తొలిరోజే రెడ్‌మి 5కి సవాల్ విసిరిన భారత్ 5 ప్రొ, అదిరే ఫీచర్లు, దాని కన్నా తక్కువ ధర !

Written By:

ఇండియా మొబైల్ మార్కెట్లో పాగా వేయాలనుకున్న చైనా దిగ్గజం షియోమికి దేశీయ దిగ్గజం మైక్రోమ్యాక్స్ గట్టి సవాల్ విసిరింది. షియోమి కొత్తగా లాంచ్ చేసిన రెడ్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌కు, మైక్రోమ్యాక్స్‌ కౌంటర్‌ ఇచ్చింది. తన భారత్‌ లైనప్‌లో మరో బడ్జెట్‌ ఫోన్‌ను, రెడ్‌మి 5 లాంచింగ్‌ రోజే ప్రవేశపెట్టింది. ఆశ్చర్యకరంగా రెడ్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌, భారత్‌ 5 ప్రొ ధరలు రెండు కూడా సమానంగా 7,999 రూపాయలుగా ఉన్నాయి. కాగా మైక్రోమ్యాక్స్‌ భారత్‌ 5 ప్రొ కేవలం ఒక్క వేరియంట్‌లోనే లాంచ్‌ అయితే.. రెడ్‌మి 5 స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్లలో మార్కెట్‌లోకి వచ్చింది.

3 వేరియంట్లలో దిగిన Redmi 5, భారీ ఆఫర్లతో జియో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మైక్రోమ్యాక్స్ భారత్ 5 ప్రొ ఫీచర్లు

5.2 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డు ద్వారా విస్తరణ మెమరీకి అవకాశం, ఆండ్రాయిడ్ నౌగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ,ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌.

రెడ్‌మి 5 ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే ..

5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.ఫేస్‌ రికగ్నైజేషన్‌, స్మార్ట్‌ బ్యూటీ 3.0 యాప్‌. బ్లాక్‌, గోల్డ్‌, లేక్‌ బ్లూ, రోజ్‌ గోల్డ్‌ రంగుల్లో అందుబాటు.

ధర

కాగా రెడ్‌మి 5.. 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ ధర 8,999 రూపాయలుగా ఉంది. కాగా మైక్రోమ్యాక్స్ భారత్ 5 ప్రొ ధర 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,999 రూపాయలుగా ఉంది. అంటే షియోమి ఫోన్ కన్నా రూ.1000 తక్కువ.

భారత్ 5 ప్రొలో భారీ బ్యాటరీ

మైక్రోమ్యాక్స్ భారత్ 5 ప్రొలో భారీ బ్యాటరీ ఆదనపు ఆకర్షణ. దీని ద్వారా ఛార్జింగ్ అత్యంత ఎక్కువ సమయం వస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో పాటు ముందు భాగంలో ఉండే కెమెరాతో ఫోన్‌ను ఆటోమేటిక్‌గా అన్‌లాక్ చేయవచ్చు. కేవలం సెకన్ కన్నా తక్కువ వ్యవధిలోనే ఫోన్ అన్‌లాక్ అవుతుంది.

ఇతర ఫోన్లకు కనెక్ట్ చేసి..

అలాగే ఈ ఫోన్‌ను ఇతర ఫోన్లకు కనెక్ట్ చేసి దీన్ని పవర్ బ్యాంక్‌లా కూడా వాడుకోవచ్చు. ఇతర ఫోన్లను ఈ ఫోన్‌తో చార్జింగ్ చేసుకోవచ్చు. కెమెరాను పరిశీలిస్తే షియోమి ఫోన్ 12 ఎంపీ కెమెరాతో రాగా మైక్రోమ్యాక్స్ ఫోన్ 13 ఎంపీ కెమెరాతో దూసుకొచ్చింది. సెల్ఫీ కెమెరాలు రెండు ఒకటే.. మైక్రోమ్యాక్స్ ఫోన్ బ్లాక్ కలర్‌లో మాత్రమే వినియోగదారులకు లభిస్తున్నది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi 5 vs Micromax Bharat 5 Pro: Two new Rs 7,999 smartphones compared More news at gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot