Home
Mobile

షియోమి గుడ్ న్యూస్, శాశ్వత ఓపెన్ సేల్‌ మీద Redmi 5

షియోమి Redmi అభిమానులకు శుభవార్తను మోసుకొచ్చింది. షియోమి నుంచి వచ్చిన అత్యంత Redmi స్మార్ట్‌ఫోన్‌ డ్‌మి 5 ఓపెన్‌ సేల్‌కు వచ్చింది.

By Hazarath Aiah

షియోమి Redmi అభిమానులకు శుభవార్తను మోసుకొచ్చింది. షియోమి నుంచి వచ్చిన అత్యంత Redmi స్మార్ట్‌ఫోన్‌ డ్‌మి 5 ఓపెన్‌ సేల్‌కు వచ్చింది. మెజాన్‌.ఇన్‌, అమెజాన్‌ ఇండియా యాప్‌, ఎంఐ.కామ్‌లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇక శాశ్వతంగా ఓపెన్‌ సేల్‌లో అందుబాటులో ఉండనున్నట్టు తెలిసింది. అంటే ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇక నుంచి ఫ్లాష్‌సేల్‌ కోసం వేచిచూడాల్సినవసరం లేదు. ఎల్లప్పుడూ ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. 2జీబీ/ 16జీబీ, 3జీబీ/ 32జీబీ, 4జీబీ/ 64జీబీ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ ఓపెన్‌ సేల్‌లో ఉంటుంది. గోల్డ్‌, బ్లాక్‌, రోజ్‌ గోల్డ్‌, బ్లూ రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అదనంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసే వారికి అమెజాన్‌ కిండ్లీ ఈబుక్స్‌పై 90 శాతం డిస్కౌంట్‌ లభించనుంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు హోల్డర్స్‌కు 5 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌, రిలయన్స్‌ జియో నుంచి డేటా, రూ.2200 క్యాష్‌బ్యాక్‌ లభించనుంది.

redmi 5

2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన రెడ్‌మీ 5 స్మార్ట్‌ఫోన్ రూ.7,795, రూ.8,770 ధరలకు లభ్యం కానుంది.
షియోమీ రెడ్‌మీ 5 ఫీచర్లు...
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

రెడ్‌మీ 5 ప్లస్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన రెడ్‌మీ 5 ప్లస్ రూ.9,745, రూ.12,675 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది.
షియోమీ రెడ్‌మీ 5 ప్లస్ ఫీచర్లు...
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi 5 Open Sale Now Permanent on Amazon India, Mi.com More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X