Redmi 4A, రూ.5,999కే బెస్ట్ బడ్జెట్ ఫోన్

చైనా స్మార్ట్‌ఫోన్‌ల కంపెనీ షియోమీ (Xiaomi) కొద్ది గంటల క్రితమే తన రెడ్మీ 4ఏ (Redmi 4A) స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. ధర రూ.5,999. మార్చి, 23 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకాల ప్రారంభమవుతాయి.

Read More : ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్, ఆఫర్లు ఇవే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెడ్మీ 4ఏ ఫోన్ బెస్ట్ ఆప్షన్..

అమెజాన్.ఇన్ అలానే Mi.comలలో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర పరిధిలో బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫొన్‌ కోసం ఎదురుచూస్తోన్న వారికి రెడ్మీ 4ఏ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్‌కు సంబంధించి మొదటి ఇంప్రెషన్స్‌ను ఇప్పుడు చూద్దాం..

ఫోన్ డిజైనింగ్..

రెడ్మీ 4ఏ ఫోన్‌ను ఒక్క చేతితో సునాయశంగా హ్యాండిల్ చేయవచ్చు. కాంపాక్ట్ బాడీతో ఈ ఫోన్ అరచేతింలో సౌకర్యవంతగా ఇమిడిపోతుంది. 5 అంగుళాల డిస్‌ప్లేను ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సులువుగా ఆపరేట్ చేయవచ్చు. యునీబాడీ పాలీకార్బోనేట్ నిర్మాణాన్ని కలిగి ఉన్న ఈ ఫోన్ ఏమాత్రం నాసిరకంగా కనిపించదు.131.5 గ్రాముల బరువును కలిగి ఉండే ఈ ఫోన్ క్యారీ చేస్తున్నప్పుడు ఏ మాత్రం బరువుగా అనిపించదు.

ఫోన్ డిస్‌ప్లే

ఇక రెడ్మీ 4ఏ ఫోన్‌‌లోని 720 పిక్సల్ డిస్‌ప్లే ప్రకాశవంతంగానూ మరింత రెస్పాన్సివ్‌గానూ అనిపిస్తుంది. ఈ డిస్‌ప్లే ఆఫర్ చేస్తున్న కలర్స్ అలానే వ్యూవింగ్ యాంగిల్స్ ఆకట్టుకుంటాయి. అవుట్ డోర్ కండీషన్‌లలో ఈ డిస్‌ప్లేను పరీక్షించాల్సి ఉంది.

ఫోన్ కెమెరా

రెడ్మీ 4ఏ ఫోన్‌కు సంబంధించి కెమెరా అంశాన్ని పరిశీలించినట్లయితే ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్, f/2.2 aperture వంటి సపోర్టివ్ ఫీచర్లను కలిగి ఉంది.పానోరమా, టైమర్, బ్యూటిఫై, ఫిల్టర్స్, ఆడియో, సీన్ వంటి మోడ్స్‌ను రెడ్మీ 4ఏ కెమెరా యాప్‌ లో ఉన్నాయి. వీటితో పనిలేకుండా మాన్యువల్ మోడ్‌లో కూడా ఫోటోకు సంబంధించి ISO, వైట్ బ్యాలన్స్‌ను మేనేజ్ చేసుకోవచ్చు. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా డీసెంట్ క్వాలిటీ సెల్ఫీలను క్యాప్చుర్ చేసుకోవచ్చు.

ఫోన్ హార్డ్‌వేర్

రెడ్మీ 4ఏ ఫోన్‌కు సంబంధించి హార్డ్‌వేర్ విభాగాన్ని పరిశీలించినట్లయితే 1.4GHz Qualcomm Snapdragon 425 చిప్‌సెట్ పై ఫోన్ రన్ అవుతుంది. ప్రాసెసర్‌కు జతగా అనుసంధానించిన అడ్రినో 308 జీపీయూ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని హ్యాండిల్ చేస్తుంది.
ఫోన్‌కు సంబంధించిన కంప్యూటింగ్ అలానే మల్టీటాస్కింగ్ వ్యవహారాలను 2జీబి ర్యామ్ చక్కబెడుతుంది. ఫోన్‌ను సదీర్ఘంగా పరీక్షించి చూసిన తరువాత అంతగా ఇబ్బందిపెట్టే పనితీరు లోపాలు ఏమి మా దృష్టికి రాలేదు.

ఫోన్ సాఫ్ట్‌వేర్

ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 4ఏ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్ధి చేసిన MIUI 8 యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతుంది. ఈ ఇంటర్‌ఫేస్ త్వరలో ఆఫర్ చేయబోయే ఏ ప్రత్యేకమైన మెసేజింగ్ ఫీచర్ ద్వారా యూజర్లు IRCTCకి సంబంధించి PNR స్టేటస్, సీట్ నెంబర్, కోచ్ నెంబర్, టైమింగ్ వంటి విషయాలను మెసేజెస్ రూపంలో తెలుసుకోగలుగుతారు.

బ్యాటరీ, స్టోరేజ్ ఇంకా కనెక్టువిటీ

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 4ఏ ఫోన్ 3,120mAh బ్యాటరీతో వస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ బ్యాటరీ సింగిల్ ఛార్జ్ పై 7 రోజుల స్టాండ్ బై టైమ్‌ను ఆఫర్ చేయగలదని కంపెనీ చెబుతోంది. స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 4ఏ ఫోన్ 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు పెంచుకోవచ్చు. కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 4ఏ ఫోన్ 4G VoLTE, వై-ఫై, బ్లుటూత్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను కలిగి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi 4A First Impressions: More than just a budget smartphone. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot