రూ.5,000కే Redmi ఫోన్..?

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ మరో సరికొత్త Redmi స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. Redmi 4A పేరుతో మార్చి 20న మార్కెట్లో లాంచ్ కాబోతోన్న ఈ ఫోన్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో మరో విన్నర్‌గా నిలిచే అవకాశముంది.

Read More : Moto G5 Plus లాంచ్ అయ్యింది, రూ.7,000 ఫిక్స్‌డ్ డిస్కౌంట్

రూ.5,000కే  Redmi ఫోన్..?

తొలత ఈ ఫోన్‌‌ను చైనా మార్కెట్లో లాంచ్ చేయటం జరిగింది. అక్కడ భారీ హిట్టవటంతో ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్నారు. Redmi 4A స్పెసిఫికేషన్స్.. 5 ఇంచ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 యూజర్ ఇంటర్‌ఫేస్.

Read More : ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఒకేసారి రెండు ఫేస్‌బుక్ అకౌంట్‌లను వాడటం ఎలా..?

రూ.5,000కే  Redmi ఫోన్..?

1.4GHz స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, అడ్రినో 308 జీపీయూ, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ పోర్ట్, 3,120 mAh బ్యాటరీ. చైనా మార్కెట్లో ఈ ఫోన్ ధర CNY 499 (మన కరెన్సీలో రూ.4,933).

Read More : 10 లక్షల Redmi Note 4 ఫోన్‌లు అమ్మేసాం..!

English summary
Xiaomi Redmi 4A smartphone expected to launch in India on March 20. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot