Home
Mobile

రెడ్‌మి 4 vs రెడ్‌మి 4ఏ, వీటిలో బెస్ట్ ఫోన్ ఏది..?

చాలా మంది యూజర్లు రెడ్‌మి 4ను తీసుకోవాలా లేక రెడ్‌మి 4ఏను తీసుకోవాలా అన్న సందేహంలో ఉన్నట్లు తెలుస్తోంది.

By Sivanjaneyulu Bommu

రూ.6,000 నంచి రూ.13,000 వరకు అన్ని రకాల బడ్జెట్ సెగ్మెంట్‌లను టార్గెట్ చేస్తూ షియోమి తన రెడ్‌మి (Redmi) ఫోన్‌లను లాంచ్ చేస్తూ వస్తోంది. ఈ బ్రాండ్ నుంచి మార్చి‌లో లాంచ్ అయిన రెడ్‌మి 4ఏ (Redmi 4A) మోడల్ మార్కెట్లో ఎంత్ హిట్టయ్యిందో మనందరికి తెలుసు. రూ.5,999కే అందుబాటులో ఉన్న ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లాక్ బాస్టర్ స్మార్ట్‌ఫోన్‌‌ కోసం జనం భారీగా ఎగబడుతున్నారు.

షియోమి రెడ్‌మి 4

షియోమి రెడ్‌మి 4

రెడ్‌మి 3ఎస్ ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా భావిస్తోన్న రెడ్‌మి 4 ఫోన్‌ను షియోమి తాజాగా మార్కెట్లోకి తీసుకువచ్చింది. రెడ్‌మి 4 ప్రారంభ వేరియంట్ ధర రూ.6,999. ఈ ఫోన్‌కు సంబంధించిన మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌లో జరుగబోతోంది.

రెడ్‌మి 4ను తీసుకోవాలా లేక రెడ్‌మి 4ఏను తీసుకోవాలా..?

రెడ్‌మి 4ను తీసుకోవాలా లేక రెడ్‌మి 4ఏను తీసుకోవాలా..?

ఈ నేపథ్యంలో చాలా మంది యూజర్లు రెడ్‌మి 4ను తీసుకోవాలా లేక రెడ్‌మి 4ఏను తీసుకోవాలా అన్న సందేహంలో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం రూ.1000 తేడాతో లభ్యమవుతోన్న ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి spec comparisonను ఇప్పుడు చూద్దాం..

డిజైన్ అండ్ డిస్‌ప్లే

డిజైన్ అండ్ డిస్‌ప్లే

బాడీ డిజైన్ విషయానికి వచ్చేసరికి రెడ్‌మి 4 ఫోన్‌ మెటల్ బాడీతో వస్తోంది. ఇదే సమయంలో రెడ్‌మి 4ఏ ప్లాస్టిక్ బాడీని కలిగి ఉంటుంది. డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి ఈ రెండు ఫోన్‌లు 5 అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. రెడ్‌మి 4 మోడల్‌కు 2.5డి కర్వుడ్ గ్లాస్ అదనపు ఆకర్షణగా నిలుస్తుంది.

ప్రాసెసర్

ప్రాసెసర్

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి, రెడ్‌మి 4 ఫోన్‌ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 చిప్‌సెట్ పై రన్ అవుతుంది. ఇదే సమయంలో రెడ్‌మి 4ఏ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 435 చిప్‌సెట్ పై రన్ అవుతుంది.

ర్యామ్ ఇంకా స్టోరేజ్

ర్యామ్ ఇంకా స్టోరేజ్

ర్యామ్ ఇంకా స్టోరేజ్ విషయానికి రెడ్‌మి 4ఏ ఫోన్ కేవలం 2జీబి ర్యామ్ ఇంకా 16జీబి స్టోరేజ్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో రెడ్‌మి 4 మోడల్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 2జీబి+16జీబి, 3జీబి +32జీబి, 4జీబి+64జీబి స్టోరేజ్.

ఫింగర్ ప్రింట్ స్కానర్  సపోర్ట్

ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్

రెడ్‌మి 4 ఫోన్‌కు ఫింగర్ ప్రింట్ స్కానర్ అదనపు ప్లస్ పాయింట్. రెడ్‌మి 4ఏలో ఈ సదుపాయం లోపించింది. ఈ రెండు ఫోన్లు 4G LTE, VoLTE, Wi-Fi, Bluetooth, GPS, USB OTG వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లను సపోర్ట్ చేస్తాయి.

కెమెరా..

కెమెరా..

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు సమానమైన 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కలిగి ఉంటాయి.

రెడ్‌మి 4 ఫోన్‌కు ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్

రెడ్‌మి 4 ఫోన్‌కు ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్

సాఫ్ట్‌వేర్ విషయంలోనూ అంతే, ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు Android 6.0.1 Marshmallow ఆధారంగా డిజైన్ చేసిన MIUI 8 పై యూజర్ ఇంటర్‌ఫేస్ పై బూట్ అవుతాయి. రెడ్‌మి 4 ఫోన్‌కు త్వరలోనే ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్ లభించే అవకాశం ఉంది.

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి

ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి రెడ్‌మి 4 మోడల్ ఏకంగా 4100mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోంది. ఇదే సమయంలో రెడ్‌మి 4ఏ మోడల్ కేవలం 3120mAh బ్యాటరీని మాత్రమే కలిగి ఉంటుంది.

 ధరలు విషయానికొస్తే..

ధరలు విషయానికొస్తే..

మార్కెట్లో రెడ్‌మి 4ఏ మోడల్ ధర రూ.5,999గా ఉంది. రెడ్‌మి 4 2జీబి+16జీబి ధర రూ.6,999, 3జీబి +32జీబి వేరియంట్ ధర రూ.8,999 , 4జీబి+64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi 4 vs. Xiaomi Redmi 4A: Which Budget Smartphone Should You Pick?. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X