షియోమి నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్, మార్చి 14న విడుదల

Written By:

చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం షియోమి భారత మార్కెట్లో రివ్వున దూసుకెళుతోంది. దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ అగ్రస్థానంలో ఉండగా, షియోమీ ఇటీవలే దాన్ని వెనుకకు నెట్టివేసింది. కాగా ఇటీవల కాలంలో కంపెనీ రెడ్ మీ నోట్ 5, 5 ప్రోలను ఆవిష్కరించగా కొన్ని నెలల క్రితమే రెడ్ మీ 5ఏ మోడల్ ను కూడా ఆవిష్కరించింది. నెల వ్యవధిలోనే ఇప్పటి వరకు రెండు టీవీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇదే దూకుడుతో ఈ నెల 14న మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయబోతోంది. అది ఏంటన్నది కంపెనీ నుంచి అధికారికంగా ఇంకా ప్రకటన అయితే రాలేదు. కాకపోతే అది రెడ్ మీ 5 కావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

మీ ఫోన్‌లో mAadhaar ఉందా..? అయితే ఇవి తెలుసుకోోండి ?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెడ్ మీ 4కు తదుపరి వర్షన్

కాగా రెడ్ మీ 4కు తదుపరి జనరేషన్ మోడల్ గా 5 రానుంది. 4ఏ మోడల్ స్థానంలో 5ఏను తీసుకురాగా, రెడ్ మీ 4 2017 మోడల్ కు సమాంతరంగా మరో స్మార్ట్‌ఫోన్‌ను ఇంకా విడుదల చేయలేదు. కనుక ఈ నెల 14న ఆవిష్కరించే మోడల్ అదేనని భావిస్తున్నారు.

రెడ్ మీ 5 ఫీచర్లు

రెడ్ మీ 5 మోడల్ లో 5.7 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 1.8 గిగాహెర్జ్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ నౌగత్ 7.1 వెర్షన్ ఓఎస్, ఎంఐయూఐ 9, 2జీబీ, 3జీబీ ర్యామ్, 16జీబీ, 32జీబీ వెర్షన్లతో ఈ మోడల్ ను కంపెనీ తీసుకొస్తున్నట్టు సమాచారం. ఇంకా 12 మెగా పిక్సల్స్ రియర్ కెమెరా, ఎల్ఈ డీ ఫ్లాష్, ముందు భాగంలో 5మెగా పిక్సల్స్ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.

షియోమి రెడ్‌మి 5ఎ ఫీచర్లు

5-inch 720p IPS LCD display
2/3 జిబి ర్యామ్, 16/32 జిబి ఇంటర్నల్ మెమొరీ, 128 జిబి విస్తరణ సామర్ధ్యం,
13 ఎంపీ కెమెరా, 1080 ఫిక్సల్ తో వీడియో షూట్ సామర్ధ్యం
5 ఎంపీ సెల్ఫీ షూటర్
Android Nougat-based MIUI 9
3,000mAh battery
dual-SIM phone supports
4G LTE, VoLTE and USB OTG.

మూడు కలర్లలో ఫోన్

మూడు కలర్లలో ఫోన్ మొత్తం మూడు కలర్లలో Dark Grey, Gold and Rose Gold లభ్యమవుతోంది. కాగా ఈ ఫోన్ Redmi 4A విజియవంతం అయిన నేపధ్యంలో దానికి కొంచెం అదనపు ఫీచర్లు జోడించి మార్కెట్లోకి తీసుకువచ్చింది.2 జిబి ర్యామ్ ధర రూ. 5,999 కాగా 3 జిబి ర్యామ్ ధరను కంపెనీ రూ. 6999గా నిర్ణయించింది. అయితే 50 లక్షల యూనిట్లు మాత్రమే మొదటి దశలో అమ్మకాలు జరుగుతాయి.

Redmi 4 స్పెసిఫికేషన్స్..

5 ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ నౌగట్ ప్రివ్యూ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4100mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్, 4జీ VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ విత్ ఆన్ ద గో, బ్లుటూత్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఫోన్ బరువు 150 గ్రాములు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi 5 India Launch Expected on March 14 More News at Gibzot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot