చైనా మొబైల్ దిగ్గజం షియోమి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రెడ్‌మి 5ఏ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురాబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ స్టోర్ల ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించబోతున్నట్టు షియోమి చెబుతోంది. ప్రస్తుతానికి ఫ్లిప్‌కార్ట్, ఎం.కామ్, ఎంఐ హోమ్ స్టోర్లలో అందుబాటులో ఉన్న ఈ ఫోన్ ఆఫ్ లైన్ అమ్మకాల్లో కొనుగోలుదారులు ఎక్కువ ధరను వెచ్చించాలని కంపెనీ ఉద్యొగి ఒకరు చెబుతున్నారు.
షియోమి నుంచి దేశ్ కా స్మార్ట్‌ఫోన్, తక్కువ ధరకే !
రెండు వేరియంట్లలో..
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. 3జీబీ ర్యామ్, 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్ ఆఫ్‌లైన్ పార్టనర్ల వద్ద అమ్మకానికి, 2జీబీ ర్యామ్ వేరియంట్ ఎంఐ పార్టనర్ స్టోర్ల వద్ద మాత్రమే అమ్మకానికి వస్తున్నట్టు షియోమిపేర్కొంది.
ఆఫ్‌లైన్‌కు వచ్చేసరికి..
కాగా ప్రస్తుతానికి 2జీబీ ర్యామ్ వేరియంట్‌ను రూ.4,999కు కంపెనీ విక్రయిస్తోంది. అలాగే 3జీబీ ర్యామ్ వెర్షన్‌ను కూడా ఆన్‌లైన్, ఎంఐ హోమ్ స్టోర్ల వద్ద రూ.6,999కు విక్రయిస్తోంది. కాగా ఆఫ్‌లైన్‌కు వచ్చేసరికి 3జీబీ ర్యామ్ వేరియంట్ ధరను షియోమి పెంచేసింది.
3జీబీ ర్యామ్ వేరియంట్‌ను రూ.7,499కు..
3జీబీ ర్యామ్ వేరియంట్‌ను రూ.7,499కు ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయిస్తామని కంపెనీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అంటే లాంచింగ్ ధర కన్నా రూ. 500 ఎక్కువ పెట్టి కొనుగోలు దారులు దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
షియోమీ రెడ్‌మీ 5ఎ ఫీచర్లు
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2జీబీ/ 3జీబీ ర్యామ్, 16జీబీ/ 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ. Android Nougat-based MIUI 9 3,000mAh battery dual-SIM phone supports 4G LTE, VoLTE and USB OTG.
Redmi 5Aపై ఆఫర్లు
Redmi 5Aపై ఆఫర్లు, రూ. 3999కే సొంతం చేసుకోమంటున్న జియో.. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.