Redmi 5, Redmi 5 ప్లస్ రిలీజ్, బడ్జెట్ ధరకే..

చైనా మొబైల్ దిగ్గజం షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మీ 5, రెడ్‌మీ 5 ప్లస్‌లను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది.

By Hazarath
|

చైనా మొబైల్ దిగ్గజం షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్లు రెడ్‌మీ 5, రెడ్‌మీ 5 ప్లస్‌లను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. కాగా ఈ ఫోన్లు భారత మార్కెట్లోకి రావడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. 18:9 aspect ratio with thin bezels డిస్‌ప్లేతో ఈ రెండు ఫోన్లు మార్కెట్లోకి దూసుకువచ్చాయి. ఈ ఫోన్ల అమ్మకాలు డిసెంబర్ 12 నుంచి చైనాలో ప్రారంభం కానున్నాయి.

 

షియోమి ఖరీదైన స్మార్ట్‌ఫోన్ Mi Mix 2పై రూ.5 వేలు తగ్గింపుషియోమి ఖరీదైన స్మార్ట్‌ఫోన్ Mi Mix 2పై రూ.5 వేలు తగ్గింపు

ర్యామ్, స్టోరేజ్

ర్యామ్, స్టోరేజ్

2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన రెడ్‌మీ 5 స్మార్ట్‌ఫోన్ రూ.7,795, రూ.8,770 ధరలకు లభ్యం కానుంది.

షియోమీ రెడ్‌మీ 5 ఫీచర్లు...

షియోమీ రెడ్‌మీ 5 ఫీచర్లు...

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

రెడ్‌మీ 5 ప్లస్
 

రెడ్‌మీ 5 ప్లస్

3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన రెడ్‌మీ 5 ప్లస్ రూ.9,745, రూ.12,675 ధరలకు వినియోగదారులకు లభ్యం కానుంది.

షియోమీ రెడ్‌మీ 5 ప్లస్ ఫీచర్లు...

షియోమీ రెడ్‌మీ 5 ప్లస్ ఫీచర్లు...

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Redmi 5, Redmi 5 Plus With Bezel-Less Design, Large Battery Launched: Price, Specifications, and More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X