4 నిమిషాల్లో 2,50,00 ఫోన్‌లు, Redmi 4A అమ్మకాల సునామీ

సెకనకు 1500 ఆర్డర్స్, నిమిషానికి 50 లక్షల హిట్స్

|

షియోమీ నుంచి లెటెస్ట్‌గా లాంచ్ అయిన Redmi 4A స్మార్ట్‌‌ఫోన్, భారత్‌లో అమ్మకాల సునామీని సృష్టిస్తోంది. అమెజాన్ ఇండియా, Mi.comలో నిన్న మధ్యాహ్నం జరిగిన మొదిటి సేల్ కేవలం 4 నిమిషాల్లో ముగిసింది. ఈ నాలుగు నిమిషాల వ్యవధిలో దాదాపు 2,50,000 Redmi 4A ఫోన్‌లు అమ్ముడైనట్లు షియోమీ తెలిపింది.

నోకియా కొత్త ఫోన్ విడుదలైంది, ధర రూ.1950

నిమిషానికి 50 లక్షల హిట్స్

నిమిషానికి 50 లక్షల హిట్స్

సేల్ సమయంలో తమ సైట్‌కు సెకనకు 1500 ఆర్డర్స్ వచ్చాయని, నిమిషానికి 50 లక్షల హిట్స్ లభించాయని అమెజాన్ ఇండియా తెలిపింది. Redmi 4A స్మార్ట్‌‌ఫోన్‌కు సంబంధించి 10 లక్షల మంది యూజర్లు 'notify me'అలర్ట్స్‌ను కూడా పొందారని అమెజాన్ వెల్లడించింది.

Redmi 4A స్పెసిఫికేషన్స్..

Redmi 4A స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 1.4GHz స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, అడ్రినో 308 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4G VoLTE సపోర్ట్, 3,120 mAh బ్యాటరీ, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ. ధర రూ.రూ.5,999

బడ్జెట్ ఫ్రెండ్లీ ధర పరిధిలో బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫొన్‌ కోసం ఎదురుచూస్తోన్న వారికి రెడ్మీ 4ఏ ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్‌కు సంబంధించి మొదటి ఇంప్రెషన్స్‌ను ఇప్పుడు చూద్దాం..

 

డిజైనింగ్..
 

డిజైనింగ్..

రెడ్మీ 4ఏ ఫోన్‌ను ఒక్క చేతితో సునాయశంగా హ్యాండిల్ చేయవచ్చు. కాంపాక్ట్ బాడీతో ఈ ఫోన్ అరచేతింలో సౌకర్యవంతగా ఇమిడిపోతుంది. 5 అంగుళాల డిస్‌ప్లేను ఏ విధమైన ఇబ్బందులు లేకుండా సులువుగా ఆపరేట్ చేయవచ్చు. యునీబాడీ పాలీకార్బోనేట్ నిర్మాణాన్ని కలిగి ఉన్న ఈ ఫోన్ ఏమాత్రం నాసిరకంగా కనిపించదు.131.5 గ్రాముల బరువును కలిగి ఉండే ఈ ఫోన్ క్యారీ చేస్తున్నప్పుడు ఏ మాత్రం బరువుగా అనిపించ

డిస్‌ప్లే

డిస్‌ప్లే

ఇక రెడ్మీ 4ఏ ఫోన్‌‌లోని 720 పిక్సల్ డిస్‌ప్లే ప్రకాశవంతంగానూ మరింత రెస్పాన్సివ్‌గానూ అనిపిస్తుంది. ఈ డిస్‌ప్లే ఆఫర్ చేస్తున్న కలర్స్ అలానే వ్యూవింగ్ యాంగిల్స్ ఆకట్టుకుంటాయి. అవుట్ డోర్ కండీషన్‌లలో ఈ డిస్‌ప్లేను పరీక్షించాల్సి ఉంది.

కెమెరా

కెమెరా

రెడ్మీ 4ఏ ఫోన్‌కు సంబంధించి కెమెరా అంశాన్ని పరిశీలించినట్లయితే ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా ఎల్ఈడి ఫ్లాష్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్, f/2.2 aperture వంటి సపోర్టివ్ ఫీచర్లను కలిగి ఉంది.పానోరమా, టైమర్, బ్యూటిఫై, ఫిల్టర్స్, ఆడియో, సీన్ వంటి మోడ్స్‌ను రెడ్మీ 4ఏ కెమెరా యాప్‌ లో ఉన్నాయి. వీటితో పనిలేకుండా మాన్యువల్ మోడ్‌లో కూడా ఫోటోకు సంబంధించి ISO, వైట్ బ్యాలన్స్‌ను మేనేజ్ చేసుకోవచ్చు. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా డీసెంట్ క్వాలిటీ సెల్ఫీలను క్యాప్చుర్ చేసుకోవచ్చు.

 హార్డ్‌వేర్

హార్డ్‌వేర్

ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 4ఏ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్ధి చేసిన MIUI 8 యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతుంది. ఈ ఇంటర్‌ఫేస్ త్వరలో ఆఫర్ చేయబోయే ఏ ప్రత్యేకమైన మెసేజింగ్ ఫీచర్ ద్వారా యూజర్లు IRCTCకి సంబంధించి PNR స్టేటస్, సీట్ నెంబర్, కోచ్ నెంబర్, టైమింగ్ వంటి విషయాలను మెసేజెస్ రూపంలో తెలుసుకోగలుగుతారు.

బ్యాటరీ, స్టోరేజ్ ఇంకా కనెక్టువిటీ

బ్యాటరీ, స్టోరేజ్ ఇంకా కనెక్టువిటీ

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 4ఏ ఫోన్ 3,120mAh బ్యాటరీతో వస్తోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోన్న ఈ బ్యాటరీ సింగిల్ ఛార్జ్ పై 7 రోజుల స్టాండ్ బై టైమ్‌ను ఆఫర్ చేయగలదని కంపెనీ చెబుతోంది. స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 4ఏ ఫోన్ 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోంది. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు పెంచుకోవచ్చు. కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 4ఏ ఫోన్ 4G VoLTE, వై-ఫై, బ్లుటూత్, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, జీపీఎస్ వంటి కనెక్టువిటీ ఫీచర్లను కలిగి ఉంది.

జియో ప్రైమ్ ఉచితం.. అలా చేయండి, ఇలా తీసుకోండిజియో ప్రైమ్ ఉచితం.. అలా చేయండి, ఇలా తీసుకోండి

Best Mobiles in India

English summary
Xiaomi Redmi 4A sale sets a new record: 250,000 units sold in 4 minutes. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X