ప్రీ-ఆర్డర్ పై Redmi 4A..ఇప్పుడు 3జీబి ర్యామ్, 32జీబి స్టోరేజ్‌తో లభ్యం

Redmi 4A ప్రీ-బుకింగ్స్ మరోసారి Mi.comలో ప్రారంభమయ్యాయి. తాజాగా లాంచ్ చేసిన ఈ ఫోన్ మొత్తం రెండు వేరియంట్‌లలో అందబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ వచ్చేసరికి 2జీబి ర్యామ్ + 16జీబి స్టోరేజ్ (ధర రూ.5,999). రెండవ వేరియంట్ వచ్చేసరికి 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ (ధర రూ.6,999).

Read More : Moto X4 లాంచ్ అయ్యింది, ప్రత్యేకతలివే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆర్డర్ చేసిన 5 రోజుల్లోపు ఫోన్ డెలివరీ

ప్రీ-ఆర్డర్ చేసిన 5 రోజుల్లోపు ఫోన్ డెలివరీ ఉంటుంది. Mi.comలో ఈ ఫోన్‌లను ఆర్డర్ చేసే వారికి క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం అందుబాటులో ఉండదు. కాబట్టి, ముందుగానే క్యాష్ పే చేయవల్సి ఉంటుంది.

Redmi 4A స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 యూజర్ ఇంటర్‌ఫేస్, Qualcomm Snapdragon 425 ప్రాసెసర్, Adreno 308 GPU,ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం.

Redmi 4A స్పెసిఫికేషన్స్..

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హైబ్రీడ్ స్లాట్, 3120mAh బ్యాటరీ, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్ చిప్. మూడు కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. వాటి వివరాలు డార్క్ గ్రే, గోల్డ్ ఇంకా పింక్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi 4A up For Pre-Orders on Xiaomi India Website. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot