30 రోజుల్లో 10 లక్షల Redmi 4 యూనిట్లు సేల్

అమ్మకాల పరంగా Redmi 4 స్మార్ట్‌ఫోన్ సరికొత్త రికార్డును సృష్టించినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయిన 30 రోజులు కావొస్తున్న నేపథ్యంలో షియోమీ ఆసక్తికర వివరాలను అనౌన్స్ చేసింది. కేవలం 30 రోజుల్లో 10 లక్షల Redmi 4 యూనిట్లను విక్రయించగలిగామని షియోమీ తెలిపింది. మార్కెట్లో రెడ్‌మి 4 స్మార్ట్‌ఫోన్‌లను ఫ్లాష్ సేల్స్ అలానే ప్రీ-ఆర్డర్స్ పై విక్రయిస్తోన్న విషయం తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండు వేరియంట్‌లలో మాత్రమే దొరుకుతోంది

Redmi 4 స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో మూడు వేరియంట్‌లతో లాంచ్ అయ్యింది. ప్రస్తుతానికి రెండు వేరియంట్‌లలో మాత్రమే ఈ ఫోన్ లభ్యమవుతోంది.

వాటి వివరాలు

2జీబి ర్యామ్ + 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999. 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999. మార్కెట్లో విడుదల కావల్సి ఉన్న 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.10,999గా ఉంది.

మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అయ్యింది..

మే 23న లాంచ్ అయిన ఈ ఫోన్లను Amazon India అలానే Mi.comలు ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నాయి. త్వరలోనే ఈ ఫోన్‌లను ఆఫ్‌లైన్ మార్కెట్లో కూడా విక్రయించబోతున్నట్లు సమాచారం.

Redmi 4 స్పెసిఫికేషన్స్...

5 ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ నౌగట్ ప్రివ్యూ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్.

ర్యామ్, స్టోరేజ్..

ర్యామ్ వేరియంట్స్ ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు

కెమెరా 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4100mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్ 4జీ సపోర్ట్,

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi 4 Sells 1 Million Units Sold in India in 30 Days, Company Claims. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot