీరును విశ్లేషించిచూడగా

పనితీరును విశ్లేషించిచూడగా

ఫోన్ కాన్ఫిగరేషన్‌ను బట్టి పనితీరును విశ్లేషించిచూడగా చాలా వరకు టాస్క్స్ స్మూత్ గానే కంప్లీట్ అయ్యాయి. యూజర్ ఇంటర్‌ఫేస్‌ను నేవిగేట్ చేయటం, యాప్స్‌ను లాంచ్ చేయటం, మల్టిపుల్ యాప్స్ మధ్య స్విచ్ అవ్వటం వంటి టాస్క్స్ నిర్వహించినపుడు డివైస్ పనితీరు ఏ మాత్రం నెమ్మదించలేదు. ఫోన్ బ్యాక్ గ్రౌండ్‌లో 11 యాప్స్ రన్ అవుతన్నప్పటికి ఇంకా 1జీబి కంటే ఎక్కువ ర్యామ్ మిగిలి ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

 

గేమ్స్ ఆడుతోన్న సమయంలో...

గేమ్స్ ఆడుతోన్న సమయంలో...

ఫుల్ హైడెఫినిషన్ వీడియోలను ప్లే చేస్తున్న సమయంలో, ఫోన్ పనితీరు పరంగా ఎటువంటి అంతరాయాలు ఎదురుకాలేదు. Subway Surf, Dancing Line, Super Mario run, Pokemon వంటి లైట్ గేమ్స్ ఆడుతోన్న సమయంలోనూ డివైస్ పనితీరు ఏ మాత్రం నెమ్మదించలేదు. Asphalt 9, Modern Combat 5 వంటి హెవీ గేమ్స్ ఆడుతోన్న
సమయంలో మాత్రం ఫోన్ పనితీరులో స్వల్ప మార్పులు సంభవించాయి. ఇవి హెవి గ్రాఫికల్ గేమ్స్ కావటంతో అక్కడక్కడా ఫోన్ పనితీరు నిదానించింది.

 బ్యాటరీ పెద్ద ప్లస్ పాయింట్

బ్యాటరీ పెద్ద ప్లస్ పాయింట్

Redmi 4 స్మార్ట్‌ఫోన్‌కు బ్యాటరీ పెద్ద‌ప్లస్ పాయింట్. ఈ డివైస్‌లో అమర్చిన 4,100mAh బ్యాటరీ, సింగిల్ ఛార్జ్ పై ఏకంగా రెండురోజుల నికరమైన బ్యాటరీ బ్యాకప్ ను ఆఫర్ చేస్తుంది. ఈ బ్యాటరీ మొత్తం ఫుల్ ఛార్జ్ అవటానికి 2 గంటల సమయం తీసుకుంటోంది.

కెమెరా

కెమెరా

Redmi 4 స్మార్ట్‌ఫోన్ కెమెరా డిపార్ట్‌మెంట్‌ను పరిశీలించినట్లయితే ఫోన్ ప్రైమరీ కెమరా 13 మెగా పిక్సల్ గాను, సెకండరీ కెమెరా 5 మెగా పిక్సల్ గానూ ఉంటుంది. పనితీరును విషయానికి వచ్చేసరికి ఈ కెమెరాలు డేలైట్ కండీషన్స్‌లో క్వాలిటీ పనితీరును కనబరుస్తున్నాయి. తక్కువ వెళుతురు కండీషన్స్‌లో మాత్రం పనితీరు అంతగా ఆకట్టుకునే విధంగా లేదు. ఫుల్ హెచ్‌డి రిసల్యూషన్‌తో చిత్రీకరించే విడియోలు ఆకట్టుకున్నాయి.

ఫోన్ ఇతర ఫీచర్లు...

ఫోన్ ఇతర ఫీచర్లు...

Redmi 4 స్మార్ట్‌ఫోన్ క్లియర్ ఆడియో అవుట్ పుట్ ను ఆఫర్ చేస్తోంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఖచ్చితత్వంతో పనిచేస్తోంది. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌తో పాటు 4జీ వోల్ట్, వై-ఫై, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో-యూఎస్బీ, బ్లుటూత్ వీ4.1, ఇన్ ఫ్రారెడ్ సెన్సార్ వంటి మోడ్రన్ కనెక్టువిటీ ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

తుది నిర్ణయం మీదే...

తుది నిర్ణయం మీదే...

ఫీచర్స్ పరంగా పనితీరు పరంగా Redmi 4 స్మార్ట్‌ఫోన్ ఏమాత్రం వంక పెట్టేలా లేదు. రూ.7,000 రేంజ్‌లో స్మార్ట్ ఫోన్ కోసం ఎదురుచూస్తోన్న వారికి Redmi 4 స్మార్ట్‌ఫోన్ పర్‌ఫెక్ట్ ఛాయిస్. ఇంచుమించుగా ఇదే ధర రేంజ్‌లో ఇప్పటికే మార్కెట్లో సిద్ధంగా ఉన్న లెనోవో కే6 పవర్ (రూ.9,999), మోటో జీ4 (రూ.7,499) ఫోన్‌ల పై Redmi 4 ఎఫెక్ట్ పడుతుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi Redmi 4 Review: Continues the legacy of maintaining price-to-specs ratio. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X