Redmi 5, 5 Plus లాంచ్ డేట్ షురూ !
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి తన కొత్త స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మి 5, రెడ్‌మి 5 ప్లస్ లాంచింగ్ తేదీ వివరాలను అధికారికంగా వెల్లడించింది.
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి తన కొత్త స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మి 5, రెడ్‌మి 5 ప్లస్ లాంచింగ్ తేదీ వివరాలను అధికారికంగా వెల్లడించింది. డిసెంబర్ 7న ఈ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కాగా ఈ ఫోన్లపై ఇప్పటికే అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
18:9 యాస్పెప్ట్ రేషియో డిస్‌ప్లేలతో ఈ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయని సమాచారం. రెడ్‌మి 5కి చైనీస్ టెలికమ్యూనికేషన్స్ సర్టిఫికేషన్ అథారిటీ టీనా నుంచి క్లియరెన్స్ కూడా వచ్చింది.

రెడ్‌మి 5 ఫీచర్లు ( అంచనా )
5.7 అంగుళాల హెచ్‌డీప్లస్ డిస్‌ప్లే,
యాస్పెక్ట్ రేషియో 18:9,
ఫింగర్‌ప్రింట్ స్కానర్,
స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్,
4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్,
వెనుకవైపు కెమెరా 12ఎంపీ సెన్సార్,
ముందు వైపు 5 ఎంపీ కెమెరా,
3,300 ఎంఏహెచ్ బ్యాటరీ,
ఆండ్రాయిడ్ నౌగట్ 7.0
ఫోన్ అంచనా ధర రూ.13,700

రెడ్‌మి 5 ప్లస్ ఫీచర్లు ( అంచనా )
5.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ డిస్‌ప్లే
ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్,
3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్,
వెనుకవైపు రెండు కెమెరాలు,
4000 ఎంఏహెచ్ బ్యాటరీ

దేశ్ కా స్మార్ట్‌ఫోన్ లాంచ్
కాగా నేడు షియోమి నేడు అత్యంత ప్రతిష్టాత్మకమైన దేశ్ కా స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేయబోతోంది. దేశీయ స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీకి ఇది అత్యంత కీలకమైన విషయమని షియోమి తెలిపింది.

దేశ్ కా స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు ( అంచనా)
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








